హరేకృష్ణ: రూ.5 భోజనం తింటూ మేయర్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో కొంతమంది అన్నార్తులకైనా భోజన వసతి కల్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) నిర్ణయించింది.
ఈ మేరకు ఇవాళ ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం నాంపల్లి సరాయ్ వద్ద నగర మేయర్ మహమ్మద్ మజీద్ హుస్సేన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
నగరంలోని 50 కేంద్రాలలో ఒక్కోచోట రోజుకు సుమారు 300 మంది చొప్పున మొత్తం పదిహేను వేల మందికి భోజన వసతి కల్పించనుంది.

భోజనం
ఒక కేంద్రంలో ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఎవరు ముందు వస్తే వారికి భోజనం టికెట్ ఇస్తారు. పథకం అమలు కోసం జిహెచ్ఎంసి బడ్జెట్‌లో రూ.11 కోట్లు కేటాయించారు.

మాజిద్ హుస్సేన్
అక్షయ ప్రాత ఫౌండేషన్‌తో కలిసి పైలట్ ప్రాజెక్టుగా జిహెచ్ఎంసి ఈ పథకాన్ని చేపట్టింది. ఒక కూర, సాంబార్, చెట్నితో కూడిన భోజనాన్ని వడ్డిస్తారు.

వడ్డిస్తున్న మేయర్
రోజుకు పదిహేను వేల మందికి, యాభై ప్రాంతాల్లో, ఒక్కో ప్రాంతంలో మూడు వందల మందికి భోజనం పెట్టాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.

హరేకృష్ణా ఫౌండేషన్ వారితో మేయర్
జిహెచ్ఎంసి ఇస్తున్న భోజనం విలువ ఇరవై రూపాయల వరకు ఉంటుంది. ఆకలి గొన్న వారికి దీనిని కేవలం ఐదు రూపాయలకే ఇస్తారు. మిగతా పదిహేను రూపాయలను జిహెచ్ఎంసి భరిస్తుంది.

ఐదు రూపాయలకే
ఈ భోజనం వెజిటేరియన్. ఇందులో దాల్, సాంబర్, సబ్జీ, పచ్చడి ఉంటుంది. మొదట వచ్చిన వారికి భోజనం పెడతారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటి గంటల వరకు పెడతారు.

చిన్నారికి ముద్ద పెడుతూ...
కాగా, అక్షయ పాత్ర ఫౌండేషన్‌ను హరే కృష్ణా మూవ్‌మెంట్ నడుపుతోంది. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో కలిపి పైలట్ ప్రాజెక్టుగా జిహెచ్ఎంసి ఈ పథకాన్ని చేపట్టింది.

భోజనం తింటూ
నగరంలో కొంతమంది అన్నార్తులకైనా భోజన వసతి కల్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) నిర్ణయించింది.

చిన్నారికి భోజనం తినిపిస్తున్న మేయర్
ఈ మేరకు ఇవాళ ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం నాంపల్లి సరాయ్ వద్ద నగర మేయర్ మహమ్మద్ మజీద్ హుస్సేన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఐదు రూపాయలకే భోజనం
నగరంలోని 50 కేంద్రాలలో ఒక్కోచోట రోజుకు సుమారు 300 మంది చొప్పున మొత్తం పదిహేను వేల మందికి భోజన వసతి కల్పించనుంది.












Click it and Unblock the Notifications