బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్-బంగ్లా మ్యాచ్: కీలక మలుపులివే (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతం.. కాదు అత్యద్భుతం జరిగింది. మొదటి నుంచి రెండు జట్ల మధ్య గెలుపుపై హైడ్రామా నడిచింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వైపు మొగ్గింది. చివరి ఓవర్లో మరింత సస్పెన్స్ కనిపించింది. చివరికి ఒక్క పరుగుతో భారత్ గెలిచింది.

<strong>గెలిస్తే సంతోషమేది: ధోనీకి చిర్రెత్తుకొచ్చింది, బిగ్‌బీ ప్రశ్న </strong>గెలిస్తే సంతోషమేది: ధోనీకి చిర్రెత్తుకొచ్చింది, బిగ్‌బీ ప్రశ్న

భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పలు మలుపులు ఉన్నాయి. దీంతో అద్భుతం జరిగింది. ముఖ్యంగా చివరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ ఓ అధ్భుతం. అదే సమయంలో చివరి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ ధోనీ సలహా పని చేయడం కూడా గమనార్హం.

ఫోటో గ్యాలెరీ : వరల్డ్T20

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఆ తర్వాత 147 పరుగులతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. గెలిచే పరిస్థితి కనిపించింది. 12 ఓవర్లకు బంగ్లా స్కోర్ 95/4. 48 బంతుల్లో 52 పరుగులు చేస్తే ప్రత్యర్థిదే గెలుపు. ధోనీ, అశ్విన్, బూమ్రాలు క్యాచ్‌లు మిస్ చేయడం బంగ్లాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

అప్పటికే అశ్విన్‌ మూడు ఓవర్లు వేసేశాడు. జస్ప్రీత్ బుమ్రా విఫలమయ్యాడు. అప్పటి దాకా హార్దిక్ పాండ్యా తేలిపోయాడు. పార్ట్ టైమ్‌ బౌలర్‌ సురేష్ రైనా కూడా ఆకట్టుకోలేదు. బౌలింగ్‌ ఎవరు వేసినా పరుగులు ధారాళంగా వస్తున్నాయి. భారత జట్టు గెలుపుపై ఎవరికీ ఆశలు లేవు.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

ఆ తర్వాత అశ్విన్‌ను ధోనీ నమ్ముకున్నాడు. అశ్విన్‌ తొలి బంతికే మాయ చేశాడు. ఆఫ్ స్టంప్‌ ఆవల అతడు వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో షకిబ్‌ స్లిప్‌లోని రైనాకు చిక్కాడు. ఆ ఓవర్లో అశ్విన్‌ ప్రతి బంతి వికెట్‌ తీసే బంతే. తొలి ఐదు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆఖరి బంతికి సింగిల్‌.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

ఆ ఓవర్‌ ఇచ్చిన విశ్వాసం మ్యాచ్‌లో భారత గమనాన్నే మార్చేసింది. 14వ ఓవర్లో జడేజా మూడు పరుగులే ఇచ్చాడు. 15వ ఓవర్లో నెహ్రా 5 పరుగులు ఇవ్వడంతో మళ్లీ భారత గెలుపు ఆశలు చిగురించాయి. 12 ఓవర్లకు 95/4తో ఉన్న బంగ్లా 15 ఓవర్లకు 104/5కు చేరుకుంది.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

ఆ తర్వాత పదహారో ఓవర్లో మహ్మదుల్లా సిక్సర్ రాబట్టాడు. దీంతో ఆ ఓవర్ ముగిసేసరికి 113 పరుగులు అయ్యాయి. చివరి నాలుగు ఓవర్లలో 34 పరుగులు చేయాలి. ఈ స్థితిలో 17వ ఓవర్ వేసిన బూమ్రా.. ఏడు పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి సౌమ్య సర్కార్ ఇచ్చిన ఇచ్చిన క్లిష్టమైన బంతిని ధోనీ పట్టుకోలేకపోయాడు.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

పద్దెనిమిదో ఓవర్లో బౌండ్రీ రాబట్టిన సౌమ్యను ఆశిష్ నెహ్రా అవుట్ చేశాడు. ఆ ఓవర్ ముగిసేసరికి 130 పరుగులు చేసింది. 19వ ఓవర్లో బూమ్రా 6 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో బంగ్లాకు 11 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

అప్పటికే నెహ్రూ, బూమ్రా, అశ్విన్, జడెజాల ఓవర్ల కోటా పూర్తయింది. దీంతో బంతిని హార్దిక్ పాండ్యాకు ఇచ్చాడు ధోనీ. అతని నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టాడు. తొలి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీశాడు. రెండో బంతికి ముష్పికర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి కూడా ఫోర్ కొట్టాడు.

భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

ఇక మిగిలిన మూడు బంతుల్లో చేయాల్సిన పరుగులు 2 మాత్రమే. ఇక్కడే మ్యాచ్ ఊహించని మలుపు తిరిగింది. మ్యాచ్ ఫినిష్ చేద్దామనుకున్న ముష్ఫికర్ నాలుగో బంతిని గాల్లోకి లేపాడు. డీప్ వికెట్లో ధావన్ దానిని క్యాచ్ పట్టాడు. అయినా మ్యాచ్ బంగ్లా వైపే ఉంది. రెండు బంతుల్లో 2 పరుగులే చేయాలి.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

ఆ తర్వాత స్ట్రయికింగ్‌కు వచ్చిన మహ్మదుల్లా... ఫుల్ టాస్ బంతిని షాట్ కొట్టాడు. దానిని డీప్ వికెట్లో జడెజా పట్టాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాలి. మ్యాచ్ సమం కావాలంటే బంగ్లాకు ఒక పరుగే చాలు. ఈ దశలో ధోనీ తన వ్యూహానికి పదును పెట్టాడు.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

ఆఫ్ సైడ్లో సింగిల్ రాకుండా, లెగ్ సైడ్లో భారీ షాట్ ఆడేందుకు వీలు లేకుండా ఫీల్డింగ్ పెట్టాడు. డాట్ బాల్ పడి, బంతి తనదాకా వస్తే సింగిల్ రాకుండా రనౌట్ చేసేందుకు తన గ్లౌవ్‌ను ఒకదానిని పక్కన పెట్టాడు. అదే సమయంలో బౌలర్ పాండ్యాకు ఏం చేయాలో చెప్పాడు.

 భారత్ బంగ్లా మ్యాచ్

భారత్ బంగ్లా మ్యాచ్

ధోనీ ఊహించిందే జరిగింది. స్ట్రయికింగ్‌లో ఉన్న షువగాటకు పాండ్యా డాట్ బాల్ వేశాడు. అటు నాన్ స్ట్రయికింగులో నుంచి ముస్తాఫిజురు.. ఇటు వికెట్ల వెనుక ధోనీ పరుగెత్తుకుంటూ వచ్చారు. చివరకు ధోనీ అవుట్ చేశాడు. నిర్ణయం థర్ట్ అంపైర్‌కు వెళ్లగా... అవుట్ ఇచ్చారు.

English summary
ICC WT20 2016, India vs Bangladesh, Sensational Pandya Seals One Run Win
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X