• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిజాయితీగా బాలయ్య ‘ఎన్టీఆర్ బయోపిక్’ సాధ్యమేనా?: ఆ వివాదాల జోలికెళ్తారా?

By Swetha Basvababu
|

హైదరాబాద్/ అమరావతి: అఖిలాంధ్ర కోటికి ఆరాధ్యనీయుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు.. పురాణ గాథలు, దేవతల గాథలపై వచ్చిన సినిమాల్లో ఆయన రూపమే అందరికీ దేవతారూపంగా స్పురిస్తుంది. ఆయన అంటే ఎంత భక్తి భావమో అంతే గౌరవం కూడా. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టింది. తెలుగునాట రాజకీయాలకు దూరంగా ఉన్న సామాజిక వర్గాలను ప్రత్యేకించి బీసీలకు నాయకత్వ స్థానం కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే.

ఇలా తెలుగునాట కీలక రాజకీయాలే కాక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్.. రాజకీయ ప్రత్యర్థులకు సైతం గౌరవనీయుడంటే అతిశయోక్తి కాదు.

చంద్రబాబుపై ఎన్టీఆర్ ఇలా విమర్శలు

చంద్రబాబుపై ఎన్టీఆర్ ఇలా విమర్శలు

ఇలా రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ 1989లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో లక్ష్మీపార్వతిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. 1994లో గెలుపొందిన తర్వాత ఆమెను అడ్డం పెట్టుకుని టీడీపీలో చంద్రబాబు చీలిక తెచ్చారన్న విమర్శ ఉన్నది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మాటల్లో చెప్పాలంటే జమాతాగ్రహం.. వెన్నుపోటుదారుడని చంద్రబాబుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ మరణించి 22 ఏళ్లైంది.

తండ్రి బయోపిక్ జాతి గర్వించేలా నిర్మిస్తానన్న బాలయ్య

తండ్రి బయోపిక్ జాతి గర్వించేలా నిర్మిస్తానన్న బాలయ్య

ఈ సందర్బంగా భాగ్యనగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సంప్రదాయంగా మహా నటుడికి నందమూరి కుటుంబ సభ్యులు గురువారం నివాళులర్పించారు. ఈ క్రమంలో నందమూరి బాలక్రుష్ణ మీడియాతో మాట్లాడుతూ దేశం గర్వించేలా తన తండ్రి బయోపిక్ చిత్రం నిర్మిస్తామని సగర్వంగా చెప్పారు. అయితే ఆయన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీలో ఒక ఎమ్మెల్యే. చంద్రబాబు కొడుకు లోకేశ్‌కు తన బిడ్డనిచ్చి వియ్యంకుడయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశం గర్వించే స్థాయిలో సినిమా నిర్మిస్తామని సగర్వంగా ప్రకటిస్తున్న బాలయ్య తన మాటకు ఏ మేరకు నిలబడతారన్నది సందేహస్పదమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రాజమహేంద్ర వరంలో భారీగా జన సమీకరణతో బాబు ఆశ్చర్యం

రాజమహేంద్ర వరంలో భారీగా జన సమీకరణతో బాబు ఆశ్చర్యం

1989 - 94 మధ్య తొలిసారి తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రజాదరణ లేదని బహిరంగ సభలు పెట్టొద్దని నాడు ఎన్టీఆర్‌ను నివారించిన ఘనత ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుది. కానీ అనూహ్య పరిస్థితుల్లో రాజమహేంద్రనగరం వద్ద నిర్వహించిన బహిరంగసభకు భారీగా జనం తరలి వస్తే అచ్చెరువొందిన నేపథ్యం చంద్రబాబుది. చంద్రబాబు ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్వయంగా ఒక మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పారు.

లక్ష్మీ పార్వతి సాకుగా టీడీపీలో అంతర్గత వైరుద్యాలకు దారి ఇలా

లక్ష్మీ పార్వతి సాకుగా టీడీపీలో అంతర్గత వైరుద్యాలకు దారి ఇలా

రాజమహేంద్రవరం సభ కొనసాగింపుగా నల్లగొండలో జరిగిన సభకు అన్నింటా తానై వ్యవహరించిన చంద్రబాబు నాయుడు.. నాటి ఎన్టీఆర్ సతీమణిగా లక్ష్మీ పార్వతితో రాజీ పడిన దాఖలాలు ఉన్నాయని చెబుతారు. 1994 ఎన్నికల వేళ ‘రాజీ' ఫార్ములాతో పని చేసిన చంద్రబాబు.. తర్వాత లక్ష్మీ పార్వతి సాకుగా తెలుగుదేశం పార్టీలో అంతర్గత వైరుద్యాలకు దారి తీశారని ఆరోపణలు ఉన్నాయి.

