వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనకు రక్షణేది?: భారతీయుల్లో అక్కడా ఇక్కడా వణుకు

భారతీయులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారు, మనదేశంలోని వారి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్: భారతీయులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారు, మనదేశంలోని వారి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యాంతమైన శ్రీనివాస్‌ భార్య సునయన(వీడియో)నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యాంతమైన శ్రీనివాస్‌ భార్య సునయన(వీడియో)

ఆ హత్యకు ట్రంప్‌కు సంబంధం లేదు: వైట్‌హౌజ్ సమాధానం ఇదిఆ హత్యకు ట్రంప్‌కు సంబంధం లేదు: వైట్‌హౌజ్ సమాధానం ఇది

తెలుగువారిపై దాడి: కేటీఆర్ దిగ్భ్రాంతి, యూఎస్ ఇండియన్ ఎంపీల తీవ్ర స్పందనతెలుగువారిపై దాడి: కేటీఆర్ దిగ్భ్రాంతి, యూఎస్ ఇండియన్ ఎంపీల తీవ్ర స్పందన

మతిలేని హింస: తెలుగువారిపై దాడిపై సత్య నాదెళ్లమతిలేని హింస: తెలుగువారిపై దాడిపై సత్య నాదెళ్ల

ఈ నేపథ్యంలో అమెరికన్లలోని జాత్యహంకారులు అమెరికాలోని ఇతర దేశస్తులపై దాడులకు తెగబడుతున్నారు. గత నెలలో వరంగల్‌కు చెందిన వంశీ అనే యువకుడిపై అమెరికాలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

దేశం విడిచిపోండి అంటూ..

దేశం విడిచిపోండి అంటూ..

తాజాగా కన్సాస్‌లోని ఓ బార్‌లో బుధవారం రాత్రి ‘మా దేశం విడిచి వెళ్లిపొండి.. ఉగ్రవాదుల్లారా' అంటూ ఆడమ్ పూరింటన్(51) అనే మాజీ నేవీ ఉద్యోగి.. తెలుగు ఇంజినీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల(32), అలోక్ మాదాసిల(32)తో గొడవకు దిగాడు. బార్ యాజమాన్యం జోక్యం చేసుకుని బయటికి పంపించడంతో వెళ్లిపోయిన పూరింటన్.. మళ్లీ వచ్చి తెలుగు ఇంజినీర్లపై తుపాకీతో కాల్పులు జరిపాడు.

ప్రాణం తీశాడు...

ప్రాణం తీశాడు...

దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, అలోక్ తీవ్రగాయాలపాలయ్యాడు. తెలుగువారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఇయాన్ గ్రిలియంట్(24) అనే అమెరికన్ యువకుడు కూడా పూరింటన్ కాల్పుల్లో తీవ్రగాయాలయ్యాయి. అలోక్, ఇయాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రెచ్చగొట్టే డొనాల్డ్ ట్రంప్..

రెచ్చగొట్టే డొనాల్డ్ ట్రంప్..

ఇంత జరుగుతున్నా.. ట్రంప్ విధానాలతో ఈ హత్యలకు సంబంధం లేదంటూ వైట్ హౌజ్ పేర్కొనడం గమనార్హం. తమ దేశంలో తమ పౌరులకే ఉద్యోగాలు, ప్రాధాన్యత అంటూ డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే ఉపన్యాసాలిస్తుండటంతో పలువురు అమెరికన్ పౌరులు విదేశీయులపై దాడులకు తెగపడుతున్నారు.

భయాందోళనలు

భయాందోళనలు

ఈ క్రమంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక అక్కడి విదేశీయులతోపాటు తెలుగువారు కూడా ఆందోళన చెందుతున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా సరైన విధంగా స్పందించకపోవడంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే... అమెరికాలో తమ వాళ్లు ఎలా ఉన్నారో అంటూ తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

రక్షణ కరువైంది...

రక్షణ కరువైంది...

మరికొందరైతే తమ వాళ్లను వెంటనే ఇంటికి రావాలంటూ కోరుతున్నారు. ఇక అమెరికాకు వెళ్లేవారు సైతం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పునరాలోచనలో పడుతున్నారు. ఎన్నో కలలతో అమెరికాకు వెళ్లే వారికి ఇలాంటి అనుకోని ఘటనలు ఎదురవుతుండటంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగులుతోంది. శ్రీనివాస్ భార్య సునయన తన భర్త మరణంతో ఆ దేశంలో విదేశీయుల భద్రతపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక్కడ తమకు భద్రత ఉందా? మేమిక్కడ ఉండగలమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. తాము అమెరికాను తమ ఇంటిలా భావించినా ఇక్కడ ఇలాంటి పరిణామాలు ఎదువడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.

English summary
The shooting death of an Indian engineer and the wounding of another man in a possible hate crime at a Kansas bar has raised fears among members of the area's fast-growing Indian-American community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X