టిడిపి మథనం: జగన్‌పై వ్యూహం మిస్‌ఫైర్?

వివాదస్పద జీవోల జారీ అంశాన్ని ముందుకు తెచ్చి ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, అటు కాంగ్రెసును ఇరకాటంలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం సైతం వివాదస్పద జీవోల జారీ అంశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేసింది. జగన్ ఎటువంటి తప్పు చేయకపోయిన జైలులో పెట్టారని వాదిస్తూ జీవోలు జారీ చేసిన మంత్రులను మాత్రం వదిలేస్తున్నారని వాదించడం ప్రారంభించింది.
జీవోలపై సంతకాలు చేసిన మంత్రులు బయట ఉంటే,జీవోల జారీతో ఎటువంటి సంబంధం లేని జగన్‌ను జైలులో ఎలా పెడుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారయింది. జగన్ పార్టీకి తాము పరోక్షంగా సహకరిస్తున్నామా అనే ఆలోచనలో తెలుగుదేశం నాయకులు పడ్డారు. పైగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న డిమాండ్‌నే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని మంత్రి కన్నా లక్ష్మినారాయణ అంటూ జగన్‌తో కుమ్మక్కయ్యారా అంటూ ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కుల్లో పడినట్లయింది.
కళంకిత మంత్రులను తొలగించాలనే డిమాండ్‌ను మరితం సాగదీయడం వల్ల తమకు మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కళంకితు లను మంత్రివర్గం నుండి తప్పించాలని ఇప్పటి వరకు తాము వివిధ స్థాయిలో చేసిన పోరాటం వల్లే హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు, భవనా లశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గం నుండి తప్పించారన్న విషయాన్ని విస్త్రృతంగా ప్రజ ల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కళంకిత మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొమ్ము కాస్తున్నారంటూ ప్రజల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications