షర్మిల యాత్ర: పద్మ ఒక్కరే, అంతా ఏమయ్యారు?

గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఏ మూల ఆందోళనలు చేసినా అక్కడ సీనియర్ నేతలు వాలిపోయేవారు. ఇప్పుడు షర్మిల పాదయాత్రలో ఎక్కడా వారు కనిపించడం లేదు. ఆ అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి, అసంతృప్తులు పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిల యాత్రలో నాయకులు లేకపోవడం పెద్ద కొరతగా కనిపిస్తోందని అంటున్నారు. తొలిదశలో పలువురు నాయకులు పాదయాత్రలో కనిపించేవారు. షర్మిల వెంట కొద్ది దూరమైనా నడిచేవారు. ఇప్పుడు అ పరిస్ధితి కూడా కనిపించటంలేదు. ఒకరిద్దరు తప్ప ముఖ్య నేత లెవరూ పాదయాత్రవైపు వెళ్ళటం మానేశారు. అప్పుడప్పుడు వైయస్ విజయమ్మ వెళ్లి వస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. వైయస్ జగన్ కోసం తన మంత్రి పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలిపెట్టిన కొండాసురేఖ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం పార్టీ కార్యాలయం వైపు కూడా తొంగిచూడటం లేదు. ఇటీవల పార్టీ గౌరవాధ్యక్షు రాలు వైఎస్ విజయమ్మ నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు విద్యుత్ చార్జీలకు నిరసనగా నిరాహారదీక్షలు చేసినా, కనీస పరామర్శకైనా ఆమె రాలేదు.
ఎప్పుడూ హడావిడి చేసే పార్టీ అధికార ప్రతినిధి సినీనటి రోజా కూడా పార్టీ కార్యక్ర మాల్లో కనుమరుగయ్యారు. పార్టీ నిర్వహించే ముఖ్య కార్యక్రమాలకు సైతం రావటం మానేశారు. మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఎప్పుడ న్నా పార్టీ కార్యక్రమాలు జరిగితే తప్ప కనిపించడం లేదు. అలాంటి అనుభవజ్ఞుల సలహాలూ తీసుకోవడం లేదు.
తెలంగాణ నేతలెవరూ షర్మిల యాత్రలో భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. రాయలసీమలో పార్టీ ఆవిర్భావంలోనే పలువురు నాయకులు జగన్ గూటికి చేరి, ఆ తర్వాత పార్టీ పరిస్థితులను గమనించి ఎంతో వేగంగా బయటపడ్డారు. ఈ స్థితిలో షర్మిల పాదయాత్రకు సీనియర్ నేతలు ఎవరూ వెళ్లడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications