• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీతారామన్-పరకాల జర్నీ: పరిచయం, ప్రేమ!, కలిసింది అక్కడే.. బీబీసీలోను!

|
  Nirmala Sitharaman Parakala Prabhakar Love Story Begins Here.....

  న్యూఢిల్లీ/విజయవాడ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్ ఆమె భర్త కావడంతో.. తెలుగింటి కోడలికి మంచి గౌరవం దక్కిందన్న చర్చ జరుగుతోంది.

  అదే సమయంలో అసలు పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ ల మధ్య ఎప్పుడు పరిచయం ఏర్పడింది?, వాళ్లిద్దరి మధ్య పెళ్లికి దారితీసిన పరిస్థితులేమిటి? అన్నదానిపై ఆసక్తి మొదలైంది. తమిళనాడులోని మధురైకి చెందిన నిర్మలా సీతారామన్‌కు, ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్‌కు ఢిల్లీలోని జేఎన్‌యూ యూనివర్సిటీలో పరిచయం ఏర్పడింది.

  సీతారామన్ నేపథ్యం:

  సీతారామన్ నేపథ్యం:

  నిర్మలా సీతారామన్ 18 ఆగస్టు, 1959లో తమిళనాడులోని మధురైలో జన్మించారు. తండ్రి నారాయణన్‌ సీతారామ్‌ రైల్వే ఉద్యోగి. తల్లి సావిత్రి గృహిణి. తండ్రి నేర్పిన క్రమశిక్షణ, తల్లి నుంచి అబ్బిన పుస్తకపఠనం నిర్మలలో ఆత్మవిశ్వాసం పెంచాయి. మధురైలో స్కూలింగ్ పూర్తి చేసుకున్న ఆమె.. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు.

  పరకాలతో పరిచయం, బీబీసీలోను:

  పరకాలతో పరిచయం, బీబీసీలోను:

  డిగ్రీ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నుంచి 1980లో ఎకనామిక్స్ విభాగంలో పీజీ పూర్తి చేశారు. ఇక్కడ చదువుకుంటున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురానికి చెందిన పరకాల ప్రభాకర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

  బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పరకాల ప్రభాకర్.. ఆ సమయంలో ఎంఫిల్ చేస్తున్నారు.

  పీజీ తర్వాత ఆమె ప్రైస్ వాటర్ కూపర్స్ అనే కంపెనీలో సీనియర్ మేనేజర్ గా సేవలందించారు. ఆపై బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్(బీబీసీ)లోను పనిచేశారు.

  1986లొ వివాహం

  1986లొ వివాహం

  పీజీ తర్వాత జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారీఫ్స్‌ అండ్‌ ట్రేడ్‌ అంశంలో ఎంఫిల్‌, ఆపై పీహెచ్‌డీ ఇండో-యూరోపియన్‌ టెక్స్‌టైల్‌ ట్రేడ్‌ అంశంపై రీసెర్చ్‌కు గాను సీతారామన్ పట్టాలు పొందారు. జేఎన్‌యూలో చదువు ముగించుకున్న తర్వాత 1986లొ పరకాల ప్రభాకర్-సీతారామన్‌ల వివాహం జరిగింది. ఇద్దరూ హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.

  రాజకీయ నేపథ్యం:

  రాజకీయ నేపథ్యం:

  ఇక రాజకీయాల విషయానికొస్తే.. 2000సంవత్సరంలో ప్రభాకర్‌ బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006లో నిర్మలా సీతారామన్‌ అధికారికంగా బీజేపీలో చేరారు. నితిన్‌ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు.

  అప్పటి నుంచి ఆమె బీజేపీ ప్రముఖుల్లో ఒకరిగా కొనసాగుతున్న ఆమెకు.. 2014 ఎన్నికల తరువాత మోదీ కేబినెట్‌ లో సహాయ మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు ఏకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి వరించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఆ పదవిని చేపట్టిన మహిళా నేతగా నిర్మలా సీతారామన్ చరిత్రకెక్కారు.

  పరకాల తండ్రి కమ్యూనిస్ట్:

  పరకాల తండ్రి కమ్యూనిస్ట్:

  పరకాల ప్రభాకర్ తండ్రి పి.శేషావతారం ఒకప్పుడు కమ్యూనిస్టు నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన కాంగ్రెస్ లో చేరి ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో పనిచేశారు. పరకాల తల్లి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. పరకాల ప్రభాకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.

  సీతారామన్ పనితీరు:

  సీతారామన్ పనితీరు:

  2014లో కామర్స్ మినిస్ట్రీ అప్పగించిన తర్వాత ఎగుమతుల విషయంలో సీతారామన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్యం(ఆర్.సీ.ఈ.పీ), వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తో చర్చలు జరిపారు. ఆమె జరిపిన చర్చల ఫలితంగా దేశీయంగా ట్రేడ్ వర్గాలకు మేలు జరిగినట్లు చెబుతారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Nirmala Sitharaman's elevation to the Defence Ministry marks the culmination of a long path that began in Tamil Nadu and shifted to Jawaharlal Nehru University along the way.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more