వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు కొత్త ఆలోచన, మంత్రులు తికమక (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని రీతిలో తొలిసారిగా ఈ-కేబినెట్ సమావేశం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగింది. ఐప్యాడ్లు తప్ప కాగితం ఉపయోగించకుండా నిర్వహించిన మంత్రివర్గ సమావేశం హైలైట్‌గా నిలిచింది. ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు పంపిణీ చేసిన ఐపాడ్లు తప్ప టేబుల్‌పై ఒక్క కాగితం కూడా కనిపించలేదు.

ముందుగా మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నేరుగా మంత్రులకు పంపించారు. అనంతరం అంశాలవారీగా చర్చలను కూడా ఐపాడ్లను ఉపయోగించే నిర్వహించారు. ఐపాడ్ల వినియోగం కొత్త కావడంతో పలువురు మంత్రులు ఇబ్బందులు పడ్డారు. అయితే పక్కనున్న సహచరుల సాయంతో తమ సమస్యలను అధిగమించేందుకు మంత్రులు ప్రయత్నించారు.

ఇప్పటి వరకు ఈ-కేబినెట్ సమావేశాన్ని ఎక్కడా అమలు చేయకపోవడం, తొలిసారిగా రాష్ట్రంలోనే అమలు చేయడంపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపై దృష్టి సారించారు. స్వయంగా చంద్రబాబుతో ఇదే అంశంపై ఆయన చర్చించారని తెలుస్తోంది. సాంకేతిక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడంపై మోడీ హర్షం ప్రకటించారు. మరింతగా సాంకేతిక విధానాలతో అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష ఆయన వ్యక్తం చేశారు.

ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

ఆంధ్రప్రదేశ్ ఈ-కేబినెట్ సమావేశం సోమవారం సుమారు నాలుగు గంటలకు పైగా కొనసాగింది. వందరోజుల పాలన, మంత్రుల పనీ తీరు, రుణమాఫీ, నిధుల సమీకరణ పైన కేబినెట్లో చర్చించారు.

 ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

దేశంలోనే తొలి ఈ-కేబినెట్ సమావేశంగా ఈ భేటీ చరిత్ర సృష్టించింది. ఐపాడ్‌లు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ సాయంతో దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన కాగిత రహిత మంత్రివర్గ సమావేశం నాలుగు గంటల పాటి సాగింది.

ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

ఈ కేబినెట్ సమావేశం ద్వారా ఏపీ సర్కార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, చంద్రబాబు వంద రోజుల పాలన పైన నివేదికను మంత్రుల నుండి అడిగి తీసుకున్నారు. ఎవరి పని తీరు వారే సమీక్షించుకొని నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ సిటీ ఎస్ఈజెడ్‌లో హోండా పరిశ్రమ ఏర్పాటుకు 600 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

ప్రభుత్వం పథకాల అమలు తీరు పర్యవేక్షణకు గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటు. అక్టోబర్ 2 నుండి నిరంతర విద్యుత్ అమలు ప్రారంభానికి నిర్ణయం.

ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

అక్టోబర్ 2న ఎన్టీఆర్ సుజల, వృద్ధాప్య పించన్ల పెంపు ప్రారంభించాలని నిర్ణయించారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పనపై చర్చ అడ్డంకులను త్వరగా తొలగించుకోవాలని విద్యాశాఖ మంత్రికి చంద్రబాబు సూచించారు.

 ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

అవాంతరాలు తొలగిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం రుణమాఫీ అమలులో నిధుల సమీకరణకున్న అడ్డంకులు, ఎలా సమీకరించాలి.

ఈ-కేబినెట్

ఈ-కేబినెట్

అక్టోబరు మొదటి వారం నుండి రుణమాఫీ అమలుకు నిర్ణయం. అలాగే, అక్టోబర్ 2లోగా ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాటు అంశంపై చర్చించారు.

 పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

దేశంలోనే మొట్టమొదటి ఈ-కేబినెట్ సమావేశం నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం చెప్పారు.

పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ


కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరుల సమావేశంలో సాయంత్రం వివరించారు. మావోయిస్టుల పైన మరో ఏడాది నిషేధం పొడిగిస్తున్నట్లు చెప్పారు.

పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ


ప్రభుత్వ పథకాల పైన ఎక్కడికి అక్కడ కమిటీలు వేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిని అక్టోబర్ 2 నుండి 1235 గ్రామాల్లో మొదటి విడతగా ప్రారంభిస్తామని చెప్పారు. ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా విద్యుత్ లోటును భర్తీ చేస్తామని చెప్పారు.

 పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

అనంతపురం జిల్లాలో 5,500 ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.

 పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

పల్లె రఘునాథ్ రెడ్డి - నారాయణ

కర్నూలులో సౌర విద్యుత్ కోసం 5వేల ఎకరాలు కేటాయిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 132 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని చెప్పారు. లోటును ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు.

English summary

 Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and his colleagues held the first e-cabinet meeting on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X