వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్-బాబు కలయిక: సంకేతమదే.. జగన్‌కు ఎసరు?, అంతా వ్యూహం ప్రకారమే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రహస్యాలేవి లేవని జనసేనాని పైకి చెబుతున్నా.. లోగుట్టు మాత్రం ఉండే ఉంటుందన్న అభిప్రాయాలు పరిశీలకుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఒకవిధంగా జగన్ సంధించబోయే పాదయాత్ర అస్త్రాన్ని పవన్ యాక్టివ్ పాలిటిక్స్ ద్వారా అడ్డుకోవాలనేది చంద్రబాబు అంతర్గత ఆలోచనగా కూడా అనిపించకమానదు.

చంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు రాచమర్యాదలు చంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు రాచమర్యాదలు

వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో దూరం పెరిగే అవకాశం.. అదే సమయంలో వైసీపీ కేంద్రానికి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. ప్రత్యామ్నాయంగా పవన్ పాలిటిక్స్ నే చంద్రబాబు నమ్ముకున్నారన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ఉద్దానం కిడ్నీ బాధితుల చుట్టూ తిరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.

పరస్పర అవగాహన:

పరస్పర అవగాహన:

సైకాలజికల్‌గా చంద్రబాబు-పవన్‌ల మధ్య తొలి నుంచి కొనసాగుతున్న సంబంధాలను గమనిస్తే.. పలు ఆసక్తికర విషయాలు బోధపడుతాయి. ఇద్దరూ ఎప్పుడు భేటీ అయినా.. లేదా.. ఒకరి గురించి ఒకరు ప్రస్తావించాల్సి వచ్చినా.. అది కచ్చితంగా సానుకూల దృక్పథంతోనే ఉంటుంది. పైగా ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని వ్యక్తం చేసే తీరు.. ఈ ఇద్దరికి పరస్పరం ఉన్న అవగాహనను స్పష్టం చేస్తుంది. ఈ విషయం గతంలోను పలుమార్లు రుజువైంది.

Recommended Video

Pawan Kalyan wrote a letter to Party Cadre
మునుపటి తరహాలోనే:

మునుపటి తరహాలోనే:

గతంలోను.. ఇప్పుడూ.. చంద్రబాబు-పవన్‌లు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు ప్రత్యక్ష విమర్శలు చేసుకున్న దాఖలా లేదు. హోదా లాంటి సీరియస్ ఇష్యూ విషయంలోను పవన్ టీడీపీ ఎంపీలను మందలించారే తప్పితే.. చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు.

అటు చంద్రబాబుది కూడా అదే వైఖరి. పవన్‌పై టీడీపీ నేతలు విరుచుకుపడుతుంటే.. జనసేనానినే వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. పవన్ మాటల్లో తప్పేమి లేదని, నేతలు ఆవేశపడవద్దని అప్పట్లో వారికి సూచించారు. పవన్ కూడా అంతే.. సమస్య ఏదైనా సీఎం మీద నమ్మకం ఉందంటూ చెప్పుకొస్తారు.

వీరిద్దరి మధ్య ఇదే అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుందనేది తాజాగా ఉద్దానం కిడ్నీ బాధితుల విషయమై చర్చించేందుకు జరిగిన భేటీ ద్వారా స్పష్టమైంది.

కలిసుంటేనే సమస్యల పరిష్కారమని!:

కలిసుంటేనే సమస్యల పరిష్కారమని!:

నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని టీడీపీ ప్రభుత్వం తొలి నుంచి చెబుతూనే ఉంది. మిగతావాళ్ల మాటెలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఇచ్చే సలహాలు, సూచనలకు మాత్రం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికైతే రాజకీయంగా పవన్‌కు పెద్ద ఉనికి లేకపోయినప్పటికీ.. టీడీపీ మాత్రం ఆయన్ను ఓ బలమైన నేతగానే చూస్తోంది.

భవిష్యత్తులోను పవన్ ఆవశ్యకతను చంద్రబాబు గుర్తించారు కాబట్టే.. ఇద్దరి మధ్య దూరమేమి లేదని చెప్పడానికే జనసేనానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. పైగా కలిసి పనిచేయడం ద్వారానే ఉద్దానం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న సంకేతాలను తాజా భేటీ ద్వారా జనంలోకి పంపించారు.

