పాలిటిక్స్, బజ్‌రంగీ బాయీజాన్: సగటు వ్యక్తి ఎమోషన్
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ (పవన్ చతుర్వేది), హర్షాలి మల్హోత్రా (షహీదా) ప్రధాన పాత్రలుగా వచ్చిన బజ్‌రంగీ బాయీజాన్ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూడాలని ప్రధాని మోడీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లకు కూడా సల్మాన్ సూచించడం గమనార్హం.
భారత్, పాకిస్తాన్... ఈ సినిమాలో చక్కని అంశాన్ని సృశించారు. మత సామరస్యం, మానవ సంబంధాలను చక్కగా ఆవిష్కరించింది. ఈ సినిమా నేటి తరం రాజకీయ నాయకులకు కూడా ఓ మంచి సూచన అని చెబుతున్నారు.
ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారనే చెప్పవచ్చు. ఈ సినిమాలో సగటు భారతీయుడు, సగటు పాకిస్తానీ మనోభావాలను ప్రతిబింబించారు. మతం, జాతీయ భావాలు మూలకథగా.. సగటు పాక్, భాతీయుల ఆలోచన ధోరణి ఇలా ఉంటుందని భావిస్తూ సినిమాలో చెప్పారు.

అన్ని మతాలు సమానమేనని, ఒకరిని మరొకరు గౌరవించుకోవాలని, పరమత సహనం ముఖ్యమని ఈ సినిమా ద్వారా చూపించారు. సల్మాన్ ఖాన్ పాత్ర... శాంతి, నిజాయితీతో కూడినది. ఆరేళ్ల పసిపాప... ఏం తెలియని వయస్సు. అలాంటి రెండు పాత్రలను తీసుకొని.. మతం, జాతీయ భావనను చూపించారు.
సినిమాలో ఇరు మతాల లేదా ఇరు దేశాల సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. శుద్ధ బ్రాహ్మణుడైన సల్మాన్ ఖాన్, పాక్‌కు చెందిన అభంశుభం తెలియని ఆరేళ్ల పాప షహీదాను సుల్తానాబాదులోని ఆమె ఇంటికి చేర్చడం కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఇది సినిమా.
సినిమాను బ్యాలెన్స్ చేస్తూ తీశారు. హనుమాన్ భక్తుడైన సల్మాన్ ఖాన్... పాక్‌కు వెళ్లాక పాప కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. మసీదులోకి ఎప్పుడూ వెళ్లని వాడు వెళ్తాడు. చివరలో మతాధిపతికి వారి ఆచారం ప్రకారం నమస్కరిస్తాడు. పాక్ మతాధిపతి కూడా జైశ్రీరాం అని వీడ్కోలు చెబుతాడు.
సల్మాన్ ఖాన్ చేసిన ఉపకారం తెలిసి.. పాక్‌లో అతనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఆయనను పంపించేందుకు సాధారణ పౌరులు బార్డర్‌లో గేటును తుత్తునియలు చేస్తారు. పసిపాప సహా అందరు జైశ్రీరాంతో వీడ్కోలు చెబుతారు. సగటు భారత్, పాకిస్తానీని కదిలించే ఎమోషనల్ సినిమా.












Click it and Unblock the Notifications