హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇండస్ట్రియలిస్ట్స్: జైట్లీతో కిషన్ గుసగుస (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో బిజెపి విపక్ష నేత అరుణ్ జైట్లి, జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ మంగళవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ విజయోత్సవ అభినందన సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం హైదరాబాదుకు చేరుకున్నారు.

పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర రావు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ ఇంద్రసేనా రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కెలక్ష్మణ్, రామచంద్ర రావు, ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్ తదితర నేతలు వారికి ఘన స్వాగతం పలికారు.

అక్కడి నుండి బిజెపి అగ్రనేతలు ఇటీవల మరణించిన బంగారు లక్ష్మణ్ నివాస గృహానికి వెళ్లి లక్ష్మణ్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. లక్ష్మణ్ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. వివిధ కార్యక్రమాలు, బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత రాత్రి 8 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.

రాజ్ నాథ్ సింగ్

రాజ్ నాథ్ సింగ్

భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ రాజధాని నగరంలోని ప్రముఖులను కోరారు.

రాజ్

రాజ్

ఒకపక్క రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లి ఐటిసి గ్రాండ్ కాకతీయలో పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన సమయంలోనే రాజ్‌నాథ్ సింగ్ నగర ప్రముఖులతో సమావేశమయ్యారు.

సింగ్

సింగ్

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తెలంగాణ-సీమాంధ్ర రాష్ట్రాల ఏర్పాటు అనంతర పరిస్థితులు రాజకీయ వూహాగానాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్ విజయావకాశాలు ఆరా తీశారు.

విమానాశ్రయంలో

విమానాశ్రయంలో

పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు సైతం రాజ్‌నాధ్‌సింగ్‌ను కలిసి పార్టీ పరిస్థితులను వివరించారు. బిజెపితో పొత్తునకు చాలా పార్టీలు ఎంతో ఆసక్తిని చూపుతున్నాయని, అయితే ఇంతవరకూ ఎవరితోనూ చర్చలు జరపలేదని పరోక్షంగా టిడిపిని ఉద్ధేశించి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. బంగారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

దేశంలో పారిశ్రామిక పురోగతికి బిజెపి ఆలంబనగా, అండగా ఉంటుందని రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లి పేర్కొన్నారు. పరిశ్రమల అధిపతులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికాధిపతులు బిజెపి విజయానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

అరుణ్

అరుణ్

సుస్థిర పాలన అందించే సత్తా బిజెపికి మాత్రమే ఉందని, సుస్థిర పాలనకు, ప్రగతికి, పురోగతికి బిజెపిని గెలిపించాలని అన్నారు. సిఐఐ, ఫిక్కి, సిఇఓ క్లబ్, జిటో హైదరాబాద్ చాప్టర్‌లు ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు.

జైట్లీ

జైట్లీ

ఎన్డీయే హయాంలో 8.5 శాతం ఉన్న వృద్ధి రేటు ప్రస్తుతం 4.5 శాతానికి పడిపోయిందని అన్నారు. దేశంలో మళ్లీ వాణిజ్యం-పారిశ్రామికాభివృద్ధి పెరగాలంటే ఒకే పార్టీ అత్యధిక స్థానాలతో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని అన్నారు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

దేశాభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక లేకపోగా విపరీతమైన అవినీతి కారణంగా యుపిఎ దేశ ప్రజలను నిండా ముంచిందని అన్నారు. ఎవరూ హర్షించలేని అతి తక్కువ అభివృద్ధి రేటుతో దేశాన్ని దివాలా స్థాయికి తెచ్చిందని అన్నారు.

బిజెపి

బిజెపి

గ్యాస్ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని, అదే విధంగా పారిశ్రామిక అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించలేకపోయిందని వ్యాఖ్యానించారు.

పారిశ్రామికవేత్తలు

పారిశ్రామికవేత్తలు

దేశీయ-విదేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలోనూ ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వ విధానంలో లోపం- అవినీతి చివరికి అభివృద్ధిని తిరోగమనంలో నెట్టాయని చెప్పారు.

బిజెపి

బిజెపి

మరోపక్క విపరీతంగా ధరలు పెరిగాయని, తాము ప్రధానమంత్రిని కలిసి పరిస్థితిని ఎప్పటికపుడు వివరిస్తూ వచ్చామని, అయితే ప్రధాని మన్మోహన్‌సింగ్ పట్టించుకోలేదని ఆరోపించారు.

పారిశ్రామికవేత్తలు

పారిశ్రామికవేత్తలు

దాని ఫలితంగా దేశంలో పెట్టుబడిదారులు ఎందుకు ముందుకు రావడం లేదో ఆలోచించాలని అన్నారు. దానికి కారణం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు.

పారిశ్రామికవేత్తలతో...

పారిశ్రామికవేత్తలతో...

ఏమైనా అభివృద్ధి సాధించి ఉంటే అది యాద్ధృచ్చికంగా సాధించిందే తప్ప కేంద్ర ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని, చెప్పుకోదగ్గది కూడా లేదని అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. ఈ తరుణంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని దేశానికి అందించాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

English summary
Several BJP national leaders will be attending the party’s ‘Telangana Aavirbhava Abhinandana Sabha’ meeting at Nizam College grounds on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X