బాబు వ్యూహం: జగన్‌ను ఇరుకున పెట్టిన భూమా!

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత పట్టు కోల్పోతున్నారా? లేక పట్టు సాధిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి పార్టీని పెట్టాక... ఇతర పార్టీల నుంచి ఆయన వైపు వరుస కట్టారు. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్తున్నారు.

రాజీనామాకి సిద్దం.. నా సవాల్ కి నువ్వు సిద్దమా..? : జగన్ కి భూమా ఛాలెంజ్

వైయస్ జగన్ పార్టీ పెట్టాక.. నాడు అధికార కాంగ్రెస్, విపక్ష టిడిపి నుంచి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉండటం గమనార్హం. అందుకు, 2014లో కచ్చితంగా జగన్ గెలుస్తారనే గట్టి అభిప్రాయం అందరిలోను కనిపించింది. అప్పటికి విభజన జరగలేదు.

booma-jagan

దీంతో, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్య నేతల వైసిపిలో చేరారు. విభజన, తదనంతర పరిణామాల నేపథ్యంలో వైసిపి కేవలం ఏపీలోనే కీలకంగా మారింది. ఏపీలో వైసిపి గెలుస్తుందని 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు అందరూ భావించారు. కానీ అది రివర్స్ అయింది.

అదే సమయంలో, 2014కి ముందు వైసిపిలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టిడిపిలోకి క్యూ కడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరఫున 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పటి దాకా ఇరవై మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ చేశారు. మరికొంతమంది కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

చేతులెత్తేసిన లక్ష్మీపార్వతి, జగన్‌కు దొరికిన చంద్రబాబు

అయితే, జగన్‌కు మొదటి నుంచి అండగా ఉన్న జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్ లాంటి నేతలు కూడా ఆయనకు షాకిచ్చారు. అంతేకాదు, కొడాలి నాని వంటి వారు కూడా పార్టీ మారినా మారవచ్చుననే ఊహాగానాలు వెలువడ్డాయి.

మొదటి నుంచి అండగా ఉన్న నేతలు వెళ్లిపోవడాన్ని జగన్ జీర్ణించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పట్టు సాధిస్తున్నారా, కోల్పోతున్నారా అనే చర్చ పార్టీలోనే సాగుతోందని అంటున్నారు.

ఐదారుగురు ఎమ్మెల్యేలు పోతే తనకు నష్టం లేదని, పదిమంది ఎమ్మెల్యేలు పోతే వెళ్లిపోతే నష్టం లేదని జగన్ చెబుతున్నారు. పార్టీని ఎమ్మెల్యేలు వీడినా కొద్ది ఆ సంఖ్యను పెంచుతూ నష్టం లేదని చెప్పుకొస్తున్నారు. కానీ జగన్ వలసలను ఆపలేకపోతున్నారని అంటున్నారు.

ఆయన వ్యూహాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. రాజ్ భవన్ ఎదుటే.. ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ చెప్పారు. దీనినే టిడిపి అనువుగా మలుచుకుంది. దీంతో, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ చెప్పారు కాబట్టి వైసిపిలోనే జీర్ణించుకోలేని ఎమ్మెల్యేలు తమ వైపు వచ్చారని చెప్పింది. అంతేకాదు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చెప్పులతో కొట్టాలని చెప్పడాన్ని చాలామంది తప్పుబట్టారు.

అదే సమయంలో, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి గెలవగల సత్తా ఉందా అని జగన్ పదేపదే చంద్రబాబును ప్రశ్నించారు. సిగ్గుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రాజీనామాల పైన ఇన్నాళ్లు నోరు మెదపని టిడిపి లేదా టిడిపిలో చేరిన వైసిపి నుంచి ఎమ్మెల్యేలు తాజాగా... పెదవి విప్పారు.

అయితే, అది కూడా వ్యూహాత్మకంగా టిడిపి పెదవి విప్పిందని చెప్పవచ్చు. ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ రాజీనామా చేసినా, తిరిగి కచ్చితంగా గెలుపొందగలే సామర్థ్యం ఉన్నవారని అంటారు. ఆ కారణంగానే జగన్ సవాల్ పైన భూమాను సీఎం చంద్రబాబు రంగంలోకి దింపారని అంటున్నారు.

ఉప ఎన్నికలు వచ్చినా కచ్చితంగా గెలువగలిగిన భూమాతోనే సవాల్ చేయించడం చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయమని అంటున్నారు. అయితే, ఇక్కడో పాయింట్ కూడా ఉంది. భూమా ఒక్కడే రాజీనామా చేస్తే, మిగతా వాళ్లు చేస్తారా లేదా అనేది ట్విస్ట్.

అంతకుముందు, భూమా సవాల్‌కు జగన్ అంగీకరించాల్సి ఉంది. ఉప ఎన్నికల్లో తాను రాజీనామాకు సిద్ధమని, అయితే తాను గెలిస్తే జగన్ వైసిపిని మూసేస్తారా అని భూమా నాగిరెడ్డి సవాల్ విసరడం గమనార్హం. దీనికి వైసిపి నేతలు స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+