వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్లకు బాబు షాక్: రాష్ట్ర కమిటీలో దక్కని చోటు, కారణమిదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి రాష్ట్ర కమిటీలను ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నుండి వచ్చిన నేతలు,ఎమ్మెల్యేలకు టిడిపి కమిటీలో చోటు కల్పించారు. ఇదే సమయంలో పార్టీలో సీనియర్లు కొందరికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరిని రాష్ట్ర కమిటీ నుండి తప్పించారనే విమర్శలు కూడ లేకపోలేదు. అయితే అందరికీ పార్టీలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Recommended Video

Chandrababu Naidu unhappy with Modi మోడీపై బాబు అసహనం, జగన్‌కు 20 శాతం ఆఫర్ | Oneindia Telugu

తెలుగుదేశం పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కమిటీలను ప్రకటించింది. అయితే పార్టీలో సీనియర్లుగా ఉన్న కొందరికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. ఇతర పార్టీల నుండి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత టిడిపిలో చేరిన నేతలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది.

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కొందరు నేతలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు.అయితే ఈ విషయమై పలు రకాలుగా చర్చ సాగుతోంది. అయితే పార్టీలో అన్ని వర్గాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర కమిటీని కూర్పు చేసినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

సీనియర్లకు పార్టీ కమిటీలో దక్కని చోటు

సీనియర్లకు పార్టీ కమిటీలో దక్కని చోటు

టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కొందరు సీనియర్లకు పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ దఫా పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కూడ కమిటీలో చోటు దక్కలేదు.రాష్ట్ర కమిటీలో కరణం బలరామకృష్ణమూర్తికి కూడ చోటు దక్కలేదు.

ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత

ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత

2014 ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల్లో టిడిపిలో చేరిన వారికి పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలకు పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారు.

అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలకు దక్కని చోటు

అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలకు దక్కని చోటు

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి తదితరులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే పార్టీ రాష్ట్ర కమిటీలో మాత్రం కొందరు సీనియర్లకు పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. అయితే సామాజికవర్గాల సమతుల్యతను పాటించడంతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చినవారికి కూడ ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రకమిటీ కూర్పు జరిగిందనే అభిప్రాయాలను కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా పార్టీ సీనియర్లను రాష్ట్ర కమిటీ నుండి తప్పించే అవకాశాలు ఉండవంటున్నారు. అయితే రాష్ట్ర కమిటీలో చోటు దక్కనివారికి ఇతర కమిటీల్లో అవకాశం కల్పించనున్నారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

లోకేష్‌కు ప్రాధాన్యత

లోకేష్‌కు ప్రాధాన్యత

టిడిపి కమిటీలో లోకేష్‌కు ప్రాధాన్యత దక్కింది. ప్రస్తుతం లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ పదవిలో లోకేష్ కొనసాగనున్నట్టు పార్టీ ప్రకటించింది. మంత్రి పదవి చేపట్టనంతవరకు పార్టీ వ్యవహరాల్లో లోకేష్ బిజీ బిజీగా గడిపేవారు.అయితే మంత్రిపదవిని చేపట్టడంతో పార్టీ కార్యక్రమాలకు కేటాయించే సమయం కొంత తగ్గింది.అయితే పార్టీ వ్యవహరాలతో పాటు ప్రభుత్వ వ్యవహరాలను సమన్వయం చేస్తున్నారని సమాచారం.

English summary
Tdp chief Chandrababu Naidu given shock to senior leaders. Some senior leaders didn't get berth in tdp state committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X