బాబు ప్రమోషన్: లాజిస్టిక్ హబ్‌గా.. (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల దృష్టిలో పడేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారంనాడు ఓసాకా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు విశేషమైన అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు.

ఐటిలో తాము బలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం రెండు విభజన జరిగిందని ఆయన చెప్పారు. హైదరాబాదును తాను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదును టెక్నాలజీలో బలంగా తయారు చేసినట్లు ఆయన తెలిపారు. భారత్ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది కీలక పాత్ర అని ఆయన అన్నారు. ప్రాసెసింగ్ రంగంలో తాము పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎపిని లాజిస్టిక్ హబ్‌గా తయారు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రాసెసింగ్ రంగంలో తాము పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. సింగపూర్‌, మలేషియాలకు ఎపి నుంచే ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎపిలో 15 చిన్న, పెద్ద నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇతర దేశాల్లో కన్నా భారతదేశంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆయన నమ్మబలికారు. ఎపిలోని పర్యాటక రంగంలో విశేషమైన అవకాశాలున్నట్లు చెప్పారు. సోమవారంనాడు ఆయన పారిశ్రామికవేత్తలను ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు. తాము కల్పిస్తున్న ప్రోత్సహకాలను వివరించారు.

ఏడు రోజుల్లో అనుమతులు

ఏడు రోజుల్లో అనుమతులు

పరిశ్రమల స్థాపనకోసం దరఖాస్తు చేసుకున్న వారంలో రోజుల్లోనే అన్ని అనుమతులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనలో స్పష్టం చేశారు. సింగిల్ విండో విధానం ద్వారా ఏడు రోజుల్లో అనుమతులు ఇస్తామని, ఎనిమిదో రోజునుంచే పనులు ప్రారంభించుకోవచ్చునని స్పష్టం చేశారు.

బిజీగా చంద్రబాబు

బిజీగా చంద్రబాబు

జపాన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తొలిరోజు అనేక కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన ఎన్‌ఐడిఇసి సంస్థ అధ్యక్షుడు నాగమోరి, ఇతర ప్రతినిధులతో భేటీ అయి పారిశ్రామిక, పెట్టుబడులపై చర్చించారు.

ఇప్పుడలా కాదు...

ఇప్పుడలా కాదు...

రాష్ట్రంలో పారిశ్రామికీకరణకోసం తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గతంలో అనుమతుల్లో జాప్యం, రెడ్ టేపిజం వల్ల సంస్థలను ప్రారంభించలేకపోయామని నాగమోరి బృందం పేర్కొనగా, అప్పటి పరిస్థితులు దేశంలో ఇప్పుడు లేవని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకమైన విధానాలు అవలంభిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అందువల్ల పరిశ్రమల స్థాపనకు వచ్చే వారికి త్వరితగతిన అనుమతులు వస్తున్నాయని వివరించారు.

మోటార్ల ద్వారానే..

మోటార్ల ద్వారానే..

ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో 53 శాతం వరకు మోటార్ల ద్వారానే జరుగుతున్నాయని, మోటార్ల పనితీరు మెరుగుపరిస్తే విద్యుత్ ఆదా చేయవచ్చునని నాగమోరి అభిప్రాయపడ్డారు.

విదేశీమారక ద్రవ్యం లభించే విధంగా.

విదేశీమారక ద్రవ్యం లభించే విధంగా.

భారతదేశంలో తమ సంస్థలను ఏర్పాటుచేసి ఎగుమతుల ద్వారా ఆ దేశానికి విదేశీమారక ద్రవ్యం లభించేలా చూస్తామని నాగమోరి పేర్కొన్నారు. ఈ తరుణంలోనే రాష్ట్రంలో ఒక పరిశ్రమ ఏర్పాటుచేస్తే వారంలోనే అన్ని అనుమతులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మౌలిక వసతులు కల్పిస్తాం..

మౌలిక వసతులు కల్పిస్తాం..

రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా, రోడ్లు, రైలు వంటి రవాణా సౌకర్యాలు, విశాఖ, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వంటి ఓడరేవుల ద్వారా ఎగుమతి, దిగుమతులకు అవకాశాలు ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి ప్రదర్శించిన డాక్యుమెంటరీలో ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం అంటూ జపాన్ భాషలో ఉండడం ఎన్‌ఐడిఇసి అధికారులను ఆకర్షించింది.

ఎన్మార్ వ్యవసాయ సంస్థ సందర్శన

ఎన్మార్ వ్యవసాయ సంస్థ సందర్శన

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒసాకాలోని కాన్సాయ్ విమానాశ్రయంలో జపాన్ చేరుకున్న ముఖ్యమంత్రి బృందం తొలుత ఎన్మార్ వ్యవసాయ యాంత్రిక, పరికరాల సంస్థను సందర్శించింది. వ్యవసాయంలో లాభాలు చేకూర్చేందుకు వినియోగించే అనేక పరికరాలను పరిశీలించారు.

వ్యవసాయంపై దృష్టి

వ్యవసాయంపై దృష్టి

ఎన్మార్ వ్యవసాయ యాంత్రిక పరికరాల సంస్థ ఎండి నోకి కొబాయెషి అక్కడి వివరాలను అందించారు. జపాన్‌లో వ్యవసాయం ఎలా సరళీకృతంగా ఉందో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

దిగుబడి పెంచేందుకు

దిగుబడి పెంచేందుకు

తమిళనాడులోని ఒక సంస్థతో జపాన్ సంస్థ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా అదే సహకారాన్ని అందించాలని చంద్రబాబు కోరారు.వ్యవసాయంలో ఖర్చును తగ్గిస్తూ, దిగుబడి పెంచేందుకు అవసరమైన పరికరాల వినియోగంపై చర్చించారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

ముఖ్యమంత్రితోపాటు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ మంత్రి నారాయణ, ఎంపి గల్లా జయదేశ్, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, జె.సత్యనారాయణ, ఇతర అధికారులు సతీష్‌చంద్ర, టక్కర్, జెఎస్‌వి ప్రసాద్, ఇంటలిజెన్స్ చీఫ్ అనురాధ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+