వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ పక్కకు! ఇదీ కేటీఆర్ క్రెడిట్టే: రేవంత్ రెడ్డి జోస్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నిక గెలుపు క్రెడిట్ మొత్తాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెరాస కార్యకర్తలు, అభిమానులు కట్టపెడుతున్నారు. కేటీఆర్ వ్యూహం వల్లే పాలేరు ఉప ఎన్నికల్లో గెలిచామని చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. ఇప్పుడు పాలేరు ఎన్నికల్లోను తెరాస గెలిచింది. గ్రేటర్ అనంతరం ఇప్పుడు పాలేరు ఎన్నికల క్రెడిట్‌ను కెటిఆర్‌కు కట్టబెడుతుండటం గమనార్హం.

పాలేరు ఉప ఎన్నికల్లో పలువురు మంత్రులను, దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దింపారని విపక్షాలు ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే సమయంలో తుమ్మల నాగేశ్వర రావుకు స్థానికంగా మంచి పట్టు ఉంది. ప్రజాధరణ కలిగిన నేత.

అయినప్పటికీ మంత్రి కెటిఆర్‌ను హైలెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు కేసీఆర్ వారసుడు.. కేటీఆరే అనే చెప్పే ఉద్దేశ్యంలో భాగంగానే కావొచ్చునని అంటున్నారు. కేసీఆర్ వారసులుగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నిన్నటి వరకు ప్రచారంలో ఉన్నారు.

ఇప్పుడు క్రమంగా హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గించి, కేటీఆర్‌ను హైలెట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇలాంటి అభిప్రాయాలు గతంలో పలుమార్లు చెప్పారు.

అయితే, ఇప్పుడు వారసత్వం పోరు నుంచి హరీష్ రావు తప్పుకున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో కేటీఆర్‌ను హైలెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అందులో భాగంగానే పాలేరు ఉప ఎన్నిక క్రెడిట్‌ను కేటీఆర్‌కు ఎక్కువ ఆపాదిస్తున్నారని అంటున్నారు.

మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచార ధాటికి కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతయిందని, కేటీఆర్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన పాలేరు చరిత్రలోనే ఏ పార్టీ సాధించనంత మెజారిటీ టీఆర్‌ఎస్‌కు దక్కిందని తెరాస అంటోంది. ఆయన ఇంచార్జిగా ప్రచారంలోకి అడుగుపెట్టగానే జనం నుంచి వచ్చిన స్పందన వచ్చిందని ఆకాశానికెత్తేస్తున్నారు.

కేటీఆర్ రాజకీయవ్యూహాల ముందు కాంగ్రెస్ కకావికలమైపోయిందని చెబుతున్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం కోసం సీనియర్లు ఎంతోమంది పాలేరులో మకాం వేసినా కేటీఆర్ చరిష్మా ముందు నిలబడలేకపోయారని, ఉప ఎన్నికలో ఓడితేరాజీనామా చేస్తానన్న మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించలేని స్థితిలోనే కాంగ్రెస్ ఓటమి మూటకట్టుకుందని చెబుతున్నారు.

ఉద్యమపార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా ఎలా పాలిస్తున్నదో కేటీఆర్ విడమరిచి చెప్పి ఓటర్లను ఆకట్టుకున్నారని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ప్రచారం చేసి ఒంటిచేత్తో 150 స్థానాలకు 99 చోట్ల గెలిపించడం రికార్డుగా నిలిచిందని, పాలేరు ఉప ఎన్నికలో సైతం చరిత్రలో అత్యధిక మెజారిటీ రావడం తో ప్రచారకర్తగా కేటీఆర్ వ్యూహాలపై కార్యకర్తలు ప్రశంసల జల్లు కురుస్తోందని అంటున్నారు.

కేటీఆర్‌కు క్రెడిట్

కేటీఆర్‌కు క్రెడిట్

పాలేరు ఉప ఎన్నికల క్రెడిట్‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఇచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో కేటీఆర్ గెలిపించారని, ఇప్పుడు పాలేరులో గెలిపించారని తెరాస కార్యకర్తలు, 'కేటీఆర్ యువసేన' చెబుతోంది. 'నాన్నకు ప్రేమతో.. కేటీఆర్' అంటూ పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి ఓ చిత్రాన్ని కేటీఆర్ యువసేన మంత్రికి బహూకరించింది.

కేటీఆర్‌కు క్రెడిట్

కేటీఆర్‌కు క్రెడిట్

'నాన్నకు ప్రేమతో.. కేటీఆర్' అంటూ పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి ఓ చిత్రాన్ని కేటీఆర్ యువసేన మంత్రికి బహూకరించింది. పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హవా నడుస్తోందని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. తెరాస గెలుపుపై ఆయన మాట్లాడుతూ... ఇప్పుడు కెసిఆర్ హవా ఉందని, కేసీఆర్ పాలన పైన ప్రజలు అసంతృప్తికి గురికావడం ఖాయమని, అప్పుడు వారు మరో పార్టీ వైపు చూస్తారని రేవంత్ జోస్యం చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

పాలేరు తీర్పుతో తాము తీవ్ర అసంతృప్తికి గురయ్యామని, తాము మరింత హార్డ్ వర్క్ చేస్తామని, తెలుగుదేశం తదితర ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లి ఉంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

English summary
The Palair Assembly bypoll result is the second successive loss to the TRS for the main Opposition party, the Congress, after Narayankhed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X