జగన్ ఇంటి వద్ద హైడ్రామా: రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

అమరావతి: కృష్ణా పుష్కరాలకు అతిథులను ఆహ్వానించే విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం వ్యవహించిన తీరు వివాదాస్పదమవుతోంది. పుష్కరాలకు పది రోజుల ముందే సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను, న్యాయమూర్తులను ఆహ్వనించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకు ఆహ్వానం పలకాల్సి ఉన్నా జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు.

దీంతో ఇప్పుడు ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. ప్రోటోకాల్ ప్రాకరం ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష నేతను తప్పనిసరిగా పిలవాలి. అలా పిలవడం పిలవడం లేకపోతే సాధారణంగా ఆహ్వానించకుండా వదిలేస్తారు. కానీ జగన్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు విచిత్రంగా ప్రవర్తించింది.

పుష్కరాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షనేత వైయస్ జగన్‌ ఇంటికి మంత్రి రావెల కిషోర్ బాబు, కూన రవికుమార్‌ను సీఎం చంద్రబాబు పంపించారు. అయితే పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానించడం ఏమిటని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆహ్వానం వెనుక కూడా చంద్రబాబు రాజకీయం ఉందని భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 12 (శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ పుష్కరాలకు ప్రతిపక్షనేత వైయస్ జగన్‌ను ఎందుకు అహ్వానించలేదంటూ మీడియాలో వార్తలు రావడంతో చంద్రబాబు... జగన్‌ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు దళితుడైన రావెల కిషోర్‌బాబును చంద్రబాబు పంపించారు.

దీంతో పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ను పిలిచేందుకు శుక్రవారం రాత్రి సమయంలో మంత్రి రావెల కిషోర్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే కూనరవికుమార్ జగన్‌ నివాసానికి వచ్చారు. దీంతో అయితే ఢిల్లీ నుంచి రాగానే వైయస్ జగన్ అమలాపురం వెళ్లనున్నారని, ఈ క్రమంలో ఆయనను కలవడం కుదరదని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇదేమీ పట్టించుకోకుండా కృష్ణా పుష్కరాల ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు ఇవ్వడానికి శుక్రవారం ఆయన నివాసానికి మంత్రి రావెల వెళ్లారు. కానీ అమలాపురం పర్యటన కారణంగా శుక్రవారం రాత్రి జగన్‌‌కు అపాయింట్మెంట్‌ రావెలకు దొరకలేదు.

పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ను పిలిచేందుకు టీడీపీ నేతలు రావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం పర్యటనకు వెళ్లిన జగన్ ఇంటిలో ఉన్నారా లేదా అనేది కూడా తెలుసుకోకుండా టీడీపీ నేతలు నేరుగా రావడం ఎంతవరకు సమంజసమని పార్థసారథి ప్రశ్నించారు.

అసలు పుష్కరాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షనేతను ఆహ్వానించడం ఎక్కడి సాంప్రదాయమని ప్రశ్నించారు. కేవలం జగన్‌ను బదనాం చేసేందుకు చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దీంతో మంత్రి రావెల, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లు జగన్‌ను కలవకుండానే నిరాశగా వెనుదిరిగారు.

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

దీంతో మీడియాలో ఓ కొత్త లైన్ బయటకు వచ్చింది. దళితుడైన రావెల కిశోర్ బాబును జగన్ అవమానించారంటూ మీడియాలో శుక్రవారం రాత్రి మీడియాలో వార్తలు వచ్చాయి. దళిత మంత్రి ఆహ్వానిస్తున్నారన్న భావనతోనే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ ఆ వార్తల్లో మీడియా చెప్పుకొచ్చింది.

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

దీని వెనుక పెద్ద రాజకీయ కోణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పుష్కరాలు ప్రారంభం అయిన తర్వాత ఆహ్వానం ఇస్తే జగన్ ఎలాగో అంగీకరించరని ముందే ఊహించిన ఏపీ ప్రభుత్వం, జగన్‌ దళిత మంత్రిని అవమానించారన్న నింద వేయడానికే చంద్రబాబు ఇలా రావెల కిషోర్‌బాబును పంపారని చెబుతున్నారు.

 రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

పైగా ఇటీవల అమలాపురంలో దాడులకు గురైన దళితులను జగన్‌ శుక్రవారం పరామర్శించారు. జగన్‌ వారిని పరామర్శించడం ద్వారా తామున్నామన్న భావన వారిలో కల్పించారన్న అభిప్రాయం ఏర్పడింది. దీనికి ఎలాగైనా అడ్డుకోవాలని, జగన్‌కు దళితులంటే చిన్నచూపు అని ప్రచారం చేసేందుకే ఏరికోరి మంత్రి రావెల కిషోర్ బాబును జగన్ ఇంటికి చంద్రబాబు పంపారని అంటున్నారు.

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

అంతేకాదు జగన్ ఇంట్లో లేరని తెలిసి కూడా వారు జగన్‌ను ఆహ్వానించేందుకు వెళ్లడం ఒక ప్లాన్‌గానే చెప్పుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం అమలాపురంలో దళితులపై దాడి విషయంలో టీడీపీ ప్రభుత్వం ఇరుకున పడింది. టీడీపీకి చెందిన కార్యకర్తలే దాడికి పాల్పడినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

రావెల ఆహ్వానం వెనుక చంద్రబాబు రాజకీయం

ఈ క్రమంలో జగన్ పుష్కరాల తొలిరోజైన శుక్రవారం అమలాపురం వెళ్లి దాడి జరిగిన దళితులను పరామర్శించిన నేపథ్యంలో దీనిని తమకు అనకూలంగా మలచుకోవాలనే ఉద్దేశంతో రాజకీయం చేసినట్లుగా చెప్తున్నారు. మరోవైపు మంత్రి రావెల కిషోర్ బాబు జగన్‌ను ఆలస్యంగా పిలిచి అవమానించడం లేదని, అందరినీ పిలిచినట్టుగానే జగన్‌ను పిలిచేందుకు వచ్చామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+