టెక్కీ రేప్: దోషులకు శిక్ష, కోర్టులో ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: సైబరాబాదులో మహిళా టెక్కీపై అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచనల తీర్పు వెలువరించింది. ఏడు నెలలు గడవకుండానే వేగంగా ఒక కేసును విచారించి దోషులకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అమెరికాలో ఉన్న సాక్షులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి నిందితుల నేరాన్ని నిర్ధారించి కటకటాల వెనక్కునెట్టింది. నిర్భయ చట్టం తర్వాత రాష్ట్రంలో నమోదైన తొలి తీర్పు ఇదే కావడం విశేషం.
నిరుడు అక్టోబర్ 18న అభయ ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు సతీష్, వెంకటేశ్వర్లు నేరం చేసినట్లు నిర్ధారణ కావడంతో మెట్రోపాలిటన్ సెషన్స్, మొదటి అదనపు సెషన్స్ జడ్జి నాగార్జున వారికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించారు. దాంతో పాటు వెయ్యి రూపాయల జరిమానాను ఖారారు చేశారు.
విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్తున్న 22 ఏళ్ల అభయను ఏపీ 09 టీవీఏ 2762 అనే నెంబరు గల ఖరీదైన వోల్వో కారులో ఎక్కించుకున్నారు. తీసుకెళ్లాల్సిన చోటుకు కాకుండా దారి మళ్లించి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆ ఇద్దరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గమైన కీచక పర్వం అది.

టెక్కీ రేప్ కేసు ఇలా
బస్సులు దొరక్క టాక్సీ అనుకుని కారు ఎక్కిన టెక్కీని ఇద్దరు దుండగులు చెరిచారు. కారు డోర్లు లాక్ చేసి.. సెల్‌ఫోన్ లాక్కుని అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు.

టెక్కీ రేప్ కేసు ఇలా
పటాన్‌చెరు శివార్లలోని బిర్లా ఓపెన్‌మైండ్ స్కూల్ అవతల నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరితర్వాత మరొకరు అభయపై విరుచుకుపడ్డారు. అయితే అంతకుముందే తాను దారిమళ్లిన విషయాన్ని గమనించింది అభయ. ఆ విషయాన్ని బెంగుళూరులోని తన స్నేహితుడికి తెలియజేసినా ఫలితం లేకుండా పోయింది.

టెక్కీ రేప్ కేసు ఇలా
అభయ నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ కావడంతో అతడు బాలానగర్‌లోని తన స్నేహితుడికి చెప్పాడు. అతడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సంఘటన అనంతరం ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అభయ నిరాకరించింది

టెక్కీ రేప్ కేసు ఇలా
ఢిల్లీలో నిర్భయ ఘటన జరగడంతో సైబరాబాద్ పోలీసులు అభయ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. క్రైమ్స్ అదనపు ఉపకమిషనర్ జి. జానకీషర్మిల అభయతో రెండు రోజులపాటు మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఫిర్యాదు ఇచ్చేలా చేశారు. నిందితుల కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు.

టెక్కీ రేప్ కేసు ఇలా
అనంతరం ఐపీసీ 356, 342, 376(డి) సెక్షన్ల కింద పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. దోషుల కుటుంబ సభ్యులు మాత్రం కోర్టు ఆవరణలో కనిపించారు.

టెక్కీ రేప్ కేసు ఇలా..
అరెస్టు అయినప్పటి జైలులోనే ఉన్న నిందితులు పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినా కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మొత్తం 21 మందిని సాక్షులుగా చేర్చి వారి సాక్ష్యాన్ని నమోదు చేశారు. దోషుల కుటుంబ సభ్యులు కోర్టు ఆవరణలో బుధవారంనాడు ఏడ్చారు.

టెక్కీ రేప్ కేసు ఇలా..
విచారణను ఏప్రిల్ 25వ తేదీన పూర్తి చేసిన న్యాయమూర్తి వారిని దోషులుగా తేలుస్తూ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలు తరపున పబ్లిక్‌ప్రాసిక్యూటర్ నాగరాజు, దోషుల తరపున న్యాయవాది సుధాకర్ వాదనలు వినిపించారు












Click it and Unblock the Notifications