వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సందేహాలు: 'ఫ్రీడమ్ 251' ఒక స్మార్ట్‌ఫోన్ కుంభకోణమా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ మొబైల్ రంగంలోనే ఓ విప్లవం. కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తున్నామంటూ రింగింగ్‌బెల్స్‌ అనే సంస్థ ముందుకొచ్చింది. మొబైల్ రంగాన్ని శాసించే చైనాలో అతి చౌకగా అమ్మే సంస్థల దగ్గర కొన్నా... కనీసం రూ. 2800 అవుతుందని, అలాంటిది 251కే స్మార్ట్ ఫోన్ ఎలా ఇస్తారని ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న.

ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకుందామని, సంబంధిత వెబ్‌సైట్‌ తెరచి ఆర్డర్ బుక్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా నమోదు చేసుకునే అవకాశమే రాలేదు. సంస్ధ వెబ్‌సైట్‌లో సెకనుకు 6 లక్షల హిట్లు రావడంతో, సర్వర్‌ స్తంభించింది.

తమ ఫోన్ బుకింగ్‌ల కోసం అనూహ్య స్పందన వచ్చిందంటూ బుకింగ్ అవకాశాలను గురువారం తాత్కాలికంగా నిలిపేసింది. ఇలా ఆర్డర్లను నిలిపివేయడంతో సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Is “Freedom 251” a smartphone scam? DoT seeks clarification, claims BJP MP Kirit Somaiya

తమ సంస్థకు చెందిన ఫ్రీడమ్ 251 మొబైల్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో వాటిని తాత్కాలికంగా నిలిపేసి తిరిగి శుక్రవారం ప్రారంభిస్తున్నామని చెప్పింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ను బుక్ చేసుకునే వారు కొన్ని విషయాలు ముందే తెలుసుకుంటే మంచిదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

చౌక ధరకే స్మార్ట్ ఫోన్ అని ప్రచారం చేయడంతో ‘ఒక బిర్యానీయో, మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తేనో అయ్యే అంత ఖర్చు కాదు.. వస్తే వాడుకుందాం.. పోతే రూ.251. అంతేకదా.. అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి' అనే ధోరణితోనే ఎక్కువ మంది ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.

Also Read: సెక్స్‌కి నో చెప్పిందని, గర్ల్‌ఫ్రెండ్ పిరుదులపై చేయి: జైలుకెళ్లాడు

నిజానికి రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో సంస్థ అందించే ఈ స్మార్ట్ ఫోన్‌లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం అంచనా వేయడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ మొబైల్ ఫోన్ షిప్పింగ్‌కు కూడా నాలుగు నెలల సమయం తీసుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కస్టమర్లు ఫోన్ బుక్ చేసుకోవాల్సి ఉంది.

అయితే ఫోన్ బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, స్మార్ట్ ఫోన్ విడుదల కార్యక్రమంలో ఫ్రీడమ్ 251కు ఏడాది పాటు వారంటీ ఉంటుందని రింగింగ్‌బెల్స్‌ అధ్యక్షుడు అశోక్‌ చద్దా చెప్పారు. కానీ రింగింగ్‌బెల్స్‌ వెబ్‌సైట్‌లో మాత్రం రిటర్న్ పాలసీ అందుకు సంబంధించిన వివరాలేమీ పెట్టలేదు.

ఇక్కడ నెటిజన్లు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ ధర రూ. 251. అయితే ఫోన్‌ను డెలివరీ చేసేందుకు రూ. 40 అదనంగా చెల్లించాల్సి ఉంది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో మాత్రమే డెలివరీ చేస్తారని అన్నారు.

కాగా, రూ. 251కే స్మార్ట్ ఫోన్‌‌ను అందిస్తామంటూ ముందుకొచ్చిన రింగింగ్ బెల్స్ సంస్థపై బీజేపీ ఎంపీ కీర్తి సోమయ్య ట్విట్టర్‌లో స్పందించారు. బీఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసేందుకు టెలికం మంత్రిత్వ శాఖ అనుమతిస్తుందా? అంటూ వివరణ కోరారు.

రింగింగ్‌బెల్స్‌ అనే కంపెనీ విశ్వసనీయమైన కంపెనీ అవునా, కాదా? అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని చెక్ చేయాల్సిందిగా కోరారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు అశోక్‌ చద్దా చెప్పిన మాటలపై ఎంపీ వివరణ కోరుతా ఆయనకు లేఖ రాశారు.

‘భారత ప్రమాణాల మండలి (బీఐఎస్‌) ధ్రువీకరణ లేకుండా ఫ్రీడమ్‌ 251 పేరిట స్మార్ట్‌ఫోన్‌ను మార్కెటింగ్‌ చేయడంపై రింగింగ్‌బెల్స్‌ సంస్థను టెలికాం శాఖ వివరణ కోరింది. అసలు ఆ సంస్థ స్థితిగతులపైనా పరిశీలన జరపమని ఉత్తరప్రదేశ్‌ ప్రభత్వాన్ని ఆదేశించింది' అని బీజేపీ ఎంపీ సోమయ్య ట్విట్‌ చేశారు.

ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో అశోక్ చద్దా మాట్లాడుతూ మా ఫోన్‌ తయారీ ధర రూ.2,500. భారత్‌లో తయారు చేస్తే 13.8 సుంకం తగ్గడంతో, ఒక ఫోన్‌పై రూ.450 భారం తగ్గుతుందని, ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తాం కాబట్టి మరో రూ.450 కలిసొస్తుంది. భారీమొత్తంలో తయారీ వల్ల రూ.550 వరకు ఖర్చు తగ్గుతుందన్నారు.

ఇక మార్కెటింగ్‌, ఇ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో విక్రయం ద్వారా రిటైలింగ్‌ ఖర్చులు తగ్గించుకుంటామని. మొత్తంమీద రూ.800కే తయారు చేయగలమన్నది మా విశ్వాసమని అన్నారు. రూ.251కి విక్రయిస్తే, రూ.550 తేడా ఉంటుందని, ఆన్‌లైన్‌ ప్రకటనలు, ఇకామర్స్‌ పోర్టల్‌లో ఇతరులకు చోటు ద్వారా ఆ మొత్తాన్ని ఆర్జిస్తామని చెప్పారు.

ఫ్రీడమ్ 251 ఫీచర్స్:

* Android 5.1 operating system
* 4-inch qHD IPS display
* 3.2-megapixel primary
* 0.3-megapixel front camera
* 3G connectivity
* 1.3GHz quad-core processor
* 1GB RAM
* 8GB internal memory
* Supports external memory cards of up to 32GB.
* 1,450mAh battery
* Service network of 650 centres across India.
* Pre-installed apps like Swachh Bharat, Women Safety, WhatsApp, Facebook, Twitter, etc.

English summary
World's cheapest "Made In India" smartphone-- "Freedom 251", priced at Rs 251 only, developed by a Noida-based start up-- Ringing Bells Pvt Ltd, took the world by surprise, on Wednesday, Feb 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X