మోడీ బర్త్ డే: రెండ్రోజుల్లో 3 గిన్నిస్ రికార్డులు నమోదు!

గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం(సెప్టెంబర్ 17న) ఘనంగా జరిగాయి. కాగా, ఈ సందర్భంగా ఏకంగా మూడు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఈ 3 రికార్డులు కూడా దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సరిలో ఒకే వేదికపై 'గిన్నిస్‌' ప్రతినిధుల సమక్షంలో నమోదైనట్లు కేంద్రమంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ శనివారం ప్రకటించారు.

కాగా, ఇందులో ఒకటి శుక్రవారం సాయంత్రం.. మరో రెండు శనివారం నమోదయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

శుక్రవారం నాటి రికార్డు

ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందే(శుక్ర వారం) 1002 మంది చిన్నారులు మట్టిప్రమిదల్లో దీపాలను వెలిగించే యత్నం చేశారు. అయితే, ఇందులో 989 మంది చిన్నారులు మాత్రమే 30 సెకండ్ల వ్యవధిలో దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సాధించారు.

3 Guinness World Records Set At PM Modi's Birthday Events: BJP Minister

రెండో రికార్డు

ప్రధాని మోడీ పుట్టినరోజైన శనివారం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వెయ్యిమంది దివ్యాంగులైన చిన్నారులు చక్రాల కుర్చీల్లో కూచుని అతి పెద్ద చక్రాల కుర్చీ లోగోను ఏర్పరచారు. అంతకుముందు.. 2010లో 346 మంది దివ్యాంగులు ఇలాగే చక్రాల కుర్చీలోగోను ఏర్పరచి సాధించిన రికార్డును శనివారం నవ్‌సరిలో అధిగమించారు. చక్రాల కుర్చీకే పరిమితమైన ఈ వెయ్యిమంది కాషాయ, ధవళవర్ణపు వస్త్రాలు ధరించి..'హ్యాపీ బర్త్‌ డే పీఎం' అనే అక్షరాల రూపంగా కూడా ఏర్పాడ్డారు.

మూడో రికార్డు విషయానికొస్తే..

ఏకంగా 17వందల మంది బదిరులకు శనివారం నాడిక్కడ 3,400 వినికిడి యంత్రాలను పంపిణీచేశారు. ఈ పంపిణీ ప్రక్రియ గిన్నిస్‌ పుస్తకంలో చోటుకు అర్హత సాధించుకుంది. కాగా, దివ్యాంగురాలైన ఓ చిన్నారి బాలిక శనివారం నాడిక్కడ ప్రధాని సమక్షంలో రామాయణాన్ని పఠించింది. చిన్నారిని చూసి ముచ్చటపడిన ప్రధాని.. చటుక్కున ఆమెను ఎత్తుకుని మైకు ముందు దాకా తీసుకెళ్లి నిలబెట్టారు. చిన్నారి ప్రతిభకు అక్కడున్నవారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా, పుట్టిన రోజు సందర్భంగా నరేంద్ర మోడీ తన తల్లి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ.. ఆమె వద్దే కొంత సమయం గడిపారు. భద్రతను పక్కన బెట్టి తల్లి వద్దకు మోడీ.. ఒకే కారులో వెళ్లడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+