వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని: కమిటీకి వినతుల వెల్లువ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపికకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం నగరానికి చేరుకుంది. కమిటీ సభ్యులు డాక్టర్ రతిన్ రాయ్, ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, జగన్‌షా, ఆరోమర్ రేవి విమానాశ్రయం నుంచి నేరుగా ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుని బసచేశారు. ఈ సందర్భంగా వినతుల వెల్లువ కనిపించింది.

పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా కమిటీ సభ్యులను కలిసి విశాఖను రాజధానిగా చేయాలని వినతిపత్రాలు సమర్పించారు. అయితే కమిటీ చైర్మన్‌గా ఉన్న శివరామకృష్ణన్ మాత్రం విశాఖపట్నం రాలేదు. బృందంలో ఆయన విజయవాడలో ఆ కమిటీ సభ్యులతో చేరుతారని తెలిసింది. ఈలోగా కమిటీకి ఇంచార్జీ చైర్మన్‌గా డాక్టర్ రతిన్‌రాయ్ వ్యవహరిస్తారు.

విశాఖను రాజధాని చేయాలంటూ కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్, విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బోలిశెట్టి సత్యనారాయణ కమిటీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ విషయమై తాము ఇప్పటికే ప్రధాని మన్మోహన్‌సింగ్, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తదితరులకు లేఖలు రాశామని చెప్పారు. విశాఖలో రాజధానికి కావాల్సిన అన్ని వనరులు వున్నందున తమ ప్రతిపాదనను పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు.

నిపుణుల కమిటీ..

నిపుణుల కమిటీ..

కొత్త రాజధాని ఏర్పాటు గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకుంది.

నిపుణుల కమిటీ

నిపుణుల కమిటీ

కమిటీ సభ్యులు విశాఖపట్నం చేరుకున్నప్పటికీ శివరామృష్ణన్ మాత్రం రాలేదు. ఆయన విజయవాడలో కమిటీ సభ్యులతో కలిసే అవకాశం ఉంది.

నిపుణుల కమిటీ

నిపుణుల కమిటీ

శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరిన నిపుణుల కమిటీకి విశాఖను రాజధానిగా చేయాలని వినతిపత్రాలు సమర్పించారు

నిపుణుల కమిటీ

నిపుణుల కమిటీ

కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, గ్రేటర్ కమిషనర్ ఎంవీ సత్యనారాయణ, వుడా విసి యువరాజు, ఇతర అధికారులు కలిశారు.

నిపుణుల కమిటీ

నిపుణుల కమిటీ

విశాఖ జిల్లాలో వున్న వనరులు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను నిపుణుల కమిటీ సభ్యులు సేకరించినట్టు తెలిసింది.

నిపుణుల కమిటీ

నిపుణుల కమిటీ

విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ మరోసారి సూచించారు.

నిపుణుల కమిటీ

నిపుణుల కమిటీ

విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని పలువురు నిపుణుల కమిటీ సభ్యులకు వినతిపత్రాలు సమర్పించారు.

English summary
The Sivaramakrishnan committee members reached Visakhapatnam to study on new capital for newly formed Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X