జగన్ పార్టీ సమైక్యవాదం: బాబుకు కౌంటర్

Ys Jagan and Babu
హైదరాబాద్: తాము తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెబుతుంటే, మరో వైపు పార్టీ నాయకులు సమైక్యవాదంతో పోరుకు సిద్ధపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి సహా ముగ్గురు శానససభ్యులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు దాదాపుగా రాష్ట్ర విభజన అంశంపై దాదాపుగా మౌనంగా ఉంటున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెబుతున్నారు. చంద్రబాబు వైఖరి కారణంగా తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో బలహీనపడుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఇస్తే, కాంగ్రెసు పార్టీ పుంజుకుంటుందని, దానివల్ల తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ దెబ్బ తింటుందని అనుకుంటున్నారు.

తాము తెలంగాణలో వెనకబడిపోయినా సమైక్యవాదాన్ని వినిపించడం ద్వారా సీమాంధ్రలో బలం పుంజుకుంటామనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు కౌంటర్ ఇవ్వడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాయలసీమ నేతలు సమైక్యవాదాన్ని నెత్తికెత్తుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే, విజయమ్మ తెలంగాణ ప్రజల మనసును ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ జిల్లాల పర్యటనలో తొలిరోజే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు పార్టీ తరుపున విజయమ్మ నివాళులర్పించారు. తెలంగాణ జిల్లాల్లో విజయమ్మ పర్యటనలు ముగిసి ముగియగానే రాయలసీమలో ఆ పార్టీనేతల నుంచి రాష్ట్ర విభజనపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి.

రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రా యచోటి ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, పుల్లయ్య తదితరులు తమ పదవులకు రాజీనామాలుచేశారు. రాజీనామ పత్రాలను కూడా స్పీకర్‌ ఫార్మాట్‌లోనే నింపి జేఏసి కన్వీనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డికి అందజేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా రాజీనామా చేశారు.

మొత్తం మీద, తెలంగాణలో పార్టీ నాయకత్వం బలహీనంగా ఉండడంతో రాయలసీమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీల సమైక్యనినాదం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. వైయస్ జగన్ చొరవతోనే ఆ ప్రాంత నాయకులు సమైక్యనినాదం వినిపిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+