2ఇష్యూల్లో జగన్ కార్నర్: ఛాన్సివ్వని పవన్(పిక్చర్స్)
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ అంశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని... కాంగ్రెస్ పార్టీ, జనసేన కార్నర్ చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వచ్చి వెళ్లాకే వైసిపిలో కదలిక వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీ సైతం.. హోదా కోసం రోడ్డెక్కుతానని, పార్లమెంటులోను పోరాడుతానని చెప్పారు. అదే సమయంలో రాజధాని భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ దూసుకొచ్చారు.
ఆయన మొదటి నుండి రాజధాని భూసేకరణ విషయమై స్పందిస్తున్నారు. తద్వారా విపక్షాలైన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వడం లేదు. హోదా విషయంలో చంద్రబాబును అసెంబ్లీలో కడిగేస్తామని, రాజధాని భూసేకరణ విషయంలోను వైసిపి చెబుతున్నప్పటికీ.. హోదా విషయంలో కాంగ్రెస్, రాజధాని భూసేకరణ విషయంలో జనసేన జగన్‌ను కార్నర్ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయిు.

పవన్ కళ్యాణ్
భూసేకరణ చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే రైతు కోసం నిరాహార దీక్ష, ధర్నాలకైనా సిద్ధమేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, ప్రభుత్వం దాన్ని గుర్తించి భూసేకరణ నిర్ణయం ఉపసంహరించాలన్నారు.

పవన్ కళ్యాణ్
తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామంలోని ప్రభుత్వ కళాశాల్లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రైతులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. బలవంతపు భూసేకరణ ఆపి, పరిస్థితిపై రైతులతో చర్చించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మేథావుల కమిటీ వేయాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్
రైతుల అభిప్రాయం ప్రకారం భూసమీకరణకు చట్టబతద్ధత లేదని స్పష్టవౌతోందన్నారు. అందువల్ల ప్రభుత్వం లోపాలను సరిదిద్ది రైతులను మెప్పించే విధంగా చట్టాన్ని తయారుచేసి నిపుణులతో చర్చించిన తర్వాత భూములను తీసుకోవాలని కోరారు. సిఎం చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉన్నందున సమస్యను పరిష్కరించటం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

పవన్ కళ్యాణ్
తాను రైతుగా జీవితం సాగించాలని కోరిక ఉండేదని, రైతు సమస్యలు తనకూ తెలుసునన్నారు. చిన్నతనంలో కుటుంబ సమస్యల కారణంగా పొలం అమ్మాల్సి వస్తే బాధపడటం గుర్తుందన్నారు. తెదేపా, బిజెపిలతో గొడవపడటం తన ఉద్దేశ్యం కాదని, రాజకీయాల్లోకి వస్తే వీధి పోరాటాలు చేయాలా? అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని రైతుల కన్నీళ్ళతో రాజధాని నిర్మించాలని భావిస్తే రైతుల పక్షాన నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమన్నారు.

పవన్ కళ్యాణ్
ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి ఎంతో సమయం పట్టదని, అయితే చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యలు పరిష్కార అవుతాయనే నమ్మకం ఉందన్నారు. సుమారు గంటపాటు కొనసాగిన ప్రసంగం యావత్తూ రాసుకున్న డైరీని చూస్తూ స్పష్టమైన అవగాహనతో సావధానంగా మాట్లాడుతున్నానని, అయితే మంత్రులు తనపై చేస్తున్న ప్రకటనలు బాధకలిగిస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్
మంత్రి రావెల కిషోర్‌బాబు ఆఫ్ట్రాల్ మూడున్నర వేల ఎకరాల కోసం రాద్ధాంతం చేయటం ఏమిటంటూ వ్యాఖ్యానించడాన్ని పవన్ తప్పుబట్టారు. వైయస్ హయాంలో హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్ నిర్మిస్తున్న సమయంలో సుప్రీం కోర్టును ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ ఆశ్రయించారన్న విషయాన్ని గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్
రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు వ్యంగ్యంగా మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని రైతులు త్యాగాలు చేయాలని చెప్పటం తేలికేనని, ఆచరించటం కష్టమన్న విషయాలను గుర్తించాలన్నారు.

పవన్ కళ్యాణ్
గత ఎన్నికల్లో బిజెపి, టిడిపికి మద్దతుగా ప్రచారం చేసిన సమయంలో వారినుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారం, పదవులు కోరలేదని, రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ కావాలని, రాజధాని నిర్మాణం ప్రజల పొలాల్లో కాకుండా ఖాళీ ప్రదేశాలను ఎంచుకొని చేయాలని కోరానన్నారు.

పవన్ కళ్యాణ్
ఇప్పటికైనా మంత్రులు సమతుల్యంతో వ్యవహరించాలని కోరారు. ఎంపీలు గల్లా జయదేవ్, మురళీమోహన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రజలకు మేలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications