వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూ ఆలయాన్ని నిర్మించిన ముస్లిం మతపెద్ద

|
Google Oneindia TeluguNews

మధుర: ఓ ముస్లిం మత పెద్ద తన మత సామరస్యాన్ని చాటుకున్నారు. పదిమందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని ఆయన నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు చందాలు పోగుచేసి తన గ్రామంలోని హిందువుల కోసం ఓ దేవాలయాన్ని నిర్మించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మధురకు సమీపంలో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. వివరాల్లోకి వెళితే.. సహారా గ్రామంలో ఎక్కువమంది ముస్లింలు నివసిస్తుంటారు. గ్రామంలో హిందూ దేవాలయం లేకపోవడంతో హిందువులు చిన్నచిన్న పూజలకు కూడా సమీపంలోని ఇతర గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లేవారు.

Muslim village head builds temple in Mathura district

ఈ విషయం తెలుసుకున్న గ్రామ ముస్లిం మతపెద్ద అజ్మల్ అలీషేక్.. గ్రామంలోనే హిందూ ఆలయాన్ని నిర్మించాలని తలచారు. అనుకున్నదే తడువుగా పనిని ప్రారంభించారు. ఇందుకోసం తన కష్టార్జితం రూ. 4 లక్షలతో పాటు పలువురి వద్ద చందాలు పోగుచేసి.. ఎనిమిది నెలల నుంచి ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు.

గత ఆదివారమే ఆలయంలో ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివుడు, హనుమాన్ తదితర హిందూ దేవుళ్లను ఆలయంలో ప్రతిష్టించారు. చిన్నాచితక పనులు మిగిలిపోయాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయిస్తానని మత పెద్ద అజ్మల్ అలిషేక్ చెప్పారు.

English summary
In a shining example of communal harmony, a Muslim village head has constructed a temple in Sahaar village of Muthura district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X