అన్ని జిల్లాల్లోనూ అమలు గానీ ఎన్టీఆర్ సీల్డ్ కవర్ సిఫారసు

అన్ని జిల్లాల్లోనూ అమలు గానీ ఎన్టీఆర్ సీల్డ్ కవర్ సిఫారసు

1995లో డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్ల ఎన్నికకు ఎన్టీఆర్ ‘సీల్డ్ కవర్'లో నేతల పేర్లు పంపే సంప్రదాయాన్ని కొనసాగించారు. కానీ కొన్ని జిల్లాల్లో ఆయన ప్రతిపాదించిన పేర్లు కాదని ఇతరులను ఎన్నుకున్న ఘటనలు శ్రీకాకుళం, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల పరిధిలో జరిగాయి. వారిపై సస్పెన్షన్ వేటు వేయమని సిఫారసు చేసి.. దానికి ఎన్టీఆర్ కారణమని సదరు ఎమ్మెల్యేల్లో అనుమాన బీజాలు రేకెత్తించిన నాటి ఆర్థిక, రెవెన్యూ వ్యవహారాలశాఖ మంత్రి చంద్రబాబుది. ఇలా మామా అల్లుళ్ల మధ్య మొదలైన విభేదాల పర్వం.. 1995 ఆగస్టుకు వచ్చేసరికి పరాకాష్టకు చేరుకున్నది.

వైస్రాయి వేదికగా టీడీపీలో ఇలా చీలిక

వైస్రాయి వేదికగా టీడీపీలో ఇలా చీలిక

1995 ఆగస్టు చివరిలో ‘ప్రజల వద్దకు పాలన' పేరిట ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్ తన క్యాబినెట్ తో పర్యటిస్తున్న నేపథ్యంలో మధ్యలోనే హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు.. వైస్రాయి హోటల్ వేదికగా తిరుగుబాటుకు పూర్వ రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్టీఆర్ తిరిగి భాగ్యనగరానికి చేరుకునేసరికి... వైస్రాయి హోటల్‌లో ‘ఎమ్మెల్యే'ల శిబిరం ఏర్పాటైంది. ఆ మాటకు వస్తే అంతకుముందు నెలా రెండు నెలల ముందు నుంచే ‘వైస్రాయి' శిబిరంలో ఏర్పాట్లు చేపట్టారు. నాడు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లడమే గానీ తిరిగి రావడం కుదరలేదు. ఇలా వెళుతున్న ఎమ్మెల్యేల సంఖ్యపై నాటి నుంచి ఈ నాటి వరకు చంద్రబాబుకు అనుకూలంగా.. గురు మీడియా సంస్థగా ఉన్న చానెల్ ఒకటి ఎప్పటికప్పుడు సంఖ్యను పెంచేస్తూ ఏదో జరిగిపోయిందన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది.

వ్యూహాత్మకంగా నందమూరి కుటుంబంతో బాబు సన్నిహిత బంధం

వ్యూహాత్మకంగా నందమూరి కుటుంబంతో బాబు సన్నిహిత బంధం

నాడు తెలుగునాట అంతా లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తి వల్లే ఇది జరిగిందన్న వాతావరణం కల్పించారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబ సభ్యులుగా దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు, నందమూరి బాలక్రుష్ణ, హరి క్రుష్ణ తదితరులను వ్యూహాత్మకంగా దగ్గరకు తీసుకున్నారు చంద్రబాబు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్లి చిక్కుకున్న వారు మరి కొందరు. పార్టీలో చీలిక ఖరారు చేయడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి కల్పిస్తామని ఆశల ఊసులు రేకెత్తించారు.

