లోకేష్ రాయబారం: హరి, బాలకృష్ణ మధ్య సయోధ్య?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నందమూరి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ పార్టీకి దూరం కావడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో సమైక్యంగా పార్టీ కోసం పనిచేస్తే కార్యకర్తల్లో, ఎన్టీ రామారావు అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
నారా లోకేష్, హరికృష్ణ భేటీ సందర్భంగా కుటుంబ విషయాలతో సహా పార్టీ ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. హరికృష్ణ తన మనోభావాలను వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే వాటిని మరిచిపోయి అందరం కలిసి ఉందామని లోకేష్ సూచించినట్లు చెబుతున్నారు. హరికృష్ణతో మరోసారి లోకేష్ సమావేశం జరిపే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఆ తర్వాత తన మామ అయిన బాలకృష్ణతో కూడా మాట్లాడి సోదరులు ఇద్దరిని కలుపుతారని అంటున్నారు.
ఇరువురు నందమూరి సోదరులు ఒక్కటైతే, హరికృష్ణ, ఆయన తనయులు కూడా మళ్లీ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా మనసువిప్పి మాట్లాడేందుకు లోకేష్ సిద్ధమవుతున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడెైన కొడాలి నాని తదితరులు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లడం ఆ తర్వాత ఫ్లెక్సీల గొడవ జరగింది. దీంతో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దాదాపుగా దూరమయ్యారు. బాలకృష్ణ, చంద్రబాబునాయుడు వారి పట్ల గుర్రుగా వ్యవహరిస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి అవసరమైనప్పుడు సేవలు అందిస్తామని జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఒక్కటి రెండు సార్లు చెప్పారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్‌ను తిరిగి పార్టీ చట్రం కిందికి తీసుకుని రావడం కష్టం కాదని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. లోకేష్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications