టిడిపికి గ్రేటర్ షాక్: రాజీనామాలపై రాజీనామాలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం కూటమికి షాక్ మీద షాక్ తగులుతోంది. సీట్ల కేటాయింపులో అసంతృప్తికి గురైన తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు పార్టీకి రాజీనామా చేశారు. బిజెపి నేత, మాజీ శాసనసభ్యుడు ప్రేమ్ సింగ్ రాథోడ్ శనివారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు.

మల్కాజ్‌గిరికి చెందిన వీకే.మహేశ్‌, మాజీ కార్పొరేటర్‌ వజీర్‌ ప్రకాశ్‌గౌడ్‌ పార్టీకి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. శేరిలింగంపల్లికి చెందిన నాయకుడు బండిరమేశ్‌ గులాబీ గూటికి చేరుకున్నారు. రమేశ్‌కు ఈ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటిచేసే అవకాశం కల్పించినా ఆయన ఆసక్తి చూపకపోవడంతో చివరి నిమిషంలో మరొకరికి ఆ స్థానం కేటాయించారు.

 Greater shock to TDP: Leaders revolt

గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరిన మొవ్వా సత్యనారాయణకు దగ్గరి వ్యక్తిగా పేరున్న రమేశ్‌ ఆయన దారిలో నే నడిచారు. టికెట్ల కేటాయింపుపట్ల అసంతృప్తితోనే వీకే.మహేశ్‌, ప్రకాశ్‌ గౌడ్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిరువురు టీఆర్‌ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.

మాజీ మంత్రి, టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీ.కృష్ణాయాదవ్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీకి మరో షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా రేసులో ఉన్న శేరిలింగంపల్లి నేత బండి రమేష్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల వేళ ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండడంతో పార్టీ ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+