యుద్ధానికి సిద్ధం కండి: చైనా ఆర్మీతో జిన్‌పింగ్, భారత్‌తోనేనా?
Recommended Video

బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేశారు. యుద్ధానికి ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండాలని తమ దేశ సైన్యానికి జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పోరాడే సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ మేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించడం గమనార్హం.

పోరాడి గెలవాల్సిన యుద్ధం..
శుక్రవారం అత్యున్నత సైనిక అధికారులతో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి గెలవాల్సిన యుద్ధాలకు సైన్యాన్ని సిద్ధం చేయాలని మిలటరీ కమిషన్‌ను ఆదేశించారు.

ఆర్మీతో అధినేత
దాదాపు 23లక్షల చైనా సైన్యానికి సెంట్రల్ మిలటరీ కమిషన్ నేతృత్వం వహిస్తోంది. ఈ కమిషన్ మొత్తంలో జిన్‌పింగ్ ఒక్కరే సైనికేతర సభ్యుడు. ఆయనే ఈ కమిషన్‌కు అధ్యక్షుడు కూడా. ఆర్మీతో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇది రెండోసారి..
జిన్‌పింగ్ రెండోసారి అధికారం చేపట్టాక యుద్ధానికి సిద్ధమవ్వాలని చెప్పడం ఇది రెండో సారి కావడం గమనార్హం. చైనా కమ్యూనిస్టు పార్టీలో దివంగత మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ గుర్తింపు పొందారు.

భారత్‌తోనేనా..?
అయితే, ఎవరితో యుద్ధం చేయాలో జిన్‌పింగ్ ప్రస్తావించకపోవడం గమనార్హం. డోక్లాం, భారత్‌తో సరిహద్దు వివాదాల నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల యుద్ధం వస్తుందా? అనే వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ రెండు దేశాలు వెనక్కి తగ్గడంతో సమస్య సామరస్యంగా పరిష్కారమైన విషయం తెలిసిందే. అయితే, జిన్‌పింగ్ తాజా ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications