వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ తీర్పు చింతమనేనికి చిక్కులు తెచ్చిందా, వైసీపీకి కాలం కలిసొచ్చినట్టేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసు ఆయన రాజకీయ జీవితానికి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. ఓ కేసులో శిక్షపడిన చింతమనేని ప్రభాకర్‌‌పై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని విపక్ష వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుండి రెండో దపా చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా లేని సమయంలో కూడ ప్రభాకర్‌పై పలు కేసులు నమోదయ్యాయి.

అయితే ఈ కేసులు చింతమనేని ప్రభాకర్‌ రాజకీయ జీవితంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ చింతమనేని ప్రభాకర్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది.

చింతమనేనికి తలనొప్పిగా మారిన కేసు

చింతమనేనికి తలనొప్పిగా మారిన కేసు

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌పై పలు కేసులు నమోదయ్యాయి . ప్రభుత్వ విప్‌గా కూడ ప్రభాకర్ ఉన్నాడు. తొలిసారిగా ఒక కేసులో జైలుశిక్ష పడింది. అది కూడా రెండేళ్లు శిక్షపడటంతో ఆయన రాజకీయ మనుగడకే ముప్పు తెచ్చేదిగా మారింది. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చింతమనేనిపై నిషేధం విధించాలనీ ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలనీ డిమాండ్‌ చేస్తున్నారు.

మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి కేసులో భీమడోలు కేసు తీర్పు

మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి కేసులో భీమడోలు కేసు తీర్పు

దెందులూరు జిల్లా పరిషత్ హైస్కూలులో 2011 నవంబర్ 26వ తేదీన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన కేసు విషయమై భీమడోలు కోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది.మూడు సెక్షన్ల ప్రకారం చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు జైలు శిక్షవిధించింది. దానిలో ఒక సెక్షన్ ప్రకారం పడిన రెండేళ్ల జైలు శిక్షే సదరు ఎమ్మెల్యే రాజకీయ జీవితానికి సవాల్‌గా మారింది. ఇది రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశంగా మారింది.

ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయి

ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయి

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెండేళ్లు జైలుశిక్ష పడినవారు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు. ఈ నిబంధన కారణంగా ప్రభాకర్‌ను ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా చర్యలు తీసుకోవాలనీ వైసీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కోటగిరి శ్రీధర్, దెందులూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కొఠారు రామచంద్రరావు ఎన్నికల సంఘం అధికారులను కలిసి విజ్ఞప్తిచేశారు. అదే సమయంలో అసెంబ్లీ కార్యదర్శని కలిసిన కొందరు వైసీపీ నేతలు.. ప్రభాకర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు

రాజకీయంగా టిడిపికి ఇబ్బందులేనా

రాజకీయంగా టిడిపికి ఇబ్బందులేనా

ఈ పరిణామలు కొంత రాజకీయంగా టిడిపికి ఇబ్బందిని కల్గించినట్టు కన్పిస్తోంది. అయితే ఈ కోర్టు తీర్పుపై పై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే కేసులు పెట్టారని గతంలో పలుమార్లు చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. ఈ తరుణంలో ఈ కేసు వ్యవహరం చింతమనేని పదవికి ముప్పును తెస్తోందా, లేదా అనేది కాలమే నిర్ణయిస్తోంది.

English summary
Political analysts said that Bhimadole Court verdict reflects on Chitamaneni Prabhakar political career.YSRCP submitted a representation to Assembly Speaker K Sivaprasada Rao seeking action against Dendulur MLA Chintamaneni Prabhakar who was convicted in a case for a period of two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X