• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రూ. 65,250 కోట్ల నల్లధనం వెల్లడి: టాప్‌లో హైదరాబాద్

|

న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన అప్రకటిత ఆస్తుల(నల్లధనం) వెల్లడి పథకం(ఐడీఎస్)-2016కు భారీ స్పందన లభించింది. పన్ను శాఖ కన్నుగప్పి కూడబెట్టుకున్న ఆస్తులను వెల్లడించేందుకు ఆఖరి అవకాశమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ పథకం ద్వారా మొత్తం 64,275 మంది రూ.65,250 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. అంటే ఒక్కొక్కరు సరాసరిగా రూ. కోటికిపైగా అప్రకటిత ఆస్తులను వెల్లడించారన్నమాట.

ఈ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం మీడియాకు వెల్లడించారు. అయితే, ఈ మొత్తంలో అత్యధిక వాటా హైదరాబాద్‌దే కావడం గమనార్హం. శుక్రవారం సాయంత్రం నాటికి హైదరాబాద్ నుంచి దాదాపు రూ. 13 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వెల్లడైందని ఐటీ వర్గాల సమాచారం.

తర్వతి స్థానాల్లో ముంబై(రూ. 8,500 కోట్లు), ఢిల్లీ(రూ. 6 వేల కోట్లు), కోల్‌కతా(రూ. 4 వేల కోట్లు) ఉన్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకాల్లో అత్యంత విజయవంతమైన పథకం ఇదేనని, ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి చెందుతుందని జైట్లీ పేర్కొన్నారు. గణాంకాల నమోదు కొనసాగుతోందని, వెల్లడైన ఆదాయానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఆ ప్రక్రియ ముగిశాక తెలుస్తుందని చెప్పారు.

'ప్రభుత్వానికి పన్నులు, జరిమానాలుగా రూ. 29,362.5 కోట్లు రానున్నాయి. ఈ మొత్తాన్ని భారత సంచిత నిధిలోకి చేర్చి ప్రజా సంక్షేమానికి వినియోగిస్తాం. ఈ పథకం ద్వారా ఆదాయాన్ని ప్రకటించినవారు తమ పన్నులు, జరిమానాలను సెప్టెంబర్ 30, 2017లోపు రెండు విడతల్లో చెల్లించే అవకాశముంది' అని జైట్లీ వివరించారు.

arun jaitley

ఆదాయాన్ని ప్రకటించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఐడీఎస్‌లో కూడా నల్ల ధనం వివరాలు వెల్లడించనివారిపై చర్యలేమైనా తీసుకొంటారా అన్న ప్రశ్నకు.. ఎప్పటిలానే సోదాలు కొనసాగుతాయన్నారు.

పన్నులు కట్టని ఆదాయ వివరాలు వెల్లడించేందుకు కేంద్రం ఈ సంవత్సరం జూన్ 1న ఐడీఎస్ తీసుకొచ్చింది. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 45 శాతం పన్ను, పెనాల్టీ చెల్లించే వీలు కల్పించింది. విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనానికి సంబంధించి గత ఏడాది ప్రకటించిన ఇదే తరహ పథకం ద్వారా రూ. 2,428 కోట్లు పన్ను రూపేణా ఖజానాకు జమ అయ్యాయి. 644 మందే దీనికి స్పందించారు.

1997లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(వీఐడీఎస్) ద్వారా ప్రభుత్వానికి రూ. 9,760 కోట్లు పన్ను ఆదాయం లభించింది. అయితే, తాము ప్రకటించిన ఐడీఎస్, చిదంబరం ప్రకటించిన వీఐడీఎస్ వేరువేరు పథకాలని జైట్లీ తెలిపారు. వీఐడీఎస్ మాదిరిగా తమది పూర్తిస్థాయి క్షమాభిక్ష పథకం కాదన్నారు. ఆ పథకంలో పన్నుశాతం చాలా తక్కువన్నారు.

1951 నుంచి 1997 మధ్య పది ఈ తరహా పథకాలను ప్రకటించారు. వీటిలో 1985/86 నాటి పథకం(రూ. 10,778 కోట్లు), 1997 నాటి వీఐడీఎస్ మాత్రమే విజయవంతమయ్యాయి.

కాగా, ఐదు వేలకు పైగా బహిరంగ సభలు, సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో ప్రకటనలు, టాకథాన్‌లు, అవగాహనా సదస్సులు... వీటికి తోడు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం, నాలుగు నెలలుగా భారీ స్థాయిలో సాగిన ఐడీఎస్ క్యాంపెయిన్ ధాటికి 64 వేల మందికి పైగా తమ నల్లధనం వివరాలు బహిర్గతం చేశారు. మరోవైపు ఆదాయపు పన్ను విభాగం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎగవేత దారుల నుంచి వివరాలు రాబట్టగలిగింది.

రూ.56,378 కోట్ల అక్రమాస్తుల స్వాధీనం

ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయ పన్ను శాఖ గత రెండేళ్లలో జరిపిన సోదాల్లో రూ.56,378 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డట్టు జైట్లీ చెప్పారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని మరో రూ.16 వేల కోట్లు గుర్తించాం. రూ.2వేల కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపారు. పనామా కేసునిందితులు, హెచ్‌ఎస్‌బీసీ జాబితాలోని వారిపైనా చర్యలు తీసుకుంటామని, హెచ్‌ఎస్‌బీసీ జా బితాకు సంబధించి రూ.8వేల కోట్ల లెక్కలు తేలాయి. 164 కేసులు నమోదయ్యాయని వివరించారు.

ప్రధాని మోడీ అభినందన

అప్రకటిత ఆస్తుల వెల్లడి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నవారికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ పథకం ద్వారా ఆస్తులు వెల్లడించి పన్ను నిబంధనలకు లోబడడం ప్రశంసనీయమన్నారు. అంతేకాదు ఈ ఆస్తుల ప్రకటన వ్యవస్థలో పారదర్శకత పెంచడంతోపాటు ఆర్థిక వృద్ధికి దోహదపడనుందని ఆయన పేర్కొన్నారు.

అలాగే నల్ల ధనం వెలికితీయడంలో ఆర్థిక శాఖ విజయం సాధించినందుకు అరుణ్ జైట్లీ బృందాన్ని మోడీ అభినందించారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా, సీబీడీటీ చైర్‌పర్సన్ రాణి నాయర్ బృందం కృషిని కొనియాడారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As much as Rs 65,250 crore of blackmoney was declared during the four-month compliance window -- the Income Declaration Scheme -- that ended on September 30, Finance Minister Arun Jaitley said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more