Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి దాదాపు వేయి మంది వరకు చనిపోయారు. కొన్ని వేల మంది బాధితులయ్యారు. డైబ్బై వేల మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. వారిలో చాలామందిని సైన్యం, ఇతరులు రక్షించారు. మరికొందరు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బీభత్సం మనిషి చేసిన తప్పేనని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దేవత శాపమని భక్తులు అంటే, మానవ తప్పిదమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

మనకు జీవ రేఖ అయిన గంగా, యమున తదితర నదులకు ఇప్పుడు మానవులు తూట్లు పొడుస్తున్నారు. విద్యుత్తు ప్రాజెక్టులు, రహదారులు, భక్తియాత్రల పేరిట గంగమ్మ కుంగదీస్తున్నారు. హిమాలయ నదులు ఎత్తైన ప్రాంతం నుంచి, శరవేగంగా ప్రవహిస్తాయి. దీంతో ఇవి జల విద్యుత్తు ప్రాజెక్టులకు అనుకూలంగా మారాయి. నదులపై ఇప్పుడు భారీ స్థాయిలో జల విద్యుత్తు కేంద్రాలు నిర్మిస్తున్నారు. సొరంగాలు, అడ్డుకట్టలు, ఆనకట్టల ద్వారా నదుల సహజ ప్రవాహ మార్గాన్ని మళ్లిస్తున్నారు.

సొరంగాలు తవ్వేందుకు డైనమెట్లతో కొండలను బద్దలు కొడుతున్నారు. భారీ స్థాయిలో తుత్తునియలవుతున్న కొండ చరియలన్నీ నదిలో పడుతున్నాయి. అవి నదీ ప్రవాహానికి అడ్డు పడుతున్నాయి. గత ఏడాది ఉత్తర కాశీలో సంభవించిన ఉత్పాతానికి అచ్చంగా అసిగంగా జలవిద్యుత్తు ప్రాజెక్టే కారణమని అంటున్నారు. అక్కడ డ్యామ్ నిర్మాణం కోసం భారీ స్థాయిలో పేలుళ్లు జరిపారు.

దీంతో మట్టి, కొండరాళ్లు నదిలోపడ్డాయి. భారీ వర్షం రాగానే వరదలు ముంచుకొచ్చాయి. ఇది కేవలం ఒక్క ప్రాజెక్టు కథే అంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని 14 నదీ లోయల్లో దాదాపు 220 విద్యుత్తు, మైనింగ్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. గంగానది ఉప నదులైన అలకనంద, మందాకినిపై 70 విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించాలని ప్రతిపాదించారు. నదుల మార్గాన్ని మళ్లించేందుకు 20 కిలో మీటర్ల పొడవైన రెండు సొరంగాలను తవ్వుతున్నారు.

దీనికోసం అను నిత్యం భారీ స్థాయిలో పేలుళ్లు జరుపుతున్నారు. ఇవన్నీ నదుల గమనాన్ని మార్చి, ప్రకృతిపై ప్రభావం చూపుతుంటాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. అభివృద్ధి పేరిట మనిషి చేస్తున్న వాటికి ఈ వరదలు మచ్చుతునక అంటున్నారు. ఒకవైపు చార్‌ధామ్ యాత్ర పేరిట భక్తుల ప్రవాహం, మరోవైపు విద్యుత్ ప్రాజెక్టుల కోసం వచ్చి వాలుతున్న జనం. వీరికి వసతులు కల్పించే పేరిట విచ్చలవిడి నిర్మాణాలు చేపట్టారు.

ప్రాజెక్టుల కోసం చేపట్టిన అడవుల నరికివేత వల్ల కోతకు గురై ఆ ప్రాంతంలో భూమి బలహీనపడిపోయింది. చిన్నపాటి వరదలు, వర్షాలకు కూడా కొండచరియలు విరిగిపడిపోయే పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్ 93 శాతం పర్వాతాలతో నిండి ఉంది. జల విద్యుత్ ప్రాజెక్టులు విచ్చలవిడిగా పెరగడం, పెరుగుతున్న యాత్రికుల రద్దీ, కొండమార్గాన్ని పొక్లెయిన్లతో కుళ్లబొడుస్తూ రహదారులు నిర్మిస్తుండటం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వల్లనే ఈ విపత్కరణకు కారణాలంటున్నారు.

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదలకు నీట మునిగిన రుద్రుడు. ఈ వరదల్లో వేయికి పైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

ఉత్తరాఖండ్‌లోని వరదల్లో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు ఐఏఎఫ్ ఏర్పాటు చేసిన ఆధునాతన చాపర్

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

భగీరథి, అలకనంద బేసిన్లలోనే దాదాపు 70 జల విద్యుత్ ప్రాజెక్టులు భిన్న దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 40 దాకా 180 మెగావాట్లతో కూడిన చిన్న స్థాయి ప్రాజెక్టులే. చిన్న తరహా ప్రాజెక్టులు.. పర్యావరణానికి హితమేనని చెప్పడంలో వాస్తవం లేదని పలువురు చెబుతున్నారు.

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

ఏడమ వైపు నుండి వస్తున్న భగీరథి నది కుడి వైపు నుండి వస్తున్న అలకనందతో కలుస్తోంది. ఇక్కడి నుండే గంగా ప్రారంభం అవుతుంది. ఇక్కడ గతంలో ప్రాజెక్టు తలపెట్టినా రద్దైంది.

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

హిమాలయాల నుండి వస్తున్న అలకనంద నది ప్రవాహం.

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

కొండలలో నుండి వస్తున్న భగీరథి నది.

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

ఉత్తరాఖండ్‌లోని ఘోర ప్రళయం. భవంతి కొట్టుకుపోయిన దృశ్యం

 హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

ఉత్తరాఖండ్‌లోని వరదల కారణంగా కొట్టుకుపోయిన రహదారి. బిక్కుబిక్కుమంటున్న భక్తులు

హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సైనికులు.. ప్రాణ భయంతో ఓ మహిళ కంట నీరు.

 హాహాకారాలు: బాధ్యులెవరు, ఎందుకు?(పిక్చర్స్)

సురక్షితంగా బయటపడిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులతో భావోద్వేగం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+