టీడీపీకి కలిసొస్తుంది..

టీడీపీకి కలిసొస్తుంది..

సమస్యల పరిష్కారం పట్ల టీడీపీ ఎంత చిత్తశుద్దిగా ఉందో చెప్పడానికి.. ఇకనుంచి ఉద్దానం విషయాన్నే ఆ పార్టీ ఉదాహరణగా చెబుతుంది. పవన్ గతంలో చాలా అంశాలే లేవనెత్తనప్పటికీ.. వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వాన్ని మళ్లీ ప్రశ్నించలేదు.

పవన్ సైతం మిగతావాటి సంగతి వదిలేసి.. ఉద్దానం విషయంలో మాత్రం ప్రభుత్వ చొరవను అభినందిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలు టీడీపీకి కలిసొచ్చే విధంగా మారాయి. సమస్యల పరిష్కారానికి టీడీపీ సానుకూలంగా ఉందనే అభిప్రాయం జనంలో కలిగేలా ఇది దోహదపడనుంది.

జగన్‌కు ఎసరు?:

జగన్‌కు ఎసరు?:

ఇక టీడీపీ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకతను బయటపెట్టడానికి బయలుదేరిన వైసీపీకి.. పవన్ ఎంట్రీ గడ్డు పరిస్థితులనే తెచ్చి పెట్టేలా తయారైంది. అక్టోబర్ నుంచి క్రియాశీలక రాజకీయాలకే పవన్ ఎక్కువ సమయం వెచ్చిస్తానని చెప్పారు. అయితే తమ ప్రత్యర్థిగా జనసేన ఎవరిని ఎంచుకుంటుందో తేలితే.. ఏపీ రాజకీయం ఎటువైపు తిరుగుతుందో అంచనా వేయవచ్చు.

ఇప్పటికైతే టీడీపీతో జనసేనకు మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు వైరుధ్యం లేదు. భవిష్యత్తులోను ఆ పార్టీ పట్ల పవన్ తటస్థ వైఖరినే అవలంభివచ్చు తప్పితే శత్రుత్వం దాకా వెళ్లే అవకాశమే లేదు.

ఇక వైసీపీతో అయితే జనసేనకు బొత్తిగా సంబంధాలే లేవు. ఇక్కడే వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు పవన్. సమస్యల పరిష్కారానికి వైసీపీని కలుపుకోవడానికి కూడా తనకెలాంటి అభ్యంతరం లేదన్న సంకేతాలు ఇచ్చారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ పై అప్పుడే ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

జగన్ పాదయాత్ర కాన్సెప్ట్ అధికార పీఠాన్ని గురిపెట్టడానికే అన్నది ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయమే. అదే సమయంలో పవన్ మాత్రం అధికారం మాటెత్తకుండా.. జనం సమస్యలు తెలుసుకునేందుకు.. వాటిని పరిష్కరించేందుకే వారి మధ్యలోకి వెళ్తానని చెబుతున్నారు. ఒకవిధంగా జగన్ ఎత్తుగడకు పవన్ ఈవిధంగా చెక్ చెప్పినట్లు అర్థమవుతోంది.

పవన్ స్టెప్ వెనుక బాబు?:

పవన్ స్టెప్ వెనుక బాబు?:

జగన్ పాదయాత్ర ప్రారంభమవడానికి కాస్త అటు ఇటుగానే పవన్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అయితే ఈ స్టెప్ వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల మాట. టీడీపీ మీద వ్యతిరేకత జగన్‌కు సానుకూలంగా మళ్లితే పార్టీకి నష్టం.. అదేదో జనసేనకు పాజిటివ్‌గా మారినా.. రేప్పొద్దున పవన్ ఆయన్ను అంటిపెట్టుకునే ఉంటారన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

2019ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉండబోదని పలు సర్వేలు చెబుతున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం పవన్‌ను బలంగా విశ్వసిస్తున్నారు. కాబట్టే ఇద్దరి మధ్య దూరం పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు, వ్యూహాలు ఎంతమేర ఫలిస్తాయన్నది మరో రెండున్నరేళ్లు ఆగితేనే గానీ చెప్పలేం.

English summary
After Janasena President Pawan Kalyan announcing about his entry into active politics, every where an interesting discussion will be going on this
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X