డిప్యూటీ సీఎం అంటే ఆరోవేలన్న ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్

డిప్యూటీ సీఎం అంటే ఆరోవేలన్న ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్

అంతా సవ్యంగా పూర్తయిన తర్వాత ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజుతో ‘డిప్యూటీ సీఎం' అంటే ఆరోవేలు అని చెప్పించి.. దగ్గుబాటి వెంకటేశ్వరరావును తప్పించారు. ఇలా తప్పుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్ది రోజులకే మామ ఎన్టీఆర్ దగ్గరకు చేరుకున్నారు. తర్వాత వ్యూహాత్మకంగా నాటి మంత్రిగా చేర్చుకున్న హరిక్రుష్ణను పక్కకు నెట్టేశారు.

2004, 2009ల్లో వైఎస్ వ్యూహంతో విపక్షానికే బాబు పరిమితం

2004, 2009ల్లో వైఎస్ వ్యూహంతో విపక్షానికే బాబు పరిమితం

నాటి నుంచి 2004 వరకు సీఎంగా, టీడీపీ అధినేతగా చంద్రబాబు పూర్తిగా పట్టు సాదించారు. తర్వాత జననేతగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అకళింపు చేసుకుని.. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మరోవైపు టీఆర్ఎస్, తొలిసారి వామపక్షాల మద్దతుతో అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వ్యూహం ముందు రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యారు.

2014 ఎన్నికల్లో పురందేశ్వరికి ఇలా కష్టాలు

2014 ఎన్నికల్లో పురందేశ్వరికి ఇలా కష్టాలు

2004 తర్వాత మరో వ్యూహంతో బాలక్రుష్ణ తనయ బ్రాహ్మిణిని తన కోడలుగా చేసుకుని నందమూరి కుటుంబం బహిరంగంగా తనను ఎదిరించకుండా చేసుకున్నారని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ విభజనతో మారిన తప్పనిసరి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన పార్లమెంట్ స్థానమే లేకుండా చేశారని విమర్శలు ఉన్నాయి. ఇక నందమూరి ఆడబడుచు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిధున్ రెడ్డిపై రాజంపేట నుంచి పోటీ చేసి దగ్గుబాటి పురందేశ్వరి ఓటమి పాలయ్యారు.

ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీపైనా బాబు ఆత్మరక్షణ ధోరణి

ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీపైనా బాబు ఆత్మరక్షణ ధోరణి

తాజాగా 2014లో రకరకాల కారణాలతో ఏపీ వాసులు టీడీపీని గెలిపిస్తే.. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాజధాని నిర్మాణం కోసం భారీగా భూసేకరణ జరిపారు. బీజేపీ మద్దతుతో 15 ఏళ్ల ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన చంద్రబాబు.. తర్వాత 2015లో ‘ఓటుకు నోటు' కుంభకోణంలో తన పాత్రతో బెజవాడకు చేరుకుని.. ప్రత్యేక హోదా స్థానే ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌కు పరిమితమయ్యారు. దాన్ని కూడా గట్టిగా అడుగలేని ఆత్మరక్షణా ధోరణి చంద్రబాబుదని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

అన్నగారి జీవితంలో విభేదాలు యథతథంగా వస్తేనే బెస్ట్

అన్నగారి జీవితంలో విభేదాలు యథతథంగా వస్తేనే బెస్ట్

అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడే వారికి అవకాశం ఇవ్వకుండా అణచివేయడంలో ముందు ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రుల్లో తలెత్తిన వ్యతిరేకతను అధిగమించేందుకు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర నిర్మాణం ముందుకు వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నది. అయితే ఒక్కమాట.. అంతా ‘అన్నగారు' అని పిలుచుకునే ఎన్టీఆర్ బయోపిక్ జీవితంలో జరిగిన మార్పులను యథాతథంగా బాలయ్య నిర్మించగలిగితే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే సినిమాయే అవుతుంది. లేదంటే తన వియ్యంకుడు చంద్రబాబు.. అల్లుడు లోకేశ్‌కు భావి సారథ్యం కట్టబెట్టేందుకు బాలయ్య చేస్తున్న ప్రయత్నంగానే ప్రజలు చూస్తారని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nandamoori Balakrishna declared that 'NTR biopic' shooting will starts from next March and it will pride to nation. But political analystists suspect this idea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more