ఇదీ నిజం!: అప్పుల్లో జగన్ కంపెనీలో పెట్టుబడులు

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఆర్వోసి సహకారం కోరింది. దీంతో రంగ ప్రవేశం చేసిన ఆర్వోసి హెటిరో, ట్రైడాంట్ పెట్టుబడులపై జరిపిన విచారణలో ఎన్నో విషయాలు తెలిశాయట. నిబంధనల ప్రకారం పెట్టుబడులు పెట్టలేదని తేల్చిందట. జనని, జగతిలో హెటిరో గ్రూపు రూ.17.25 కోట్లను, జగతిలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ రూ.7కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఆర్వోసి స్పష్టం చేసిందట. పెట్టుబడులు పెట్టేప్పుడు లాభనష్టాలు, ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోలేదని తేల్చిందట.
జగతి పబ్లికేషన్స్, జననికి చెందిన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో వాటాల బదలాయింపునకు సంబంధించి నిషేధం ఉందని, సరైన కారణం చూపకుండా వాటాల బదలాయింపుకు వీల్లేదని, ఒకవేళ చేయాల్సి వచ్చినా కుటుంబ సభ్యులకే చేయాలని, బదలాయింపు సౌకర్యం లేకున్నా హెటిరో, ట్రైడెంట్‌కు వాటల బదలాయింపు జరిగిందని, అంతేకాకుండా హెటిరో, ట్రైడెంట్ సంస్థలు తమ రంగాలకు సంబంధం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపిందట.
మరోవైపు అప్పుల్లో ఉన్న ఆ సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని తేల్చిందట. లబ్ధి పొందినందువల్లే ఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయనేది సిబిఐ వాదనగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 1999లో పెట్టుబడులకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌కు విరుద్ధంగా హెటిరో గ్రూపు కంపెనీలు, ట్రైడెంట్ కంపెనీలు జగతి, జననిలో పెట్టుబడులు పెట్టినట్లు ఆర్వోసి వెల్లడించిందట.












Click it and Unblock the Notifications