వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ‘హైటెక్కు’: ఇక ఫేస్‌టైమ్ హంగు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు హెటెక్ ముఖ్యమంత్రిగా, సిఇవోగా పేరు తెచ్చుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఆ ఒరవడిని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగించాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.

కాగితాలు వాడే సంప్రదాయానికి స్వస్తి చెప్పి పదేళ్ల క్రితం కంప్యూటర్ల ద్వారా హెటెక్ పరిపాలనను చంద్రబాబు ప్రోత్సహించారు. మొదటి దఫా సీఎంగా ఉన్నప్పుడు టెలి కాన్ఫరెన్స్‌లతో జిల్లా స్థాయి అధికారులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడుతూ వచ్చారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌లతో కొత్త ఒరవడి సృష్టించారు. ఈసారి ఆధునిక టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు మరింతగా ఆధునిక హంగులు దిద్దనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ‘ఫేస్‌ టైమ్‌' అప్లికేషన్‌ను వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిద్వారా నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఐ ఫోన్‌లోనే ఈ సదుపాయం ఉంది. ఈ నేపథ్యంలో కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్ల వంటి కీలక స్థానాల్లో ఉన్న అధికారులు విధిగా ఐ ఫోన్‌ వినియోగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.

Chandrababu to use Face Time for video conference

ఐ ఫోన్‌లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండి ఫేస్‌ టైం అప్లికేషన్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుంటే ఎవరు ఎక్కడ ఉన్నా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు. పని గట్టుకొని ఒకచోటకు వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల సమయం వృధా కాకుండా ఉంటుందని, ఈ విధానం అమలుపై సీరియస్‌గా ఆలోచిద్దామని చంద్రబాబు అధికారులతో అన్నారు. అధికారులతోపాటు ఐఫోన్‌ వినియోగించే ఎవరితోనైనా ఇదే టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంటుంది.

సాధారణంగా ముఖ్యమంత్రి ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు ప్రెస్‌ నోట్‌ విడుదల చేస్తారు. వివరంగా చెప్పాలని అనుకున్నప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇకపై ఆయన ఏదైనా అంశంపై స్పందించాలని అనుకున్నప్పుడు ఈ రెండింటితోపాటు రెండు, మూడు నిమిషాలపాటు ఆయన స్టేట్‌మెంట్‌ను వీడియోలో రికార్డ్‌ చేసి యూ ట్యూబ్‌లో పెట్టేస్తారు. మీడియా కూడా యూ ట్యూబ్‌లోనే ఆయన ప్రసంగం విని వార్తలు రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu, well known for usage of modern technology, has decided to use Face Time to conduct Video conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X