వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మనోడే' దెబ్బకొట్టాడు?:దారుణంగా బెడిసికొట్టిన బాబు వ్యూహం..

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబును ఆయన పార్ట్‌నర్ పవన్ కల్యాణే చిక్కుల్లోకి నెట్టాడా?.. అవిశ్వాస తీర్మానం అనే తుట్టెను కదిలించి.. చివరకు బాబు మెడకు చుట్టుకునేలా చేశాడా?.. ఏపీ రాజకీయాలను గమనిస్తే అవుననే సమాధానమే రాకమానదు. పవన్ కల్యాణ్‌ను ముందుపెట్టి జగన్‌ను దెబ్బకొట్టాలని భావిస్తే.. రివర్స్‌లో తానే ఇరుకునపడిపోవడం ఇప్పుడు చంద్రబాబుకు మింగుడుపడని అంశం అని అంటున్నారు.

బాబు ప్లాన్..:

బాబు ప్లాన్..:

హోదా అంశాన్ని మళ్లీ లేవనెత్తి దానిపై రాజీనామాలకు సిద్దమంటూ జగన్ ప్రకటించగానే టీడీపీలో కాస్త అలజడి రేగింది. ప్రత్యర్థి పార్టీ తమకంటే ముందుండటం ఏంటి అనుకున్న చంద్రబాబు.. వాళ్ల కన్నా ముందు తామే రాజీనామాలు చేస్తామంటూ టీడీపీ నేతల చేత ప్రకటించారు. అంతేనా!.. జగన్ ను ఇరుకునపెట్టాలన్న ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానాన్ని పవన్ కల్యాణ్ ద్వారా తెరపైకి తీసుకొచ్చారు? అన్న విమర్శలూ ఉన్నాయి.

బెడిసికొట్టిన వ్యూహం..:

బెడిసికొట్టిన వ్యూహం..:

అసలే కేసుల్లో ఇరుక్కుపోయిన జగన్.. బీజేపీతో చేతులు కలపడానికి తహతహలాడుతున్న వేళ.. 'అవిశ్వాస తీర్మానం'ను తెరపైకి తీసుకురావడం ద్వారా ఆ ప్రయత్నానికి తూట్లు పొడవవచ్చని చంద్రబాబు భావించారు. అందుకే పవన్ చేత వ్యూహాత్మకంగా జగన్ కు అవిశ్వాస తీర్మానం సవాల్ విసిరేలా చేశారు. కానీ అది కాస్త బెడిసికొట్టి తానే ఇరుక్కోవాల్సి రావడం ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

జగన్‌కు అనుకూలంగా మాట్లాడక తప్పలేదు..:

జగన్‌కు అనుకూలంగా మాట్లాడక తప్పలేదు..:

అవిశ్వాస తీర్మానం అనగానే.. జగన్ మౌనం వహిస్తాడు, కేంద్రంపై ఎదురుతిరిగే సాహసం చేయలేడన్న ఉద్దేశంతోనే పవన్ ఆయనకు సవాల్ చేశాడని చెప్పాలి. కానీ అనూహ్యంగా తమ పార్టీ అందుకు సిద్దమని.. నిజంగా నీకు చిత్తశుద్ది ఉంటే నీ పార్ట్‌నర్ చంద్రబాబును కూడా ఒప్పించాలని ప్రతి సవాల్ విసిరారు జగన్. ఈ దెబ్బకు పవన్ కల్యాణ్ సైతం దిగొచ్చి.. 'మీరు దమ్ము, ధైర్యం నాయకులు.. మీరు అవిశ్వాసం పెడితే మద్దతు కోసం నేను ప్రయత్నిస్తా' అని చెప్పక తప్పలేదు.

మనోడే 'బలి' చేశాడు?:

మనోడే 'బలి' చేశాడు?:

ఒకవిధంగా మొత్తం వ్యవహారంలో చంద్రబాబు విలవిలలాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవిశ్వాసంపై వైసీపీ దూకుడుగా ముందుకెళ్తున్నవేళ.. చంద్రబాబు మాత్రం 'అది ఆఖరి అస్త్రం' ఇంకా సమయం ఉంది అన్న రీతిలో మాట్లాడుతున్నారు.

ఈ మాటలన్ని మోడీ పట్ల బాబులో ఎక్కడో గూడుకట్టుకుపోయిన భయాన్ని వెల్లడిస్తున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి పవన్ 'మనోడే' అని చంద్రబాబు అంటే.. ఆ మనోడే ఆయన్ను ఇంత ఇరకాటంలో పడేశాడే! అన్న చర్చ జోరందుకుంది.

English summary
Anhdrapradesh people are widely discussing on special status and state political issues, espcially jagan's no-confidence motion proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X