ప్రధానిగా కామెరూన్ చివరి లంచ్‌లో హైద్రాబాద్ బిర్యానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: బ్రెగ్జిట్ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తన చివరి లంచ్‌లో హైదరాబాద్ బిర్యానీ ఆరగించారు. గత నెల బ్రెగ్జిట్ నేపథ్యంలో కామెరూన్ రాజీనామా చేయగా, థెరిసా మే ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు.

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు బ్రిటన్ వాసులు మొగ్గు చూపారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వస్తోంది. ఈయూ నుంచి బయటకు రావొద్దని కోరుకున్న డేవిడ్ కామెరూన్ ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.

For Cameron's Last Meal As PM, Hyderabadi Saffron Chicken, Samosa

ఈ నేపథ్యంలో 10 డౌనింగ్ స్ట్రీట్‌లో చివరి మంత్రివర్గ సమాశంలో ఆయన పాల్గొన్నారు. పలు భారతీయ వంటకాలను రుచి చూశారు. అందులో హైదరాబాద్ బిర్యానీ, కాశ్మీరి రోగన్ ఘోష్, వెజ్ సమోసా, సాగ్ పనీర్, పాలక్ గోస్ట్, నాన్ బ్రెడ్, రైస్ తదితరాలు ఉన్నాయి.

ఆయన ప్రధాని హోదాలో చేసిన చివరి విందుకు తాము ఆహారాన్ని అందించామని కేంద్ర లండన్‌లో సేవలు అందిస్తున్న కేన్నింగ్టన్ తండూరీ అనే రెస్టారెంటు ట్వీట్ చేసింది. వీటితో పాటు నషాలి గోస్ట్, కేటీ మిక్స్‌డ్ గ్రిల్, చికెన్ జల్ ప్రాజీ, సాగ్ ఆలూ, నాన్ వడ్డించినట్లు చెప్పారు.

ఈ రెస్టారెంటు బ్రిటన్‌లోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఫేవరేట్ అని అంటున్నారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లోనే ముప్పై ఒక్క ఏళ్ల క్రితం అంటే 1985లో ఇది ప్రారంభమైంది. దీనిని పలువురు విదేశీ ప్రముఖులు కూడా సందర్శించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Britain’s outgoing Prime Minister David Cameron spiced up his ‘last supper’ at his 10 Downing Street office-cum-home with some spicy Indian food such as Hyderabadi Saffron Chicken, Kashmiri Rogan Josh and Samosas.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి