వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాజ్ వాదీ పార్టీ కూటమి పై బిజెపిలో ఆందోళన, బీహర్ ఫలితాలే పునరావృమౌతాయా ?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కూటమి ఏర్పాటు పై బిజెపి ఆందోళన చెందుతోంది.ఈ కూటమి వల్ల బీహర్ లో వచ్చిన ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నాయకులు అనుమానాలు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కూటమి ఏర్పాటు పై బిజెపి ఆందోళన చెందుతోంది.ఈ కూటమి వల్ల బీహర్ లో వచ్చిన ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై వ్యూహరచన చేస్తున్నారు.

ఎస్ పి తరపున ప్రచారం చేస్తానన్న లాలూ, అభ్యర్థుల జాబితాలో శివపాల్ కు దక్కనిచోటు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రెండో దఫా వరుసగా అధికారంలోకి వచ్చేలా వ్యూహత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నారు.

ములాయం కు దారేదీ కాంగ్రెస్ తో పొత్తుకు ఇంకా టైముంది,అఖిలేష్ వ్యూహమేమిటి?

తండ్రి నుండి పార్టీ పగ్గాలు తీసుకొన్న అఖిలేష్ పార్టీని నడిపిస్తున్నాడు. పార్టీలో ప్రత్యర్థులకు చెక్ పెట్టి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. మరో వైపు బిజెపిని దెబ్బతీసేందుకుగాను మరో రెండు పార్టీలతో పొత్తుకు సై అంటున్నారు.

ఆశ్చర్యం :కొడుకును ఆశీర్వదించిన తండ్రి, ములాయం వర్గానికి దెబ్బ

కాంగ్రెస్, ఆర్ ఎల్ డి పార్టీలతో సమాజ్ వాదీ పార్టీ పొత్తుకు సిద్దమైంది. సమాజ్ వాదీ పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకొంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.మరో వైపు ఆర్ ఎల్ డి కూడ ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తిని చూపుతోంది.

సమాజ్ వాదీ పార్టీ కూటమిపై బిజెపిలో కలవరం

సమాజ్ వాదీ పార్టీ కూటమిపై బిజెపిలో కలవరం

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృస్టిలో ఉంచుకొని సమాజ్ వాదీ పార్టీ ఏర్పాటుచేస్తోన్న కూటమి తమ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని బిజెపి నాయకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ దఫా ఉత్తర్ ప్రదేశ్ లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి పట్టుదలగా ఉంది. అయితే ఈ ఆశలను సమాజ్ వాదీ కూటమి తలకిందులుచేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, యూపి నేతలు కల్ రాజ్ మిశ్రా, ఇతర సీనియర్ నాయకులు డిల్లీలో సమావేశమయ్యారు. యూపి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

కూటమితో బీహర్ ఫలితాలు పునరావృతమౌతాయా?

కూటమితో బీహర్ ఫలితాలు పునరావృతమౌతాయా?

సమాజ్ వాదీ పార్టీ , కాంగ్రెస్ పార్టీ, ఆర్ ఎల్ డి లు కూటమిగా ఏర్పాటైతే బీహర్ లో వచ్చిన ఫలితాలు ఉత్తర్ ప్రదేశ్ లో పునరావృతమౌతాయా అనే అనుమానాలు బిజెపి నాయకులను వేధిస్తున్నాయి. బీహర్ ఎన్నికలను పురస్కరించుకొని చివరి నిమిషంలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు చేతులుకలిపారు. రాజకీయాల్లో ఉప్పు నిప్పు తరహాలో ఉండే ఈ నాయకులు బిజెపిని నిలువరించేందుకుగాను చేతులు కలిపారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మహకూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి బిజెపికి చెక్ పెట్టింది. మహకూటమికే ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఇవే ఫలితాలు ఉత్తర్ ప్రదేశ్ లో వస్తాయా అనే అనుమానాలు బిజెపిని వేధిస్తున్నాయి.పట్ణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. ఆర్ ఎల్ డి ఈ కూటమిలో చేరడంతో జాట్ ఓట్లు కూడ ఈ కూటమి వైపుకు మొగ్గుచూపే అవకాశం ఉంది. మరో వైపు సమాజ్ వాదీ పార్టీకి ఉన్న పట్టు తమను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

కాంగ్రెస్ తో పొత్తు ఏ మేరకు ఎస్ పి లాభం ?

