వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యాకేజీ వెనుక..: బాబు వ్యూహం-భయం, పవన్ ఏమంటారు?

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఓ మాట చెప్పారు. తాను సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడనని చెప్పారు. పవన్ సభ ప్రభావం వల్ల ఇటు టిడిపిలో, అటు కేంద్రంలో సాయంపై కదలిక వచ్చిందంటున్నారు.

గత రెండేళ్లుగా ప్రత్యేక హోదా లేదా దానికి మించి ప్యాకేజీ అని చెబుతున్న బీజేపీలో ఎలాంటి కదలిక లేదని, హోదా సాధిస్తామని చెబుతున్న టిడిపి అది చెప్పడం వరకే సరిపోయిందని, విపక్షాలు డిమాండ్లు చేసే వరకే సరిపోయిందని.. కానీ పవన్ మాత్రం కదలిక తెచ్చారని గుర్తు చేస్తున్నారు.

ఇద్దరినీ కదిలించిన పవన్!

ఇద్దరినీ కదిలించిన పవన్!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అటు బీజేపీని, ఇటు టీడీపీని.. రెండు పార్టీలను కదిలించారని అంటున్నారు. కాంగ్రెస్, వైసిపిల హోదా ఉద్యమాన్ని టిడిపి గానీ, బీజేపీ కానీ పట్టించుకోలేదు. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పవన్.. అదీ జనాకర్షణ కలిగిన పవన్ నిలదీయడంతో ఆ రెండు పార్టీలను కదిలించిందని అంటున్నారు.

ఇరుకునపడతామని..

ఇరుకునపడతామని..

పవన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తే తాము ఇరుకున పడటం ఖాయమని టిడిపి, బిజెపిలు భావించి ఉంటాయని, కాబట్టి హోదా ఇవ్వలేకపోయినప్పటికీ, ఆయన ఉద్యమం కారణంగా ఆ పేరు లేకుండా హోదా వంటి ప్యాకేజీకి సిద్ధమయిందని అంటున్నారు.

పవన్ సభ పెట్టాక ఏం లాభం

పవన్ సభ పెట్టాక ఏం లాభం

అందరు బహిరంగ సభలు పెట్టాక హోదాను మించిన ప్యాకేజీ పైన ప్రకటన చేస్తే ఏం లాభమని.. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా వరుస సమావేశాలను ఉద్దేశించి కేంద్రమంత్రులను చంద్రబాబు ఘాటుగానే ప్రశ్నించారని అంటున్నారు. మొత్తానికి తిరుపతిలో పవన్ సభ బీజేపీని కదిలించిందని, ముఖ్యంగా చంద్రబాబును కదిలించిందని.. ఆయన కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చి భారీ ప్యాకేజీ ప్రకటన వచ్చేలా చేస్తున్నారని అంటున్నారు.

ప్యాకేజీపై టిడిపి వ్యూహం

ప్యాకేజీపై టిడిపి వ్యూహం

ప్రత్యేక హోదా పైన తగ్గమని చెబుతున్న టిడిపి భారీ ప్యాకేజీకి సిద్ధమవడం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్యాకేజీతో ఆ సమస్యలు కొంతైనా తీరుతాయి. హోదా అనేది దీర్ఘకాలిక సమస్యలను తీర్చేది. తాత్కాలిక ఇబ్బందులు పోయాక.. హోదా పైన మరింత గట్టిగా పోరాడాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.

పవన్ స్పందన ఏమిటి?

పవన్ స్పందన ఏమిటి?

హోదా పేరు లేకపోయినప్పటికీ.. అలాంటి భారీ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ విపక్షాల నుంచి, హోదా డిమాండ్ చేస్తున్న ఉద్యమకారులన నుంచి ఎలాంటి స్పందన వస్తుందోననే ఆందోళన టిడిపిలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది.

English summary
Pawan Kalyan arise TDP! Behind Chandrababu strategy one package!!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X