గవర్నర్ విందు: బాబు ఛలోక్తులు, సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా గవర్నర్ నర్సింహన్ బుధవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఇరు రాష్ట్రాల శాసనమండళ్ల ఛైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, ఏపి శాసనసభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.
ఇంకా, వీరితోపాటు తెలంగాణ సిఎల్పి నేత జానారెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐ నేతలు రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. ఏపి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, గవర్నర్ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఇరు రాష్ట్రాల డిజిపిలు అనురాగ్ శర్మ, రాములు, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సివి ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ నర్సింహన్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోనూ ముస్లింలు అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం దర్బార్ హాలులో గవర్నర్ నర్సింహన్, చంద్రబాబు, ఇతర ప్రముఖులు ఒకరినొకరు పలకరించుకున్నారు. వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అయితే వారిద్దరూ పలకరించుకోలేదు.

ఇఫ్తార్ విందు
రంజాన్ సందర్భంగా గవర్నర్ నర్సింహన్ బుధవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు.

గవర్నర్‌తో జగన్
ఇఫ్తార్ విందుకు హాజరైన వైయస్ జగన్మోహన్ రెడ్డిని పలకరిస్తున్న గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్.

చంద్రబాబు
గవర్నర్ నర్సింహన్‍కు విందులో పండు తినిపిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.

టి డిప్యూటీ సిఎం
ఇఫ్తార్ విందులో తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్ అలీకి పండు తినిపిస్తున్న గవర్నర్ నర్సింహన్.

చంద్రబాబుకు..
ఇఫ్తార్ విందులో ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు పండు తినిపిస్తున్న గవర్నర్ నర్సింహన్.

ప్రార్థనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఇరు రాష్ట్రాల శాసనమండళ్ల ఛైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, ఏపి శాసనసభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.

గవర్నర్ స్పీచ్
ఈ సందర్భంగా గవర్నర్ నర్సింహన్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోనూ ముస్లింలు అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు.

జగన్ పలకరింపు
ఇఫ్తార్ విందు సందర్భంగా గవర్నర్ నర్సింహన్, వైయస్ జగన్మోహన్ రెడ్డి పలకరింపులు.

ఇఫ్తార్ విందు
ప్రార్థనల అనంతరం దర్బార్ హాలులో గవర్నర్ నర్సింహన్, చంద్రబాబు, ఇతర ప్రముఖులు ఒకరినొకరు పలకరించుకున్నారు.

పొన్నాల
ఇఫ్తార్ విందులో తెలంగాణ సిఎల్పి నేత జానారెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐ నేతలు రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.

మహమూద్ అలీ
గవర్నర్ నర్సింహన్‌కు పండు తినిపిస్తున్న తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ.

ఇఫ్తార్ విందు
ఏపి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, గవర్నర్ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఇరు రాష్ట్రాల డిజిపిలు అనురాగ్ శర్మ, రాములు, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సివి ఆనంద్ పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు
ప్రార్థనల అనంతరం దర్బార్ హాలులో గవర్నర్ నర్సింహన్, చంద్రబాబు, ఇతర ప్రముఖులు ఒకరినొకరు పలకరించుకున్నారు. వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అయితే వారిద్దరూ పలకరించుకోలేదు.

ఇఫ్తార్ విందు
తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు ఈ విందుకు హాజరుకాలేదు. కెసిఆర్ కూడా విందుకు హాజరైతే బాగుండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమైన సమావేశం ఉన్నందునే ఆయన రాలేకపోయారని మంత్రి నాయిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఛలోక్తులు విసురుతూ.. సందడి చేశారు. చంద్రబాబు గవర్నర్ పక్కన ఉన్నప్పుడు.. తెలంగాణ మంత్రులు నాయిని, ఈటెల రాజేందర్ స్వామిగౌడ్ దూరంగా నిలబడ్డారు. వారిని చూసిన చంద్రబాబు.. ‘అంత దూరంగా ఉన్నారేం.. రండి. నా దగ్గరకు వస్తే ఎవరూ ఏమి అనుకోరు. ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు' అన్నారు. దీంతో టి మంత్రులు మొహమాటంగానే నవ్వుతూ ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేశారు. గతంలో నాయిని తమతో కలిసి పనిచేశారని బాబు గుర్తు చేశారు.
కాగా, తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు ఈ విందుకు హాజరుకాలేదు. కెసిఆర్ కూడా విందుకు హాజరైతే బాగుండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమైన సమావేశం ఉన్నందునే ఆయన రాలేకపోయారని మంత్రి నాయిని తెలిపారు. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు కూడా వీరితో మాటలు కలిపారు. కాంగ్రెస్ నేతలు ఏదైనా మాట్లాడవచ్చి.. వారు ఫ్రీబడర్డ్స్ అని చంద్రబాబు వారినుద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications