జగన్‌‌కు క్రెడిట్ దక్కకుండా ఎలా: చంద్రబాబుదీ అదే వ్యూహం?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chandrababu Naidu Counter Strategy on YSRCP MPs Resignation

  అమరావతి: ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీన తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద పైచేయి సాధించారు. అయితే, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు.

  క్రెడిట్ జగన్‌కు వెళ్లకుండా ఏం చేయాలనే విషయంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడమా, రాజీనామాల పర్వానికి తెర లేపడమా అనేది ఆయన తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు.

  ఏమైనా జగన్ పైచేయి

  ఏమైనా జగన్ పైచేయి

  ఏప్రిల్ 6వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తే అవి ఆమోదం పొందుతాయా, లేదా అనే మాట పక్కన పెడితే రాజీనామాలు చేయడానికి సిద్ధపడడమే పెద్ద విషయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకు వచ్చింది. ఎంపీల చేత రాజీనామా చేయించడానికి జగన్ జంకుతున్నారనే తెలుగుదేశం పార్టీ విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చినట్లయింది.

  అవునన్నా, కాదన్న చంద్రబాబు ఇరుకున పడినట్లే

  అవునన్నా, కాదన్న చంద్రబాబు ఇరుకున పడినట్లే

  జగన్ ప్రకటనతో చంద్రబాబు ఇరుకున పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు వెలుపలా, లోపల తమ ఎంపీలు పోరాటం చేస్తున్నారని చెప్పి తప్పించుకోవడానికి చంద్రబాబుకు వీలు లేకుండా పోయింది. బిజెపితో స్నేహంగా ఉంటేనే పనులు అవుతాయనే వాదనకు కూడా బలం లేకుండా పోయింది. అందుపల్ల చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని అంటున్నారు.

  చంద్రబాబు రాజీనామాలకు తెర తీయాలా..

  చంద్రబాబు రాజీనామాలకు తెర తీయాలా..

  జగన్‌ను కౌంటర్ చేయాలంటే చంద్రబాబు కూడా రాజీనామాల పర్వానికి తెర తీయాల్సిందే. ఎంపీల చేత గానీ మంత్రుల చేత గానీ ఆయన రాజీనామాలు చేయించాల్సి ఉంటుంది. ఈ విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలా, పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించాలా అనే విషయంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. Chandrababu

  ముందు ఏది చేస్తే...

  ముందు ఏది చేస్తే...

  ముందు ఏది చేస్తే జగన్‌ను తిప్పికొట్టగలమనే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎంతగా ఒత్తిడి పెట్టినా కేంద్రం దిగి వచ్చే పరిస్థితి లేదని మాత్రం అర్థమవుతోంది. చంద్రబాబును సాధ్యమైనంత వరకు కార్నర్ చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆందోళన చెందుతుంటే పుండు మీద కారం చల్లుతున్నట్లు కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చింది. అందువల్ల చంద్రబాబు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chnadrabababu Naidu strategy is to counter YSR Congress party chief YS Jagan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి