చంద్రబాబు ఎఫెక్ట్: దేశంలో ఏ రాష్ట్రానికీ హోదా ఉండదు
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు మన దేశంలో వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంది.
'ఏపీకి ప్రత్యేక' హోదా కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. 'ఏపీకి హోదా ఇస్తే బిహార్, ఒడిసా, బెంగాల్ తదితర రాష్ట్రాలు కూడా అడుగుతాయి. రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం అవుతుంది'' అని కేంద్రం ఏపీకి చెబుతోన్న మాట. ఈ నేపథ్యంలో అసలు ఏ రాష్ట్రానికైనా 'ప్రత్యేక హోదా' ఇవ్వడం ఎందుకు?
'ప్రత్యేక హోదా' అనే అంశాన్నే పూర్తిగా ఎత్తివేస్తేపోలా? ఇది... కేంద్ర ప్రభుత్వ తాజా ఆలోచన! ఆలోచన మాత్రమే కాదు... త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు ఈ హోదా అంశానికి సంబంధించిన ప్రతిపాదన రానుండటం గమనార్హం. మనదేశంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా 11 రాష్ట్రాలకు అమలవుతోంది. తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వరు.
ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలను కూడా 'ఆ కేటగిరీ' నుంచి తప్పిస్తారు. అయితే హోదా కింద ఇప్పటి వరకు అందుతున్న ప్రయోజనాలను మాత్రం కొనసాగిస్తారు. ఆయా రాష్ట్రాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వాటి అవసరాలకు అనుగుణంగానే ప్రయోజనాలు కల్పిస్తారు.

హోదా ఇచ్చేది ఎవరు?
జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)లో ప్రధాని, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రణాళికా సంఘం ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మండలిలోనే నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఎన్‌డీసీ రద్దు అయింది. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్రం భావిస్తోంది.

14వ ఆర్థిక సంఘం
మరోవైపు 14వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా కొనసాగించడంలో అర్థం లేదనే భావనను తన నివేదికలో వ్యక్తంచేసిందని అధికారులు పేర్కొన్నారు. కేంద్రం నుంచి అందుతున్న సహాయం, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా వచ్చే నిధులను రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడింది.

ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి రద్దు
ఈ క్రమంలో ఇప్పటికే ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి వంటి కీలక విభాగాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం రాజకీయ ఒత్తిడులు తప్పించుకునే క్రమంలో ప్రత్యేక హోదాను కూడా రద్దు చేస్తే సరిపోతుందిగా అన్న దిశగా యోచిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కేటినెట్ ముందుకు ఓ ప్రతిపాదన కూడా వచ్చిందని అంటున్నారు.

ప్రత్యేకహోదా వల్ల కలిగే లాభం
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు రెండు రకాల ప్రయోజనాలున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు వస్తాయి. అంటే ఆయా పథకాలకయ్యే మొత్తంలో 60 శాతం కేంద్రం భరిస్తే, రాష్ట్రాలు 40 శాతం భరించాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మాత్రం పది శాతం భరిస్తే చాలు. కేంద్రమే 90 శాతం ఖర్చుచేస్తుంది.












Click it and Unblock the Notifications