పోలవరం బిల్లు: కెవిపి హల్‌చల్, చదివేసిన చిరు

కెవిపికి కేటాయించిన వ్యవధి పూర్తికాగానే ఆపి వేసి కూర్చోవలసిందిగా కురియన్ ఆదేశించారు. ఆయితే తన వాదనను పూర్తిగా విని తీరాలని కెవిపి పట్టుపట్టారు. అయితే కురియన్ అందుకు అంగీకరించలేదు. కెవిపి తన ప్రసంగాన్ని ఆపకుండా చదవటం కొనసాగించటంతో కురియన్ అసహనానికి లోనయ్యారు. కెవిపి ఒక్కసారిగా తన సీటు నుంచి లేచి వెల్‌లోకి దూసుకొచ్చారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని లేదా తన ప్రసంగం ప్రతిని ఆమోదించాలని డిమాండ్ చేశారు.
అయితే సభ్యుల ప్రసంగం ప్రతిని టేబుల్‌పై పెట్టి ఆమోదించే సంప్రదాయం లేదని కురియన్ తేల్చేశారు. కెవిపి డిమాండ్‌ను ఆమోదిస్తే తనకూ ఆ ఆవకాశం ఇవ్వాలని నినాదాలు చేస్తూ వి.హనుమంతరావు కూడా వెల్‌లోకి వచ్చే ప్రయత్నం చేయటంతో సభలోని కాంగ్రెస్ సభ్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్ సూచన మేరకు సీనియర్ నాయకులు సుబ్బిరామి రెడ్డి, జెడి.శీలం తదితరులు కేవీపీని బుజ్జగించి వెనక్కి తీసుకువచ్చారు. రామచంద్రరావు తన స్థానానికి తిరిగి వెళ్తూ తన ప్రసంగం ప్రతిని సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి విసిరేశారు.
మాజీ మంత్రి చిరంజీవి కూడా ముందుగా తయారు చేసుకున్న ప్రసంగాన్ని చదివారు. ఆయనకు కేటాయించిన మూడు నిమిషాల వ్యవధి పూర్తికాగానే కురియన్ ఆయనను కూర్చోవలసిందిగా ఆదేశించారు. అయినా చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ దశలో సుబ్బిరామిరెడ్డి తన సమయాన్ని కూడా చిరంజీవికి విడిచిపెడుతున్నట్లు చెప్పారు.
ఈ వ్యవధి ముగిసిపోయిన తరువాత కూడా చిరంజీవి తయారు చేసుకువచ్చిన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు. చిరంజీవి తన ఆదేశాన్ని ఖాతరు చేయకపోవటంతో కురియన్ ఆగ్రహంతో ఒకరు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్ని చదవటం ఆపండని ఆదేశించారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications