వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోహ్లీ, కుక్: టెండూల్కర్ రికార్డులకు ఎసరు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులకు మానవ మాత్రులకు సాధ్యం కాదనే అభిప్రాయం ఉంటూ వస్తోంది. అందుకే, టెండూల్కర్‌ను క్రికెట్ దేవుడిగా పరిగణిస్తున్నారు. అయితే, టెండూల్కర్ రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు, 34 వేలు పరుగులు చేశాడు. వీటిని అధిగమించడం అసాధ్యమనే అభిప్రాయం ఉంటూ వచ్చింది.సచిన్ రికార్డుల్ని బ్రేక్ చేయడం చాలా కష్టమే కావచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదనే అంచనాలు సాగుతున్నాయి. ప్రస్తుత క్రికెట్ క్రీడాప్రంపంచలో వాటిని బద్దలు కొట్టే సత్తా ఇద్దరికే ఉందని అంటున్నారు. భారత యువ సంచలనం విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్‌లకు ఆ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

రికార్డులను సృష్టించడంలో సచిన్ టెండూల్కర్ అమేయమైన కృషి ఉంది. క్రమశిక్షణ, అంకితభావం ఆయనకు దాన్ని సాధ్యం చేశాయి. అతను ప్రస్తుతం క్రికెట్ క్రీడకు దూరమయ్యే దశలో ఉన్నాడు. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ వారసులు ఎవరనే ప్రశ్న వచ్చినప్పుడు టెస్టుల్లో కుక్, వన్డేల్లో కోహ్లీ పేర్లు చర్చకు వస్తున్నాయి. టెస్టు క్రికెట్లో కుక్ 21వ ఏట, వన్డేల్లో కోహ్లీ 19 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశారు. సచిన్ రెండు ఫార్మాట్లనూ 16వ ఏట నుంచే ఆడుతున్నాడు.

 Threat to Tendulkar records from Kohli and Cook

కుక్ పరుగుల ప్రవాహం

టెస్టు క్రికెట్లో కుక్ పరుగుల ప్రవాహం సచిన్ రికార్డు దిశగానే సాగుతోంది. యేటా ఇన్నింగ్సుకు ఒక సెంచరీ చొప్పున బాదేస్తున్నాడు. దాదాపుగా మాస్టర్ కూడా తన కెరీర్‌లో అంతే. గత ఏడేళ్లలోనే కుక్ 167 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఏడాదికి సరాసరి 24. మొత్తం 7607 పరుగులు చేశాడు. ఇంగ్లాండు కెప్టెన్ అమితంగా ఇష్టపడే ఫార్మాట్ కూడా ఇదే. ఇక 40 ఏళ్ల సచిన్ తన 24 ఏళ్ల కెరీర్‌లో 327 ఇన్నింగ్స్‌ల్లో 15837 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలున్నాయి. కాగా ఏడాదికి 14 ఇన్నింగ్స్‌లే ఆడాడు. అంటే కుక్ కంటే 10 తక్కువ.

కుక్ వయసు ప్రస్తుతం 28 ఏళ్లు. కెరీర్ మధ్య దశలో ఉన్నాడు. జాగ్రత్తగా ఆడితే మరో ఏడెనిమిదేళ్లు కెరీర్ కొనసాగించవచ్చు. మరో 174 ఇన్నింగ్స్‌లు ఆడితే 51 సెంచరీలు చేయొచ్చు. 15 వేల పరుగుల మైలురాయినీ అందుకోవచ్చు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరుగులు చేయగల సత్తా అతనికుంది.

విరాట్ కోహ్లీ జోరు

భారత యువ కెప్టెన్ విరాట్ కోహ్లీని చాలా మంది సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. జింబాబ్వే పర్యటనలో కెరీర్ 15వ వన్డే సెంచరీ సాధించిన కోహ్లీ అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. నిలకడగా రాణిస్తున్న కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతని వయసు ప్రస్తుతం 24 ఏళ్లు.

ఐదేళ్ల కెరీర్‌లో 108 ఇన్నింగ్స్‌లు ఆడి 4575 పరుగులు సాధించాడు. సెంచరీల సాధనలో టెండూల్కర్ కన్నా కోహ్లీదే పైచేయిగా ఉంది. సచిన్ సరాసరి తొమ్మిది ఇన్నింగ్స్‌లకు ఓ సెంచరీ కొడితే కోహ్లీ ఏడు ఇన్నింగ్స్‌లకోసారి సెంచరీ సాధించాడు. విరాట్ ఏడాదికి 21 ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. వన్డేల నుంచి తప్పుకున్న సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18426 పరుగులు సాధించాడు. ఇందులో 49 సెంచరీలున్నాయి.

విరాట్ వయసును, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే సచిన్ రికార్డులను బద్దలు కొట్టేందుకు మరో 11 ఏళ్లు ఆడాలి. అప్పటికి విరాట్ వయసు 35 అవుతుంది కాబట్టి సమస్య ఉండబోదు. కాగా కోహ్లీ గాయాల నుంచి కాపాడుకోవడంతో పాటు ధోనీ వారసుడిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాల్సి రావచ్చు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుంటూ వ్యక్తిగతంగా పరుగుల వేటలో పడాలి.

English summary
According to Cricket experts - England captain Alaister Cook and Indian Cricker Virat Kohli are having chances to brake Sachin Tendulkar's records in Teast and Oneday internationas respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X