సిఎంల్లో శ్రీమంతుడు చంద్రబాబు: నాల్గో స్థానంలో కేసిఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని ఓ అధ్యయనంలో తేలింది. దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో శ్రీమంతుడు ఆయనే.

చర, స్థిరాస్తులు కలిపితే చంద్రబాబు వ్యక్తిగత సంపద రూ. 177 కోట్లు.. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడింది. నివేదికలో పేర్కొన్న ప్రకారం ఈ వివరాలను లెక్క కట్టి ఆ సంస్థ వెల్లడించింది.

బాబు ఆస్తుల విలువ ఇదీ...

బాబు ఆస్తుల విలువ ఇదీ...

చంద్రబాబుకు ర.134,80,11,728 విలువైన చరాస్తులు, రూ.42,68,83,883 విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏడిఆర్ వెల్లడించింది. ఈ రెండు విలువలు కలిపితే చందర్బాబు ఆస్తుల విలువ మొత్తం రూ.177,78,95611 అవుతుంది.

రెండో స్థానంలో పెమా ఖండూ.

రెండో స్థానంలో పెమా ఖండూ.

అత్యంత ధనికులైన ముఖ్యమంత్రుల్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంంలో నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ.129 కోట్లకు పైగా ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులు విలువ రూ.48 కోట్లకు పైగా ఉంది.

నాలుగో స్థానంలో కేసీఆర్

నాలుగో స్థానంలో కేసీఆర్

ధనికులైన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాలుగో స్థానంలో నిలిచారు. కెసిఆర్ చరాస్తుల విలువ రూ.6,50,82,464 ఉండగా, స్థిరాస్తుల విలువ రూ.8.65 కోట్లు ఉన్నాయి. ఆ రకంగా ఆయన నాలుగో స్థానంలో నిలిచారు.

నిరుపేద సిఎంల్లో మాణిక్ సర్కార్, మమతా

నిరుపేద సిఎంల్లో మాణిక్ సర్కార్, మమతా


ముఖ్యమంత్రులు అందరిలోకి అత్యంత పేదవాడు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. ఆయన ఆస్తుల విలువ రూ.26 లక్షల 83 వేల 195 మాత్రమే. నిరుపేద ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో స్థానంలో ఉన్నారు. ఆమె ఆస్తుల విలుల రూ.30 లక్షలు మమతా బెనర్జీ వద్ద ఒక్క రూపాయి విలువ చేసే స్థిరాస్తి కూడా లేదు. నిరుపేద ముఖ్యమంత్రుల్లో జమ్మూ కాశ్మీర్ సిఎం మెహబూబా మూడో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.55 లక్షలు.

11 మంది ముఖ్యమంత్రులపై కేసులు

11 మంది ముఖ్యమంత్రులపై కేసులు

దేశంలోని 11 మంది ముఖ్యమంత్రులపై రకరకాల కేసులు నమోదైనట్లు ఎడిఆర్ నివేదిక వెల్లడించింది. వాటిలో కొన్ని కోర్టుల పరిధుల్లో ఉండగా, కొన్నింటిల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. కేసులు ఎదుర్కుంటున్నవారిలో చంద్రబాబు, కేసీఆర్ కూడా ఉన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌లపై కేసులు కూడా ఉన్నాయి. కేసీఅర్‌పై నమోదైన కేసుల్లో ఒక్కటి క్రిమినల్ కేసు.

ఫడ్నవీస్‌పై ఎక్కువ కేసులు

ఫడ్నవీస్‌పై ఎక్కువ కేసులు

దేవేంద్ర ఫడ్నవీస్‌పై అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయ. వీటిలో మూడు సీరియస్ కేసులు. కేరళ ముఖ్యమంత్రి పినరి విజయన్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయనపై 11 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పది కేసులు ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With assets worth Rs 177 crore, Chandrababu Naidu, the chief minister of Andhra Pradesh, is the richest CM in the country.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి