ఉద్యోగాలు ఊడాయి: సూరత్ వజ్రాల కంపెనీలపై చైనా ఎఫెక్ట్

ఏడాది క్రితం తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులకు ఫియట్ కార్లు, అపార్టుమెంట్లు, బంగారు ఆభరణాలు ఇచ్చి ప్రోత్సహించిన సూరత్ డైమండ్ కంపెనీలు మరోసారి వార్తల్లో నిలిచాయి. అయితే ఈసారి పరిస్ధితి వేరు. చైనాలో నెలకొన్న మాంద్యం, ఆర్థిక కష్టాలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి ముంచడంతో అదే ఉద్యోగులను విధుల్లోంచి తొలగించాల్సిన పరిస్ధితి ఏర్పడందని వాపోతున్నాయి.

ప్రపంచంలోనే 80 శాతం వజ్రాలను సానబట్టే పరిశ్రమలు ఉన్న సూరత్. వజ్రాభరణాల మార్కెట్‌కు పెద్దన్నగా ఉన్న చైనాలో ప్రజలు లగ్జరీ కొనుగోళ్లు మరచిపోవడం, ఆభరణాలు, వజ్రాలు అమ్ముడు కాకపోవడంతో సూరత్‌లో పరిశ్రమ ఒక్కసారిగా స్తంభించింది.

దీంతో జూన్ నెల నుంచి సూరత్‌లో సుమారు ఐదు వేల మంది వజ్రాలను పాలిష్ చేసే నిపుణులు ఉపాధిని కోల్పోయారు. చైనా నుంచి రావాల్సిన వందల కోట్ల విలువైన ఆర్డర్లు రాలేదని వజ్రాల వ్యాపారుల సైతం చేతులేత్తేశారు. అంతేకాదు ఇప్పటికే డజనుకు పైగా పెద్ద డైమండ్ కంపెనీల్లో పని ఆగిపోయింది.

దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది వజ్రాలభరణాల రంగంలో ఉపాధిని పొందుతుండగా, వారిలో 6.5 లక్షల మంది సూరత్‌లోనే ఉన్నారు. 25 ఏళ్లగా వజ్రాలకు సానబెట్టే పనిలో ఉపాధిని పొందుతున్న సునీల్ కుమార్ రాజ్ పుత్ ఉద్యోగం గత జూన్ నెలలో పోయింది.

Diamond Capital Surat Fears More Job Losses As China Slows

ముడి వజ్రాలను తెల్లని ట్యూబ్ లైట్ల కాంతుల కింద్ మరింత ఆకర్షణీయనంగ మార్చడమే సునీల్ కుమార్ రాజ్ పుత్ పని. చైనాలో నెలకొన్న అర్ధిక మాంద్యం వల్ల తిరిగి తాము చెప్పేవరకూ విధుల్లోకి రానవసరం లేదని యాజమాన్యం తేల్చి చెప్పింది.

"ప్రస్తుతం ఇస్తున్న వేతనంలో సగమిచ్చినా పనిచేసేందుకు నేను సిద్ధం. కానీ అసలు పని ఉంటేగా?" అని అంటున్నాడు 45 ఏళ్ల సునీల్ కుమార్ రాజ్ పుత్. ఖర్చులను తగ్గించుకుని, డబ్బు ఆదా చేసేందుకు గాను యూపీలోని సొంతింటికి పిల్లలను పంపించి వేశానని తెలిపాడు.

"వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే పని చేస్తున్నాం. జూన్ నుంచి వేతనం రావాల్సి వుంది. ఇల్లు గడవడం కష్టమవుతోంది" అని హీరేన్ పటేల్ (35) వ్యాఖ్యానించాడు. భారత్‌కు డైమండ్ మార్కెట్‌లో 20 శాతం చైనా నుంచే వస్తోంది.

అమెరికాతో పోలిస్తే వజ్రాలకు ఉన్న డిమాండ్‌తో పోలిస్తే ఇది రెట్టింపు. 2008 నుంచి 2013 మధ్య కాలంలో చైనాలో సరాసరి 18 శాతం వృద్ధితో వజ్రాల అమ్మకాలు పెరిగాయి. దీనివల్లే సూరత్‌లోని వజ్రాల కంపెనీలు భారీగా లాభాను నమోదు చేశాయి.

ఆ తర్వాత చైనాలో వచ్చిన మార్పులు ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్నాయని జెమ్ అండ్ జ్యూయెలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా అంచనా వేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వజ్రాభరణాల వ్యాపారం 50 శాతం తగ్గిందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+