చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజెన్స్ పంచ్: సీఐఐ స్థాయిని తగ్గించిన సీఎం!?

గతంలో తాను సీఎంగా పనిచేసినప్పుడు సీఐఐ అనేది చిన్న సంస్థ అని, తాను ప్రమోట్ చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చిందని అర్థం వచ్చేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: అభివృద్దికి కేరాఫ్‌గా.. టెక్నాలజీకి ఆద్యుడిగా తనను తాను ప్రపంచ వేదికలకు పరిచయం చేసుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐఐని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి.

తన పనితీరును ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో.. ఇతర సంస్థల స్థాయిని తగ్గించి మాట్లాడటం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 120ఏళ్లుగా దేశంలో పారిశ్రామికాభివృద్ది కోసం కృషి చేస్తున్న సీఐఐ(కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్)ను పట్టుకుని.. తనవల్లే సంస్థకు పేరొచ్చిందంటూ చంద్రబాబు పేర్కొనడం తీవ్ర వివాదస్పదమవుతోంది.

గతంలో తాను సీఎంగా పనిచేసినప్పుడు సీఐఐ అనేది చిన్న సంస్థ అని, తాను ప్రమోట్ చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చిందని అర్థం వచ్చేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీంతో తన స్థాయిని గొప్పగా చెప్పుకోవడం కోసం ఇతర సంస్థల స్థాయిని తగ్గించి మాట్లాడించాలా? అన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

సీఐఐకి ఏపీ చాప్టర్ కి చెందిన ఉన్నతాధికారి ఒకరు దీనిపై స్పందించారు. సీఎం గొప్పల కోసం సీఐఐ స్థాయిని తగ్గించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఇటు సోషల్ మీడియాలోను సీఎంపై నెటిజెన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దావోస్ నే అమరావతికి తీసుకొస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఇక రేపో మాపో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయాన్ని సైతం చంద్రబాబు అమరావతికి తీసుకువస్తారంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Netizens mocks chandrababu on his cii comments

సీఎం చేసిన వ్యాఖ్యలకు సీఐఐ ప్రతినిధులు సైతం ఒకింత విస్మయానికి గురైనట్టుగా చెప్పుకుంటున్నారు. సీఐఐ లాంటి స్వతంత్ర సంస్థను తన రాజకీయాల్లోకి లాగడం పట్ల వారు ఇబ్బందికి గురైనట్టు తెలుస్తోంది.

సీఐఐ చరిత్ర ఇది:

సీఐఐ అనే సంస్థ ఆయా కంపెనీలు, కార్పోరేట్ సంస్థల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పనిచేసే స్వతంత్ర సంస్థ. తొలినాళ్లలో.. 1895లో ఐదు ఇంజనీరింగ్ తయారీ సంస్థలతో ఇంజనీరింగ్ అండ్ ఐరన్ ట్రేడ్స్ అసోసియేషన్ గా సీఐఐ ప్రస్థానం మొదలైంది.

ఆ తర్వాత 1912లో ఇండియన్ ఇంజనీరింగ్ అసోసియేషన్, 1942లో ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా దాని పేర్లు మారాయి. అప్పటివరకు కేవలం బ్రిటీష్ కంపెనీ సేవలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్థ స్వాతంత్య్రానంతరం 1947లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ గా మారింది.

తర్వాతి కాలంలో.. 1986లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ (సీఈఐ)గా జాతీయస్థాయిలో సేవలందించింది. అలా 1991 వరకు ఇంజనీరింగ్ రంగానికే పరిమితమైన ఈ సంస్థ.. 1992లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)గా మారింది.

ప్రస్తుతం సీఐఐలో 8వేల మందికి ప్రత్యక్ష సభ్యత్వముండగా.. పరోక్షంగా 2లక్షల మందికి సభ్యత్వం ఉంది. మొత్తంగా సీఐఐకి మొత్తం 64కార్యాలయాలు ఉండగా.. ఇందులో విదేశాల్లో 8చోట్ల సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+