కాంగ్రెస్ తో పొత్తు ఏ మేరకు ఎస్ పి లాభం ?

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుండే కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంకేతాలు పంపుతున్నారు. బిజెపిని దెబ్బతీసేందుకుగాను కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రయోజనమని ఆయన భావిస్తున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంట్ స్థానాల్లో బిజెపి 73 స్థానాలను కైవసం చేసుకొంది. రాహుల్, సోనియా మినహ ఈ రాష్ట్రం నుండి కాంగ్రెస్ మరో స్థానం దక్కించుకోలేదు. అయితే బిజెపి విజయం సాధించిన అర్బన్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది.బిఎస్ పి ఒక్క సీటు కూడ దక్కలేదు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన 11 నెలలకే జరిగిన 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి మూడు మాత్రమే దక్కించుకొంది. కుల, మత వర్గ సమీకరణాలే ఈ ఎన్నికల్లో ప్రబావం చూపాయి.దీంతో కాంగ్రస్ పార్టీతో పొత్తుకు ఎస్ పి ఆసక్తిని చూపింది. పట్టణ ప్రాంతాల్లోని 85 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వనుంది.

ములాయం ను ఒప్పించిన అఖిలేష్

ములాయం ను ఒప్పించిన అఖిలేష్

సమాజ్ వాదీ పార్టీకి ఆది నుండి ముస్లింలు అండగా ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలు ముస్లింలను ఆందోళనకు గురిచేశాయి. అయితే సమాజ్ వాదీ పార్టీతో పాటు, ఎన్నికల చిహ్నం కూడ అఖిలేష్ కు దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా తండ్రిని అఖిలేష్ ఒప్పించాడు. తాను సూచించిన అభ్యర్థులకు కూడ అఖిలేష్ టిక్కెట్లు కేటాయించాడు.దీంతో ములాయం అఖిలేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశాలు లేవని సమాజ్ వాదీ పార్టీ నాయకులు చెబుతున్నారు.

 ఆర్ ఎల్ డి తో జాట్ లు కూటమి వైపు మళ్ళే అవకాశం

ఆర్ ఎల్ డి తో జాట్ లు కూటమి వైపు మళ్ళే అవకాశం

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కూటమిలో ఆర్ ఎల్ డి కూడ ఉండే అవకాశం ఉంది.అయితే ఆర్ ఎల్ డి నేత అజిత్ సింగ్ జాట్ నాయకుడు. అజిత్ సింగ్ ఈ కూటమిలో చేరడం వల్ల జాట్ ల ఓట్లు కూడ ఈ కూటమి వైపు మళ్ళే అవకాశం ఉంది. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ జాట్ లు అత్యధికంగా ఉంటారు.వీరంతా ఈ కూటమి వైపుకు మొగ్గుచూపితే బిజెపికి ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం చూపేనా?

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం చూపేనా?

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం కూడ ఈ ఎన్నికల్లో చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారులు, పట్టణ ప్రాంత ఓటర్లు బిజెపి వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అయితే పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం వ్యాపారులపై తీవ్రంగా ఉంది. నగదు ఉపసంహరణతో పాటు, వ్యాపారాలు మందగించడంతో వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చిరు వ్యాపారులు మరింత కుదేలయ్యారు.ఈ పరిస్థితి బిజెపియేతర పక్షాలు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ పై వ్యాపారుల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బిజెపి చూస్తోంది.

English summary
bjp fear about samajwadi group alliance in uttar pradesh elections,in urban areas congress strong hold in uttarpradesh, samajwadi party allot urban seats for congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X