జగన్‌ బోల్తా: బాబు యూటర్న్ సక్సెస్, ఎదురు తిరిగిన పవన్

Recommended Video

    టీడీపీ, వైసీపీ లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్, 48గంటల డెడ్‌లైన్....!

    అమరావతి: తాజా రాజకీయ పరిణామాలు హస్తినను వేడెక్కించాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య అవిశ్వాస యుద్ధం ప్రారంభమైంది. టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ ఫలితం ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

    కేంద్ర ప్రభుత్వంపై వైసిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించడం ద్వారా చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లు కనిపించారు. తెల్లారేసరికి ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని సొంతంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నారు.

     జగన్‌కు క్రెడిట్ వెళ్లకుండా...

    జగన్‌కు క్రెడిట్ వెళ్లకుండా...

    అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజకీయంగా పైచేయి సాధించినట్ల కనిపించారు. చంద్రబాబు చిక్కుల్లో పడి మరోదారి లేక వైసిపికి మద్దతు ప్రకటించడానికి ముందుకు వచ్చినట్లు కనిపించారు. కానీ, తన రాజకీయానుభవానికి పదును పెట్టి చక్రం తిప్పారు.

    జాతీయ పార్టీలు ఇలా నిలిచాయి...

    జాతీయ పార్టీలు ఇలా నిలిచాయి...

    అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైఎస్ జగన్ సరైన కసరత్తు చేయలేదనే విమర్శల నేపథ్యంలోనే కాకుండా ఆయన బిజెపితో కుమ్మక్కయ్యారనే చంద్రబాబు మాటల కారణంగా ఢిల్లీలో పరిస్థితి తారుమారైంది. అవిశ్వాస తీర్మానంపై వైసిపి తగిన కసరత్తు చేయలేదని కాంగ్రెసు నాయకుడు మల్లికార్డున ఖర్గే అన్నారు. లాబీల్లో కనిపించిన తనను మద్దతు అడిగారు తప్ప వైసిపి పార్లమెంటు సభ్యులు సరిగా కసరత్తు చేసినట్లు కనిపించడం లేదని అన్నారు.

     చంద్రబాబుకు పెరిగిన మద్దతు

    చంద్రబాబుకు పెరిగిన మద్దతు

    తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించబోయే అవిశ్వాస తీర్మానానికి జాతీయ స్థాయిలో మద్దతు పెరుగుతూ వస్తోంది. బిజెపి వ్యతిరేక పార్టీలు చాలా వరకు టిడిపికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెసు, మజ్లీస్, టీఆర్ఎస్ తదితర పార్టీలు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. చంద్రబాబుకు ఉన్న జాతీయ రాజకీయ అనుభవం మాత్రమే కాకుండా జగన్‌పై అవిశ్వాసం కూడా టిడిపికి మద్దతు పెరగడానికి కారణమని అంటున్నారు.

    ఎదురు తిరిగిన పవన్ కల్యాణ్

    ఎదురు తిరిగిన పవన్ కల్యాణ్

    తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్‌కు ఎదురు తిరిగారు. పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌ కారణంగానే వైసిపి అవిశ్వాసం ప్రతిపాదించడానికి ముందుకు వచ్చింది. తాను ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగుతానని చెప్పారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలేవీ లేవు. దాంతో పవన్ ఇప్పుడు ఎక్కడున్నారని వైసిపి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 23వ తేదీన అవిశ్వాసం ప్రతిపాదిస్తామని చెప్పిన వైసిపి నాయకులు ఇంత త్వరగా ఎందుకు ప్రతిపాదించడానికి పూనుకున్నట్లు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

     బోల్తా పడిన జగన్

    బోల్తా పడిన జగన్

    కేంద్రానికి జగన్ దగ్గర కావాలనుకుంటున్నారని, మోడీ కూడా జగన్‌తో కలిసి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు, టిడిపి నాయకులు చేసిన ప్రచారం బాగానే పనిచేసినట్లు ఉంది. మొత్తం మీద నామ్ కే వాస్తే జగన్ అవిశ్వాసాన్ని ప్రతిపాిస్తున్నారనే ప్రచారం జగన్‌కు వ్యతిరేకంగా పనిచేసింది. అనుభవ రాహిత్యం లేదా చిత్తుశుద్ధి లోపమే జగన్ రాజకీయంలో కనిపించింది. దాంతో వివిధ పార్టీలు జగన్‌ను కాకుండా చంద్రబాబును మద్దతు ఇవ్వడానికి ఎంపిక చేసుకున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+