వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవేశంగా లగడపాటి ఔట్, కావూరి మౌనం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులతో కాంగ్రెసు అధిష్టానం మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వార్ రూం సమావేశం హాట్ హాట్‌గా సాగింది. ఈ సమావేశానికి సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్ దూరంగా ఉన్నారు. వార్ రూంలో ప్రాంతాల వారీగాహోరీ జరిగింది.

వార్ రూం భేటీకి దిగ్విజయ్ సింగ్‌తో పాటు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వచ్చారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, బలరాం నాయక్, చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, కిల్లి కృపారాణి హాజరయ్యారు.

పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, నంది ఎల్లయ్య, నంది ఎల్లయ్య, రాపోల్ ఆనంద భాస్కర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కెవిపి రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు.

వార్ 1

వార్ 1

సీమాంధ్ర నేతల్లో కొందరు సున్నితంగా, మరికొందరు ఘాటుగా, ఇంకొందరు నిష్టూరంగా వార్ రూంలో తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.

వార్ 2

వార్ 2

విభజన బిల్లును గట్టెక్కించేందుకు, ఇరుప్రాంతాల వారికీ సర్ది చెప్పే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, జివోఎం సభ్యులు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్, పార్టీ నేత ఖుంటియా మంగళవారం రాత్రి ఢిల్లీ రికాబ్‌గంజ్‌లోని వార్‌రూమ్‌లో ఇరుప్రాంతాల ఎంపీలను సమావేశ పరిచారు.

వార్ 3

వార్ 3

విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత అధిష్ఠానం ఇలా ఇరుప్రాంతాల నేతలను ఒక్కచోట సమావేశ పరిచి చర్చించడం ఇదే మొదటిసారి.

వార్ 4

వార్ 4

మంగళవారం రాత్రి ఏడు గంటలకు మొదలై సుమారు మూడు గంటలపాటు సాగిన వార్ రూం సమావేశం ఆద్యంతం వాడివేడిగా జరిగింది.

వార్ 5

వార్ 5

విభజన ప్రక్రియకు సహకరించాలని, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు విమర్శించేందుకు తావివ్వకుండా సభ సజావుగా జరిగేలా చూడాలని పార్టీ పెద్దలు సీమాంధ్ర నేతలను కోరారు.

వార్ 6

వార్ 6

కానీ సీమాంధ్ర ఎంపీలు పలువురు అధిష్ఠానం తీరును దుయ్యబట్టారు. మరీ ముఖ్యంగా... లగడపాటి రాజగోపాల్, హర్ష కుమార్ తదితరులు తీవ్రంగా స్పందించారు.

వార్ 7

వార్ 7

"అసెంబ్లీకి తప్పుడు బిల్లు పంపించారు. దీనిని అసెంబ్లీ తిరస్కరించింది. తెలంగాణ ఇవ్వాలనుకోవడం, తెలుగు ప్రజలను చీల్చాలని చూడటం పొరపాటు నిర్ణయం'' అని హర్ష ఆగ్రహం వ్యక్తం చేశారు.

వార్ 8

వార్ 8

కెసిఆర్ నిరాహార దీక్ష బూటకమని, హరీశ్ రావు అగ్గిపెట్టె లేకుండా కిరోసిన్ పోసుకుని నాటకమాడారని సీమాంధ్ర నేతలు వివరించారట.

వార్ 9

వార్ 9

సీమాంధ్రలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింటుందని, భవిష్యత్తులో ఎప్పుడూ అధికారంలోకి రాదని హెచ్చరించారు. విభజన వల్ల తెలంగాణకూ నష్టం జరుగుతుందంటూ కిరణ్ చెప్పిన గణాంకాలను ఉటంకించారు.

వార్ 10

వార్ 10

లగడపాటి మాట్లాడుతుండగా... తెలంగాణకు చెందిన వీహెచ్, పొన్నం ప్రభాకర్ తదితరులు అడ్డుకున్నారు. 'లగడపాటిలో కాంగ్రెస్ రక్తం లేదు. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మాహుతులు జరుగుతున్నాయి' అని విహెచ్ పేర్కొన్నారు.

వార్ 11

వార్ 11

బిల్లును అడ్డుకోవద్దని ఢిల్లీ పెద్దలు 'ఎలా పెడతారో చూస్తాను. నేను అడ్డుకుంటాను' అని లగడపాటి ప్రకటించి ఆవేశంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.

వార్ 12

వార్ 12

తెలంగాణ ప్రాంత ఎంపీల వాదనను తిప్పికొట్టకుండా చూస్తూ ఊరుకున్నారని సీమాంధ్ర ఎంపీలపైనా లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

వార్ 13

వార్ 13

ఈ సమావేశంలో కావూరు సాంబశివరావు మినహా మిగిలిన కేంద్ర మంత్రులంతా మాట్లాడారు. "విభజన ప్రక్రియ తుది దశలో ఉంది. ఇప్పటిదాకా వచ్చాక వెనక్కి వెళ్లలేం'' అని జైపాల్ రెడ్డి తెలిపారు.

వార్ 14

వార్ 14

సీమాంధ్రులకు న్యాయంచేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి కోరారు. అదే సమయంలో... టి-బిల్లును సమర్థించలేమని కూడా స్పష్టం చేశారు.

వార్ 15

వార్ 15

సీమాంధ్రలో ఎవరూ విభజనను అంగీకరించే ప్రసక్తిలేదని, తాము ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.

వార్ 16

వార్ 16

రాయలసీమకు అన్యాయం జరిగిందని, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు తీరని నష్టం జరిగిందని చెప్పారు. ఈ సమయంలో... 'సీమకు మంచి ప్యాకేజీ ఉంటుంది. ఎలాంటి నష్టం జరగదు' అని జైరామ్ హామీ ఇచ్చారు.

వార్ 17

వార్ 17

అటు సీమాంధ్ర ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు ఇరువురూ గెలుపొందేలా చూస్తామని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఎంపీలతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశం బాగా జరిగిందని, అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నామని, సీమాంధ్ర ఎంపీల ఆందోళన తెలుసుకున్నామని, వాటిని జీవోఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

English summary
The last ditch effort by the Congress to bring about a rapprochement between the Central ministers and MPs of Telangana and Seemandhra regions, at the Congress War Room in Delhi on Tuesday night, on the issue of bifurcation of the state did not get anywhere even after two-hour-long counselling with them by the top honchos of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X