విభజన: కిరణ్ రెడ్డిని శాంతపరిచారా? (పిక్చర్స్)

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెత్తబడినట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం శాంతపరిచినట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరించేది లేదంటూ గత కాలంగా చెబుతూ విభజనను అడ్డుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధమంటూ చెబుతూ వచ్చారు. అయితే, శుక్రవారం ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాంతో ఆయన మెత్తబడినట్లు చెబుతున్నారు.

తొలుత దిగ్విజయ్ సింగ్‌తో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం కాంగ్రెసు వార్ రూంలో సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సమన్వయ కమిటీ భేటీలో దిగ్విజయ్ సింగ్ - సిడబ్ల్యుసి నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని, విభజన చేయడం ఖాయమని, అందువల్ల దానికి సహకరిస్తే మంచిదని కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం.

కాగా, విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి మెత్తబడినట్లు వచ్చినట్లు వార్తలను ఆయన వర్గం ఖండిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి తన సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారని, ఆ విషయంలో వెనక్కి తగ్గబోరని ఆయన వర్గం వాదిస్తోంది. సమన్వయ కమిటీ భేటీలో కిరణ్ కుమార్ రెడ్డి విభజన వల్ల తలెత్తే సమస్యలను వివరించినట్లు సమాచారం. నదీ జలాల పంపకం, హైదరాబాద్ విషయంలో తలెత్తే సమస్యలను ఆయన దిగ్విజయ్‌కి మరోసారి వివరించినట్లు చెబుతున్నారు.

కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం హైదరాబాదు విషయంలో మరోసారి తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో సీమాంధ్రులు భయాందోళనలకు గురవుతున్నారని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఆందోళనలను సద్దుమణిగే అవకాశం ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం.

దిగ్విజయ్ సింగ్‌తో కెవిపి భేటీ

దిగ్విజయ్ సింగ్‌తో కెవిపి భేటీ

రాష్ట్ర కాంగ్రెసు సమన్వయ కమిటీ సమావేశానికి ముందు ఢిల్లీలో సీమాంధ్ర రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను ఆయన వివరించినట్లు సమాచారం.

ఢిల్లీలో కిరణ్ రెడ్డి ఇలా...

ఢిల్లీలో కిరణ్ రెడ్డి ఇలా...

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బిజీగా గడిపారు. జివోఎంకు నదీ జలాల పంపకంపై నివేదిక సమర్పించిన కేంద్ర జైరామ్ రమేష్‌ను ఆయన కలిశారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు.

దిగ్విజయ్‌తో కిరణ్ ఇలా...

దిగ్విజయ్‌తో కిరణ్ ఇలా...

రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్‌తో కిరణ్ కుమార్ రెడ్డి ఇలా కనిపించారు.

దిగ్విజయ్‌తో బొత్స ఇలా..

దిగ్విజయ్‌తో బొత్స ఇలా..

సమన్వయ కమిటీ సమావేశానికి ముందు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. దిగ్విజయ్ సింగ్‌తో బొత్స సత్యనారాయణ ఇలా కనిపించారు.

దిగ్విజయ్‌తో దామోదర ఇలా..

దిగ్విజయ్‌తో దామోదర ఇలా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన వాదనను వినిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. దిగ్విజయ్ సింగ్‌తో ఆయన ఇలా కనిపించారు.

మీడియాతో దిగ్విజయ్..

మీడియాతో దిగ్విజయ్..

మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చబోమని, ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనకు సహకరిస్తారని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత విధేయుడని, కిరణ్ తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా కాంగ్రెసు విధేయులని దిగ్విజయ్ చెప్పారు.

ముఖ్యమంత్రి తన పట్టు వీడారా..

ముఖ్యమంత్రి తన పట్టు వీడారా..

రాష్ట్ర విభజనకు సహకరించాలంటూ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కౌన్సెలింగ్ చేసినట్లు చెబుతున్నారు. విభజనకు సహకరిస్తే పార్టీకీ, మీకు మంచిదని ఆయన నచ్చజెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+