అక్కడ బిల్లు: ఇక్కడ కిరణ్ రెడ్డి రాజీనామా?
హైదరాబాద్: శాసనసభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే పదవికి రాజీనామా చేస్తానని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు కట్టుబడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రతిపాదించిన వెంటనే తాను రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై చర్యలుండవని కాంగ్రెసు ఆంద్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన పలికేందుకు బదులు ఆయనంతట ఆయన గౌరవంగా తప్పుకునే వెసులుబాటు కల్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు అధిష్టానం ఆగ్రహంగా ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డికి స్వేచ్ఛను ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ఈనెల 10, 11, 12 తేదీల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. కాగా 12వ తేదీనే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. అదే రోజున అదే సమయానికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని అంటున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనమాను ఆమోదించి గవర్నర్ ఆయనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరే అవకాశం ఉంది. అయితే, అందుకు కూడా ఆయన ఇష్టంగా లేకపోతే రాష్ట్రపతి పాలన విధించకతప్పదనే మాట వినిపిస్తోంది. ఈ మేరకు మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి.
ఈ నెల 26న గానీ 28న గానీ లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటనల వల్ల స్పష్టం అవుతున్నది. ఈ లోపు రాష్ట్ర విభజన జరిగితే అంటే బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేస్తే అసెంబ్లీకి ఎన్నికలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఆరు నెలల పాటు వాయిదా వేసేందుకు పార్లమెంటుకు అధికారం ఉంటుంది. ఈ విధంగా జరిగితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఆ ఆరునెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం అంతా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేలోపు జరగాల్సి ఉంటుంది.
అంటే రాష్ట్ర విభజన బిల్లుతో పాటే ఎన్నికల వాయిదా విషయాన్ని కూడా పార్లమెంటు ఎదుట ఉంచాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఇది జరపకుండా ఎన్నికలు వాయిదా వేయడం కుదిరేపని కాదని అంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తే అంటే అప్పటికి పార్లమెంటు నిర్ణయం తీసుకోకపోతే కొద్ది రోజులే కాబట్టి రాజీనామా చేసిన ముఖ్యమంత్రినే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారని అంటున్నారు.
ఆయన అందుకు తిరస్కరించే అవకాశం ఉండదని, రాజ్యాంగ బద్ధంగా ఇది ఆయనపై ఉండే బాధ్యత అని రాజ్యాంగ నిపుణుడు ఒకరు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే పక్షంలో అంటే పార్లమెంటు నిర్ణయం తీసుకునే వరకైనా కిరణ్ కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను పెండింగ్‌లో ఉంచి ఆ తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా కేంద్ర పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు.
అన్ని విషయాల్లో అధిష్టానానికి విధేయతగా వ్యవహరిస్తూన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క రాష్ట్ర విభజన అంశంపైనే ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల విషయంలో కూడా ఆయన పార్టీ అధిష్టానం సూచనల మేరకే వ్యవహరించారు. తిరుగుబాటు అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడంలో కూడా ఆయన చురుగ్గా వ్యవహరించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications