హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభయ్ 'క్రైమ్ కథ' దాకా: సినిమాలు చూసి ప్లాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య సంచలనం రేపింది. నిందితులు ఓ సినిమాను చూసి, దానిని అనుసరించి అభయ్‌ను చంపేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. గతంలోను ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అభయ్ నిందితులు నిత్యం యూట్యూబ్ తదితరాలను చూసి నేరపూరిత చర్యలకు సిద్ధమయ్యారని పోలీసులు గుర్తించారు. అభయ్ హత్యకు రెండు రోజుల ముందే వారు ఒక రొమాండిక్ క్రైమ్ కథ అనే సినిమాను చూసి, దానిని అనుసరించి చంపేసినట్లగా పోలీసులు నిర్ధారించారు.

కొందరు నేరగాళ్లు సినిమాలను చూసి, వాటిలోని అంశాలను తమ నేరాలకు పథకాలుగా మార్చుకొని అమలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మీడియాను కూడా వాడుకుంటున్నారని చెప్పవచ్చు. గతంలో పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాది వికారుద్దీన్, ఓ లాడ్జిలో ఎన్నారో కుటుంబాన్ని దుండగులు కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేశారు.

అభయ్

అభయ్

అభయ్ నిందితులు చిన్నసాయి, రవి, మోహన్‌లు కుర్ర తుఫాన్ సినిమాలో నటించిన బాలు పాల్ ద్వారా కూడా స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత అభయ్‌ను కిడ్నాప్ చేసేందుకు ఓ రొమాంటిక్ క్రైం కథ సినిమాను ఆదారం చేసుకున్నారు.

వికారుద్దీన్

వికారుద్దీన్

ఉగ్రవాది వికారుద్దీన్ తెహరీక్ గల్బా ఏ ఇస్లాం పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. పత్రికల్లో గుజరాత్ అల్లర్లు కథనాలు చదివి జిహాదీ కార్యకలాపాల వైపు మొగ్గాడు. తన సహచరుడితో కలిసి 2002లో 'ఆంఖే' చిత్రాన్ని చూసిన వికారుద్దీన్, అందులో చూపించిన విధంగా దోపిడీలు చేసేందుకు ఈసేవా కేంద్రాలను టార్గెట్ చేశాడు.

వికారుద్దీన్

వికారుద్దీన్

2003 జనవరిలో మలకపేట్ ఈసేవా కేంద్రంలో రెండున్నర లక్షల రూపాయలకు పైగా, డిసెంబర్ ఆఖరి వారంలో సంతోష్ నగర్ ఈసేవా కేంద్రంలో లక్షన్ర రూపాయలకు పైగా దోపిడీ చేశాడు. ఇలా వచ్చిన కొంత సొమ్ముతో జల్సాలు చేశాడు. చాలాభాగం జిహాదీ కార్యకలాపాల విస్తరణకు వినియోగించాడు. ఇతను గత ఏడాది ఎన్ కౌంటర్లో హతమయ్యాడు.

ఎన్నారైల హత్య

ఎన్నారైల హత్య

సికింద్రాబాదులోని ఆర్ఏకె లాడ్జిలో 2009లో నలుగురి హత్య జరిగింది. వారు ఎన్నారైలు. ఈ హత్య సమయంలో నిందితులు.. తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకు నేరస్థలంలో కారంపొడి చల్లారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరికి మాత్రమే నేర చరిత్ర ఉంది. ఇతడు అప్పట్లో వీడొక్కడే సినిమాను స్ఫూర్తిగా తీసుకొని, అందులో చేసినట్లు కారం పొడి చల్లాడు.

తాజ్ హత్య

తాజ్ హత్య

2009లో మహారాష్ట్రకు చెందిన మదన్ లాల్, ముఖేష్‌లు ఓ బాలీవుడ్ సినిమా స్ఫూర్తితో.. తాజ్ డెక్కన్ హోటల్లో వజ్రాల వాచీలను దొంగిలించారు. వారు ఓ బాలీవుడ్ సినిమాను చూసి.. వజ్రాలు, నగల వ్యాపారుల నుంచి సొమ్ము కాజేయాలని పథక రచన చేశారు.

English summary
The sleuths of Commissioner’s Task Force jointly worked out clues in co-ordination with local Police and made sustained and consistent efforts and solved the kidnap mystery of 15 years old boy, Abhay Modhani, in a record time of 48 hours. Abhay was abducted on the evening of March 16 from Ghode ki kabar area under the limits of Shahinayathgunj Police Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X