వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవును వారిద్దరూ కలిశారు, బ్రేక్ ఫాస్ట్ చేశారు, ఆరోపణలు చేసిన వ్యక్తి ఇంటికే వెళ్ళాడు

అవును వారిద్దరూ కలిశారు. డిల్లీ లెఫ్లినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇంటికి వెళ్ళా బ్రేక్ పాస్ట్ చేశాడు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,.గురువారం మధ్యాహ్నం జంగ్ తన పదవికి రాజీనామా చేశాడు. శుక్రవారం ఉద

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :అవును వారిద్దరూ కలిశారు. ఇద్దరికి ఒకప్పుడు పడేదికాదు. తన పదవికి రాజీనామా చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే జంగ్ , కేజ్రీవాల్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. అధికారంలో ఉన్నంత కాలం వారిద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరాల్లో కేంద్రం జోక్యం చేసుకొంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడేవారు. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయత్నించేవారని ఆయన విమర్శలవర్షం కురిపించారు. అయితే అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేయడంతో ఇద్దరి మధ్య రాజీ కుదరింది. లెఫ్టినెంట్ గవర్నర్ తో డిల్లీ ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ భేటీ నిర్వహించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో అల్పాహర విందు సమావేశం ఢిల్లీలో రాజకీయంగా సంచనలంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన పదవీకాలం ముగియకముందే నజీబ్ జంగ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

పదవీ కాలం ముగియకముందే ఆయన రాజీనామా చేయడం సంచలనమైతే, ఆయనతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం అంత కంటే పెద్ద సంచలనంగా మారింది. ఇద్దరు ఉప్పు నిప్పు మాదిరిగా ఉండేవారు.అయితే వారిద్దరి మద్య సమావేశం మాత్రం ప్రాధాన్యత సంతరించుకొంది.

పదవికి రాజీనామా చేయగానే ఇద్దరు కలవడం పట్ల చర్చ సాగుతోంది. తనను జంగ్ అల్పాహరానికి పిలిచాడని, ఈ కారణంగానే తాను ఆయన ఇంటికివెళ్ళినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే ఈ సమావేశానికి మరే ప్రాధాన్యత లేదని ఆయన కొట్టిపారేస్తున్నారు.

అరవింద్ కేజ్రీవాల్, జంగ్ మద్య సఖ్యత

అరవింద్ కేజ్రీవాల్, జంగ్ మద్య సఖ్యత

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన నజీబ్ జంగ్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్య సఖ్యత పెరిగింది. అధికారంలో ఉన్నంతకాలం వీరిద్దరి మద్య మాటల యుద్దం సాగింది. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకుగాను లెఫ్టినెంగ్ గవర్నర్ ను కేంద్రం పావుగా ఉపయోగించుకొంటుందని కేజ్రీవాల్ విమర్శలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తన అదికారాలను దుర్వినియోగం చేస్తున్నారని కూడ గతంలో ఆయనపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని అధికార బిజెపికి ఆయన తోడ్పాటును అందించే విధంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.అయితే అర్థాంతరంగా జంగ్ తన పదవికి రాజీనామా చేయడంతో మరునాడే ఆయనతో బ్రేక్ ఫాస్ట్ చేయడంతో ఇద్దరి మద్య సఖ్యత నెలకొందని వారి సన్నిహితులు చెబతున్నారు. జంగ్ పిలుపుతోనే ఆయన ఇంటికి వెళ్ళినట్టు కేజ్రీవాల్ ప్రకటించారు.

జంగ్ ఎందుకు పిలిచారంటే

జంగ్ ఎందుకు పిలిచారంటే

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన కాలంలో ఆయన చేసిన పనులతో కేజ్రీవాల్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టారు జంగ్. 2013 లో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ గా ఆయన భాద్యతలను చేపట్టారు. అయితే ఇంకా పదవీకాలం ముగియకముందే ఆయన తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. అయితే రెండేళ్ళపాటు తననకు సహకరించిన ప్రధాన మంత్రి, డిల్లీ ముఖ్యమంత్రికి, ప్రజలకు జంగ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే జంగ్ రాజీనామా విషయం తెలిసిన అరవింద్ తొలుత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.అయితే ఆయన భవిష్యత్ సంతోషంగా కొనసాగాలనే అకాంక్షను కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. అయితే పదవిలో ఉన్నకాలంలో ఏ రకంగా పనిచేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను ఆయన ముఖ్యమంత్రితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణాలతోనే జంగ్ కేజ్రీవాల్ ను బ్రేక్ ఫాస్ట్ కు పిలిచి ఉంటారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

చ్చేవారైనా సహకరిస్తారా

చ్చేవారైనా సహకరిస్తారా


డిల్లీలో నజీబ్ జంగ్ తన పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా వచ్చే లెఫ్టినెంట్ గవర్నర్ అరవింద్ కేజ్రీవాల్ కు సహకరిస్తారా అనేది చర్చసాగుతోంది. బిజెపి ని కాదని డిల్లీలో తమకు పట్టం కట్టినందుకే కేంద్రం రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టేందుకే లెప్టినెంట్ గవర్నర్ ను ఉపయోగించుకొంటుందని అరవింద్ విమర్శలు చేసేవారు.అయితే రాజకీయంగా బిజెపితో వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలమైన అధికారిని దేశ రాజధానిలో నియమిస్తే రాజకీయంగా బిజెపికి అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు.అయితే జంగ్ తరహ అధికారి మళ్ళీ వస్తే మాత్రం మరోసారి మాటల యుద్దం జరగకతప్పదు. గతంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కొత్తగా వచ్చే అధికారైనా సహకరిస్తారా, లేదా పాత తరహాలోనే కొనసాగుతారా అనే చర్చ కూడ లేకపోలేదు.

కొత్తగా వచ్చేది ఎవరు

కొత్తగా వచ్చేది ఎవరు


డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం ఎవరిని లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తోందోననే ఆసక్తి నెలకొంది. అజయ్ రాజ్ శర్మ మాజీ ఢిల్లీ పోలీస్ కమీషన్రర్, అనిల్ బజాల్ మాజీ కేంద్రహోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ,బిఎస్, బస్సీ మాజీ ఢిల్లీ పోలీసు కమీషనర్ ల పేర్లు కొత్తగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేంద్రం ఈ నలుగరి పేర్లను కాకుండా ఇంకా మరోకరిని ఎంపిక చేస్తోందా లేదా వారిలో ఒకరిని ఎంపిక చేస్తోందో చూడాలి.

English summary
delhi chief minister met on friday morning nazeeb jung at his residence in delhi.jung invited him to kajriwal for breakfast, so he went to jung's home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X