Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పడక సుఖం కోసం వెళ్లి!: వేశ్యతో ప్రేమలో.. కదిలించే ప్రేమకథ..

క్షణ కాల సుఖం కోసం వేశ్యావాటికలోకి అడుగుపెట్టిన ఓ యువకుడిని ఓ వేశ్య అమితంగా కదిలించింది. ఇలాంటి అమ్మాయితో క్షణాల సుఖాన్ని కోరుకునే కన్నా.. జీవితాంతం తనకు తోడుగా మలుచుకోవాలని భావించాడు.

న్యూఢిల్లీ: క్షణ కాల సుఖం కోసం వేశ్యావాటికలోకి అడుగుపెట్టిన ఓ యువకుడిని ఓ వేశ్య అమితంగా కదిలించింది. ఇలాంటి అమ్మాయితో క్షణాల సుఖాన్ని కోరుకునే కన్నా.. జీవితాంతం తనకు తోడుగా మలుచుకోవాలని భావించాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడి.. ఆపై ఆమెనూ ఒప్పించి.. ఇప్పుడు పెళ్లికి సిద్దమవుతున్నాడు.

అచ్చు సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలో డ్రైవరుగా పనిచేస్తున్న 28ఏళ్ల యువకుడు ఇటీవల జీబీరోడ్డులో ఉన్న ఓ వేశ్యావాటికకు వెళ్లాడు. 27 ఏళ్ల వ్యభిచారిణితో పడక సుఖం కోసం గదిలోకి అడుగుపెట్టాడు. కానీ ఆమెను చూశాక అతని మనసు మారిపోయింది.

కొన్నాళ్లు విటుడిగానే ఆ వేశ్యాగృహానికి వెళ్లిన యువకుడు.. ఆ తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. ఇందుకు యువతి కూడా అంగీకారం తెలపడంతో.. ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులను కలిసి ఆమెకు వేశ్యాగృహం నుంచి విముక్తి కల్పించాలని కోరాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చారు.

Man falls in love with sex worker, rescues her from brothel at GB Road

Recommended Video

    Marriage Is Good for Your Health

    యువకుడి నిర్ణయానికి అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో.. త్వరలోనే అతను ఆ యువతిని పెళ్లాడబోతున్నాడు. వేశ్యాగృహంలో ప్రేమలో పడ్డ అతని కథ ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు చెబుతున్నారు.

    కాగా, వేశ్యాగృహంలో మగ్గిపోయిన ఆ యువతి నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇండియాకు వలస వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీకి చేరుకోగా.. జీబీ రోడ్డులోని వేశ్యాగృహంలో అనూహ్యంగా చిక్కుకుపోయింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+